❤️శ్రీనాథకవిసార్వభౌమ.!!❤️(100 చాటువులు .)

❤️శ్రీనాథకవిసార్వభౌమ.!!❤️


🚩 శ్రీనాథుడు అంటే ఒక శృంగార రసాస్వాదక కవిగానే


చాలా మంది భావిస్తారు,


కాని అతనిలో భక్తి, ప్రేమ, దయాలుత్వాన్ని అంతగా గమనించారు. మహా శివభక్తుడు అతను, దేశ భక్తి, రాజ భక్తి కలిగి ప్రజలంటే ప్రీతి కలవాడు.


అందుకే సామాన్యులకు కూడా అర్థం అయ్యే భాషలో చెప్పాడు. సంస్కృతంలో ఎన్ని ఉద్గ్రన్దాలను అనువదించాడో అంత సరళ భాషలోను కవిత్వం చెప్పి అటు పండితుల నోట - ఇటు పామరుల నోట నిలిచిపోయాడు.


శ్రీనాథుని చాటుపద్యములు


రచన: శ్రీనాథుడు


పలుతెరంగుల రంగు పద్మరాగల వీణె


చకచక ప్రభల సాక్షాత్కరింప


సొంపుతో రవ చెక్కడంపు ముంగర చాయ


పవడంపు మోవిపై బరిఢవిల్ల


విరిసి యోసరిలి క్రిక్కిరిసిన చనుదోయి


బిగువున నెర రైక పిక్కటిల్ల


నొసపరి యొయ్యారి ముసుగులో నెరివేణి


కొమరాలి మూపున గునిసియాడ


విరులతావియు నెమ్మేని వెనుక కచ్చ


ఫెళ ఫెళక్కను చిరు దొడల్ బెళుకు నడుము


వలుద పిరుదులు కలికిచూపుల బెడంగు


లొలయ కంగొంటి వేపారి కలువకంటి (1)


అద్దిర కుళుకులు బెళుకులు


నిద్దంపు మెరుంగు దొడల నీటులు గంటే


దిద్దుకొని యేల వచ్చును


ముద్దియ యీ నంబిపడుచు ముచ్చట దీరన్ (2)


వడిసెల చేతబట్టుకొని వావిరి చక్కని పైట జారగా


నడుము వడంకగా బిరుదు నాట్యము సేయగ గొప్పువీడగా


దుడదుడ మంచె యెక్కె నొక దొడ్డమిటారపు గమ్మ కూతురున్


దొడదొడ మంచమెక్కె నొక దొడ్డమిటారపు రెడ్డి కూతురున్ (3)


అంగడివీథి పల్లవుల కాసగ మామిడిపండు లమ్ముచున్


జంగమువారి చిన్నది పిసాళితనంబున జూచెబో నిశా


తాంగజ బాణ కైరవ సితాంబుజ మత్త చకోర బాల సా


రంగ తటిన్నికాయముల రంతులు సేసెడు వాడిచూపులన్ (4)


బాలేందురేఖ సంపద మించి విలసిల్లు


నొసటి తళ్కుల నీటు నూరు సేయు


భ్రమరికా హరి నీల చమరవాలముల బోల్


వేణీభరము చాయ వేయి సేయు


దర్పణ ద్విజరాజ ధాళధళ్య ప్రభ


లపన బింబ స్ఫూర్తి లక్ష సేయు


గోట హాటక శైల కుంభి కుంభారాతి


కుచకుంభయుగళంబు కోటి సేయు


జఘనసీమకు విలువ లెంచంగ వశమె


దీని సౌందర్య మహిమంబు దేవు డెరుగు


నహహ యెబ్భంగి సాటి సేయంగ వచ్చు


భావజుని కొల్వు జంగము భామ చెల్వు (5)


సర్వజ్ఞ నామధేయము


శర్వునకే రావు సింగ జనపాలునకే


యుర్విం జెల్లును దక్కొరు


సర్వజ్ఞుండనుట కుక్క సామజ మనుటే (6)


కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా


పురవీథి నెదురెండ పొగడదండ


యాంధ్రనైషథకర్త యంఘ్రి యుగ్మంబున


దగిలియుండెను గదా నిగళయుగము


వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత


వియ్యమందెను గదా వెదురుగొడియ


సార్వభౌముని భుజాస్తంభ మెక్కెను గదా


నగరి వాకిట నుండు నల్లగుండు


కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము


బిలబిలాక్షులు తినిపోయె దిలలు బెసలు


బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి


నెట్లు చెల్లింతు సుంకంబు లేడు నూర్లు (7)



తాటంకయుగ ధగద్ధగిత కాంతిచ్ఛటల్


చెక్కుటద్దములపై జీరువార


నిటలేందు హరి నీల కుటిలకుంతలములు


చిన్నారిమోముపై జిందులాడ


బంధుర మౌక్తిక ప్రకట హారావళుల్


గుబ్బపాలిండ్లపై గులిసియాడ


గరకంకణ క్వణ క్వణ నిక్వణంబులు


పలుమారు రాతిపై బరిఢవిల్ల


నోరచూపుల విటచిత్త మూగులాడ


బాహు కుశలత జక్కని మోహనాంగి


పాట బాడుచు కూర్చుండి రోటి మీద


బిండి రుబ్బంగ గన్నులపండు వయ్యె (9)


జగ దొబ్బ గండాంక సంగ్రామ నిశ్శంక


జగతీశ రాయ వేశ్యా భుజంగ


అఖిల కోటల గొంగ యరి రాయ మద భంగ


మేలందు ధరణీశ మీనజాల


మూరు రాయర గండ మురియు రాజుల మిండ


యభివృద్ధి మీరు చౌహత్త మల్ల


గోవాళ ఘన కాయ కామినీ పాంచాల


బ్రహ్మాయు శశివంశ పరశురామ


దండి బిరుదుల సురతాణి గుండె దిగుల


బళియ యల్లయ వేముని పగర మిండ


రమణ మించిన మేదిని రాజు బిరుద


సంగరాటోప మాదయ లింగ భూప (10)


రాజనందన రాజ రాజాత్మజులు సాటి


తలప నల్లయ వేమ ధరణిపతికి


రాజనందన రాజ రాజాత్మజులు సాటి


తలప నల్లయ వేమ ధరణిపతికి


రాజనందన రాజ రాజాత్మజులు సాటి


తలప నల్లయ వేమ ధరణిపతికి


రాజనందన రాజ రాజాత్మజులు సాటి


తలప నల్లయ వేమ ధరణిపతికి


భావ భవభోగ సత్కళా భావములను


భావ భవభోగ సత్కళా భావములను


భావ భవభోగ సత్కళా భావములను


భావ భవభోగ సత్కళా భావములను (11)


వీర రసాతిరేక రణ విశ్రుత వేమ నరేంద్ర నీ యశం


బారభమాన తార కర హార విలాసము నీ భుజా మహం


బారభమాన తార కర హార విలాసము నీ పరాక్రమం


బారభమాన తార కర హార విలాసము చిత్ర మారయన్ (12)


రసికుడు పోవడు పల్నా


డెసగంగా రంభ యైన నేకులె వడుకున్


వసుధేశుడైన దున్నును


కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్ (13)


ఫుల్ల సరోజ నేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా


డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల తింత్రిణీ


పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో


మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీ పస కాననయ్యెడిన్ (14)


కవితల్ సెప్పిన బాడ నేర్చిన వృథా కష్టంబె యీ బోగపుం


జవరాండ్రే కద భాగ్యశాలినులు పుంస్త్వం బేల పో పోచకా


సవరంగా సొగసిచ్చి మేల్ యువతి వేషం బిచ్చి పుట్టింతువే


నెవరున్ మెచ్చి ధనంబు లిచ్చెదరు గాదే పాపపుం దైవమా (15)


సొగసు కీల్జడ దాన సోగ కన్నుల దాన


వజ్రాల వంటి పల్వరుస దాన


బంగారు జిగి దాన బటువు గుబ్బల దాన


నయమైన యొయ్యారి నడల దాన


తోరంపు గటి దాన తొడల నిగ్గుల దాన


పిడికిట నడగు నెన్నడుము దాన


తళుకు జెక్కుల దాన బెళుకు ముక్కర దాన


పింగాణి కనుబొమ చెలువు దాన


మేలిమి పసిండి రవ కడియాల దాన


మించి పోనేల రత్నాల మించు దాన


తిరిగిచూడవె ముత్యాల సరుల దాన


చేరి మాటాడు చెంగావి చీర దాన (16)


వనజాతాంబకు డేయు సాయకముల న్వారింపగా రాదు నూ


తన బాల్యాధిక యౌవనంబు మదికిన్ ధైర్యంబు రానీయ ది


ట్లనురక్తిన్ మిముబోంట్లకు ందెలుప నాహా సిగ్గు మైకోదు పా


వన వంశంబు స్వతంత్ర మీయదు సఖీ వాంఛల్తుద ల్ముట్టునే (17)


అంగడి యూర లేదు వరి యన్నము లేదు శుచిత్వ మేమి లే


దంగన లింపు లేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై


భంగపడంగ బాల్పడు కృపాపరు లెవ్వరు లేరు దాత లె


న్నంగను సున్న గాన బలనాటికి మాటికి బోవ నేటికిన్ (18)


ఊరు వ్యాఘ్ర నగర మురగంబు కరణంబు


కాపు కపివరుండు కసవు నేడు


గుంపు గాగ నిచట గురజాల సీమలో


నోగు లెల్ల గూడి రొక్క చోట (19)


కుంకుమ లేదో మృగమద


పంకము లేదో పటీర పాంశువు లేదో


సంకు మదము లేదో యశు


భంకరమగు భస్మ మేల బాలా నీకున్ (20)


ఖండేందు మౌళిపై గలహంస పాళిపై


గర్పూర ధూళిపై గాలుద్రవ్వు


మిన్నేటి తెరలపై మించు తామరలపై


మహి మించు నురులపై మస్తరించు


జంభారి గజముపై జంద్రికా రజముపై


జందన ధ్వజముపై జౌకళించు


ముత్యాల సరులపై మొల్ల క్రొవ్విరులపై


ముది కల్పతరువుపై మోహరించు


వెండిమల యెక్కి శేషాహి వెన్ను దన్ని


తొడరి దుగ్ధాబ్ధి తరగల తోడ నడరి


నెరతనం బాడి నీ కీర్తి నిండె నహహ


విజయ రఘురామ యల్లాడ విభుని వేమ (21)


గరళము మ్రింగితి ననుచుం


బురహర గర్వింపబోకు పో పో పో నీ


బిరుదింక గానవచ్చెడి


మెరసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ (22)


గిట గిట నగు నెన్నడుములు


పుట పుట నగు గన్నుగవలు పున్నమి నెలతో


జిట పొట లాడెడు మొగములు


కటి తటముల కొమరు శబరకాంతల కమరున్ (23)


గుడిమీది క్రోతి తోడను


గుడిలోపలి నంబివారి కోడలి తోడన్


నడివీథి లంజ తోడను


నడిగొప్పుల హోరుగాలి నడిగితి ననుమీ (24)


గుబ్బలగుమ్మ లే జిగురు గొమ్మ సువర్ణపు గీలుబొమ్మ బల్


గబ్బి మిటారి చూపులది కాపుది దానికి నేల యొక్కనిన్


బెబ్బులి నంటగట్టితివి పెద్దవు నిన్ననరాదు గాని దా


నబ్బ పయోజగర్భ మగనాలికి నింత విలాస మేటికిన్ (25)


గొంగడి మేలు పచ్చడము కుంపటి నల్లులు కుక్కిమంచమున్


జెంగట వాయుతైలము లజీర్ణపు మందులు నుల్లిపాయలున్


ముంగిట వంటకట్టియల మోపులు దోమలు చీముపోతులున్


రంగ వివేకి కీ మసర రాజ్యము కాపుర మెంత రోతయో (26)


గోష్పద రూపమై మిగుల కోమలమై గణుతింపరానిదై


శష్ప విహీనమై నునుపు దాలగ గల్గి ద్రవం బపారమై


పుష్పిణి యైన నీ భగము పుణ్యమునన్ భుజియింప గల్గె వా


స్తోష్పతి కైన నో ద్రవిడసుందరి నిన్ను వచింప శక్యమే (27)


గ్రామము చేత నుండి పరికల్పిత ధాన్యము నింట నుండి శ్రీ


రామ కటాక్ష వీక్షణ పరంపరచే గడతేరె గాక మా


రామయమంత్రి భోజన పరాక్రమ మేమని చెప్పవచ్చు నా


స్వామి యెరుంగు దత్కబళ చాతురి తాళ ఫల ప్రమాణమున్ (28)


చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవళ్ళు


నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు


సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును దేళ్ళు


పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు (29)


జననాథోత్తమ దేవరాయ నృపతీ చక్రేశ శ్రీ వత్సలాం


ఛన సంకాశ మహా ప్రభావ హరి రక్షాదక్ష నా బోటికిన్


గునృప స్తోత్ర సముద్భవంబయిన వాగ్దోషంబు శాంతంబుగా


గనకస్నానము చేసి గాక పొగడంగా శక్యమే దేవరన్ (30)


జొన్న కలి జొన్న యంబలి


జొన్నన్నము జొన్న పిసరు జొన్నలు తప్పన్


సన్నన్నము సున్న సుమీ


పన్నుగ బలినాటి సీమ ప్రజ్అ లందరకున్ (31)


జోటీ భారతి ఆర్భటిన్ మెరయుమీ చోద్యంబుగా నేను గ


ర్ణాటాధీశ్వరు ప్రౌఢదేవ నృపతిన్ నాసీర ధాటీ చమూ


కోటీ ఘోటక ధట్టికా ఖుర పుటీ కుట్టాక సంఘట్టన


స్ఫోటీ ధూత ధరారజ శ్చుళికితాంభోధిన్ ప్రశంసించెదన్ (32)


డంబు సూపి ధరాతలంబుపై దిరుగాడు


కవిమీద గాని నా కవచమేయ


దుష్ప్రయోగంబులం దొరకొని చెప్పెడు


కవిశిరస్సున గాని కాలుచాప


చదివి చెప్పగ నేర్చి సభయందు విలసిల్లు


కవినోరు గాని వ్రక్కలుగ దన్న


సంగీత సాహిత్య సరస విద్యల నేర్చు


కవుల రొమ్ముల గాని కాల్చి విడువ


దంట కవులకు బలువైన యింటి మగడ


గవుల వాదంబు విన వేడ్క గలిగెనేని


నన్ను బిలిపింపు మాస్థాన సన్నిథికిని


లక్షణోపేంద్ర ప్రౌఢ రాయ క్షితీంద్ర (33)


తక్కక రావు సింగ వసుధావరు డర్థుల కర్థ మిచ్చుచో


దిక్కుల లేని కర్ణుని దధీచిని ఖేచరు వేల్పుమ్రాకు బెం


పెక్కిన కామధేనువు శిబీంద్రుని నెన్నెదు బట్ట దిట్టవై


కుక్కవొ నక్కవో ఫణివొ క్రోతివొ పిల్లివొ బూతపిల్లివో (34)


తేలాకాయెను బోనము


పాలాయెను మంచినీళ్ళు పడియుండుటకున్


నేలా కరవాయె నిసీ


కాలిన గురిజాల నిష్ట కామేశ శివా (35)


దండయాత్రా ఘోష తమ్మట ధ్వనులచే


గంతులు వేయించె గప్పకొండ


కితప కాలాభీల కీలానలము చేత


నేల పొంగడగించె బాలకొండ


ఆరట్టజా ధట్ట హయ ధట్టముల చేత


మట్టి తూర్పెత్తించె దొట్టునూరు


భూరి ప్రతాపాగ్ని బుటములు పెట్టించె


విద్వేషులను గళా వెండి పురము


అనగ నుతి కెక్కి తౌర కేళాదిరాయ


అరుల పండువ మండువా యవన హరణ


బళియ ధూళియ మాళువ బందికార


విజయ రఘురామ అల్లాడ విభుని వేమ (36)


దాయాదుల్వలె గుబ్బచన్ను లొలయన్ ధావళ్య నేత్రాంబుజ


చ్ఛాయ ల్తాండవ మాడ గేరి పురుషస్వాంతమ్ముల న్మన్మథుం


డేయం జంగమువారి చంద్రముఖి విశ్వేశార్చనా వేళలన్


వాయించెం గిరిగిండ్లు బాహు కుశల వ్యాపార పారీణతన్ (37)


దోసెడు కొంపలో బసుల త్రొక్కిడి మంచము దూడ రేణమున్


బాసిన వంటకంబు పసిబాలుర శౌచము విస్తరాకులున్


మాసిన గుడ్డలున్ దలకు మాసిన ముండలు వంటకుండలున్


రాసెడు కట్టెలున్ దలపరాదు పురోహితు నింటి కృత్యముల్ (38)


పంపా విరూపాక్ష బహు జటాజూటి కా


రగ్వధ ప్రసవ సౌరభ్యములకు


తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా


గంభీర ఘుమఘుమారంభములకు


కళసాపుర ప్రాంత కదళీ వనాంతర


ద్రాక్షా లతా ఫల స్తబకములకు


కర్ణాట కామినీ కర్ణ హాటక రత్న


తాటంక యుగ ధాళధళ్యములకు


నిర్నిబంధ నిబంధమై నెనయు కవిత


తెలుగునను సంస్కృతంబున పలుకనేర్తు


ప్రౌఢదేవేంద్ర రాయ భూపాలవరుని


సమ్ముఖంబున దయ చూడుమయ్య సుకవి (39)


పస గల ముద్దు మోవి బిగి వట్రువ గుబ్బలు మందహాసమున్


నొసట విభూతిరేఖయు బునుంగున తావి మిటారి చూపులున్


రసికులు మేలు మేలు బళిరా యని మెచ్చగ రాచవీటిలో


బసిడి సలాక వంటి యొక బల్జె వధూటిని గంటి వేడుకన్ (40)


పువ్వులు కొప్పునం దురిమి ముందుగ గౌ నసియాడుచుండగా


జెవ్వున జంగ సాచి యొకచేతను రోకలి బూని యొయ్యనన్


నవ్వు మొగంబు తోడ తన నందను బాడుచు నాథు జూచుచున్


సువ్వియ సువ్వి యంచు నొక సుందరి బియ్యము దంచె ముంగిటన్ (41)


మందరాద్రి సములు మానవులందరు


చందమామ కూన లిందుముఖులు


కందులేని మౌక్తికంబులు జొన్నలు


కుందనంపు బెడ్డ కుందుగడ్డ (42)


వంకర పాగలున్ నడుము వంగిన కత్తులు మైలకోకలున్


సంకటి ముద్దలున్ జనుప శాకములున్ బులు పచ్చడంబులున్


దెంకగు నోరచూపులును దేకువ దప్పిన యేసబాసలున్


రంకుల బ్రహ్మ ఈ మసర రాజ్యము నెట్లు సృజించెనో కదా (43)


వీరులు దివ్యలింగములు విష్ణువు చెన్నుడు కల్లిపోతురా


జారయ గాలభైరవుడు సంకమ శక్తియ యన్నపూర్ణయున్


గేరెడి గంగధార మడుగే మణికర్ణికగా జెలంగు నీ


కారెమపూడి పట్టణము కాళిగదా పలనాటి వారికిన్ (44)


శ్రీరస్తు భవదంఘ్రి చికురంబులకు మహా


భూర్యబ్దములు సితాంభోజనయన


వర కాంతి రస్తు తావక నఖ ముఖముల


కాచంద్ర తారకం బబ్జవదన


మహిమాస్తు నీ కటి మధ్యంబులకు మన్ను


మిన్ను గలన్నాళ్ళు మించుబోడి


విజయోస్తు నీ గానవీక్షల కానీల


కంఠ హరిస్థాయిగా లతాంగి


కుశలమస్తు లస చ్ఛాతకుంభ కుంభ


జంభవి త్కుంభి కుంభా విజృంభమాణ


భూరి భవదీయ వక్షోజములకు మేరు


మందరము లుండు పర్యంత మిందువదన (45)


శ్రుతి శాస్త్ర స్మృతు లభ్యసించుకొని విప్రుండంత నానాధ్వర


వ్రతుడై పోయి కనున్ బురందర పురారామ ద్రుమానల్ప క


ల్పతరు ప్రాంత లతా కుడుంగ సుఖ సుప్త ప్రాప్త రంభా భగ


ప్రతి రోమాంకుర పాటన క్రమ కళా పాండిత్య శౌండీర్యమున్ (46)


సప్తమాడియ రాయ చంద్ర బింబాసనా


చికుర వల్లరులపై జిన్ని పువ్వు


ఝూడె జంతుర్నాటి జననాథ శుద్ధాంత


కుచ కుంభములమీది కుంకుమంబు


బారుహదొంతి భూపాల లీలావతీ


గండస్థలంబుల గలికినవ్వు


కలువ పల్ల్యొడ్డాడి కటకాధిపతి వధూ


సీమంత వీథుల జేరుచుక్క


యల్లడాధీశు వేమ క్షమాధినాథు


భూరి నిష్టుర ధాటీ విహార చటుల


సైన్య నాసీర తుక్ఖార శఫ ఫుటోత్థ


వింధ్య పార్శ్వ వసుంధరా విపుల ధూళి (47)


సిరిగల వానికి జెల్లును


దరుణుల పదియారు వేల దగ బెండ్లాడన్


దిరిపెమున కిద్ద రాండ్రా


పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ (48)


నీలాలకా జాల ఫాల కస్తూరికా


తిలకంబు నేమిట దిద్దువాడ


నంగనాలింగనా నంగ సంగర ఘర్మ


శీకరం బేమిట జిమ్మువాడ


మత్తేభగామినీ వృత్తస్తనంబుల


నెలవంక లేమిట నిల్పువాడ


భామామణీ కచాభరణ శోభితమైన


పాపట నేమిట బాపువాడ


ఇందుసఖులను వేప్రొద్దు గ్రిందు పరిచి


కలికి చెంగల్వ రేకుల కాంతి దనరి


………………… అహహ


పోయె నా గోరు తన చేతి పోరు మాని (49)


ఇంగలమంచు వచ్చి యడియేనని కొత్తమసాని మ్రొక్కగా


గొంగు బిరాల్న బట్టి తిరుకొంగటుతీసి జలారి చెంతనే


వంగగబెట్టి యోని దిరువట్టల గట్టగ జాలు జాలు నీ


దెంగులటంచు నిన్ను మరి తిట్టెనుగా శఠగోప జియ్యరూ (50)


మీనవిలోచనంబులును మీటిన ఖంగను గుబ్బచన్ను లిం


పైన వచోమృతంబు సొగసైన మదాలస మందయానమున్


గా నొనరించి దీని గణికామణి జేయక నిర్దయాత్ముడై


గానులదాని జేసిన వికారవిధిం దల గొట్టగా వలెన్ (51)


జంగమురాలి బట్టి యొక జంగము వంగగ బెట్టి యోనిలో


లింగము బెట్టి క్రుక్కి యదలించుచు నొక్కొక తాకు తాకినన్


లింగ నమశ్శివాయ గురులింగ మహేశ్వర జంగమయ్య యో


యంగజభంగ సాంబ గురుడా యను దాకిన తాకు తాకునన్ (52)


ఉలిమిడి చెక్కయున్ మిగుల నుక్కయు జప్పని రొట్టె ముక్కయున్


మలినపు గుడ్డలున్ నులుకమంచపు గుక్కియు జీకటిల్లునుం


దలచిన రోత వచ్చు నొకనాటి సుఖం బొకయేటి దుఃఖ మీ


వలివెల వారకాంతల యుపస్థలకున్ బదివేల దండముల్ (53)


జిలుగైన చెంగావి జిగి మీరు కుచ్చెళ్ళు


చిన్ని మెట్టెల మీద జిందులాడ


నీటైన రత్నాల తాటంకముల కాంతి


కుల్కు గుబ్బలమీద గునిసియాడ


గురుతైన యపరంజి గొప్ప ముత్తెపు సత్తు


మోవిపై నొకవింత ముద్దు గుల్క


తీరైన ముత్యాల హారముల్ మేలిమై


మెరుగు జెక్కుల తోడ మేలమాడ


గంధకస్తురి వాసనల్ గమ్మనంగ


నలరు విలుకాని చేతి పూపమ్మనంగ


కాళ్ళనందెలు గలు గల్లు గల్లనంగ


సొగసు గుల్కంగ వేపారి సుదతి వచ్చె (54)


కూటమి నొక్కనాటికి ద్రికోణ సహస్రములం బగుల్చు నీ


ధాటికి జల్లడంబులును దారుణగోణము లంచుగోచులున్


శాటులు నోర్వగా గలవె చాలును నీదు విజృంభణం బయో


యేటికి లేవబారితివి ఈ సరిప్రొద్దు కడం బ్రజాపతీ (55)


మాపటి కొండవీటి కసుమాలపు దొత్తుల జూచి యేల యు


త్థాపనశక్తి చూపెదవు దబ్బర శిశ్నమ వారి సౌమన


శ్చాప గృహాంతరాళ తల జాగ్రదుదగ్ర నిరర్గళ వ్రణో


ద్దీపిత కాలకూటవిష దిగ్ధ శరీరుల మున్నెరుంగవే (56)


పరరాజ్య పరదుర్గ పరవైభవ శ్రీల


గొనకొని విడనాడు కొండవీడు


పరిపంథి రాజన్య బలముల బంధించు


కొమరు మించిన జోడు కొండవీడు


ముగురు రాజులకును మోహంబు పుట్టించు


గురుతైన యురిత్రాడు కొండవీడు


చటుల విక్రమ కళా సాహసం బొనరించు


కుటిలాత్ములకు గాడు కొండవీడు


జవన ఘోటక సామంత సరస వీర


భట నటానేక హాటక ప్రకట గంధ


సింధురారవ యోహన శ్రీల దనరు


కూర్మి నమరావతికి జోడు కొండవీడు (57)


నీలాటి రేవు లోపల


మేలిమితో దీర్చినట్టు మెరిసి నిలుచుచున్


దాలిమిని వాలుచూపుల


బాలామణి గుట్టు బైట బడగా జూచెన్ (58)


నెమలిపురి యమపురముగా


యముడాయెను బసివిరెడ్డి యంతకు మిగులన్


యమదూతలైరి కాపులు


క్రమ మెరుగని దున్నలైరి కరణాలెల్లన్ (59)


ఆదరణంబు సున్న వినయంబు హితంబును బొంకు సత్యమా


లేదు దయారసం బది హుళక్కి పపాపడు వేళ పంక్తిలో


భేదపు బెట్టు దిట్ట బలి భిక్షము ……… త


త్వాదుల బుట్టజేసిన విధాత ప్రజాపతి గాకయుండునే (60)


దస్త్రాలున్ మసిబుర్రలున్ గలములున్ దార్కొన్న చింతంబళుల్


పుస్తుల్ గారెడు దుస్తులున్ జెమటకంపుం గొట్టు నీర్కావులున్


అస్తవ్యస్తపు గన్నడంబును భయంబై తోచు గడ్డంబులున్


వస్తూ చూస్తిమి రోస్తిమిన్ బడమటన్ వ్యాపారులం గ్రూరులన్ (61)


వీనులకు విందులై తేనె సోన లెనయ


ముందు రాగంబున్అను జగన్మోహనముగ


బాడె నొక జాలరి మిటారి యీడు లేని


కాకలీనాదమున నోడ గడవు పాట (62)


మేత గరిపిల్ల పోరున మేకపిల్ల


పారుబోతుతనంబున బందిపిల్ల


యెల్ల పనులను జెరుపంగ బిల్లిపిల్ల


యందమున గ్రోతిపిల్ల యీ యరవపిల్ల (63)


కూడు తలప జోళ్ళు కూర కారామళ్ళు


చెవులంత వ్రేలాళ్ళు చేలు మళ్ళు


దుత్తెడే నాగళ్ళు దున్నపోతుల యేళ్ళు


కలపు మాపటివేళ గంజినీళ్ళు


మాటమాటకు ముళ్ళు మరి దొంగదేవళ్ళు


చేదైన పచ్చళ్ళు చెరకు నీళ్ళు


వంట పిడ్కల దాళ్ళు వాడనూతుల నీళ్ళు


విన విరుద్ధపు బేళ్ళు వెడదనోళ్ళు


సఖుల చన్నుల బైళ్ళు చల్లని మామిళ్ళు


పరుపైన వావిళ్ళు పచ్చ పళ్ళు


దళమయిన యట్టి కంబళ్ళు తలలు బోళ్ళు


పయిడికిని జూడ పయిడెత్తు ప్రత్తి వీళ్ళు


చలముకొని వెదికినను లేవు చల్ల నీళ్ళు


చూడవలసెను ద్రావిళ్ళ కీడుమేళ్ళు (64)


తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిర్యపు చారు


చెవులలో బొగ వెళ్ళి చిమ్మిరేగ


బలు తెరంగుల తోడ బచ్చళ్ళు చవిగొన్న


బ్రహ్మరంధ్రము దాక బారు నావ


యవిసాకు వేచిన నార్నెల్లు ససి లేదు


పరిమళ మెంచిన బండ్లు సొగసు


వేపాకు నెండించి వేసిన పొళ్ళను


గంచాన గాంచిన గ్రక్కు వచ్చు


నరవ వారింటి విందెల్ల నాగడంబు


చెప్పవత్తురు తమ తీరు సిగ్గులేక


…………


చూడవలసెను ద్రావిళ్ళ కీడుమేళ్ళు (65)


నడివీథిలో రాళ్ళు నాగులే దేవళ్ళు


పరగట సావిళ్ళు పాడుగుళ్ళు


ఐదువన్నెల కూళ్ళు నంబటి కావిళ్ళు


నూరూర జిల్లేళ్ళు నూట నీళ్ళు


నడుముకు వడదోళ్ళు నడువీథి కల్ రోళ్ళు


కరుణాల వడిసెళ్ళు కాపు ముళ్ళు


………..


……….


….. నేరెళ్ళ వాగునీళ్ళు


సిరుల జెలువొందు మారెళ్ళ సీమయందు (66)


మా కలిదిండి కామయ కుమారకు డన్నిట తండ్రి వైఖరే


కాక తదన్యుడెట్లగును గాడిదకుం దురగంబు పుట్టునే


చేకొని కొంకినక్కకును సింగము పుట్టునె మాలకాకికిం


గోకిల పుట్టునే చిరుతకుక్కకు మత్తగజంబు పుట్టునే (67)


చక్కని నీ ముఖ చంద్రబింబమునకు


గళ్యాణమస్తు బంగారు బొమ్మ


నిద్దంపు నీ చెక్కుటద్దంపు రేకకు


నైశ్వర్యమస్తు నెయ్యంపుదీవి


మీటిన బగులు నీ మెరుగు బాలిండ్లకు


సౌభాగ్యమస్తు భద్రేభయాన


వలపులు గులుకు నీ వాలు గన్నులకు న


త్యధిక భోగోస్తు పద్మాయతాక్షి


మధురిమము లొల్కు నీ ముద్దు మాటలకును


వైభవోన్నతిరస్తు లావణ్యసీమ


వన్నెచిన్నెలు గల్గు నీ మన్ననలకు


శాశ్వతస్థితి రస్తు యోషా లలామ (68)


శ్రీనాథుని వీథినాటకం


దీనారటంకాల తీర్థమాడించితి


దక్షిణాధీశు ముత్యాలశాల


వాక్కుతోడై తాంధ్రభాషా మహాకావ్య


నైషథగ్రంథ సందర్భమునను


పగలగొట్టించి తుద్భట వివాదప్రౌఢి


గౌడ డిండిమబట్టు కంచుఢక్క


చంద్రభూషక్రియాశక్తి రాయల యొద్ద


పాదుకొల్పితి సార్వభౌమ బిరుదు


నెటుల మెప్పించెదో నన్ను నింకమీద


రావు సింగన భూపాలు ధీవిశాలు


నిండుకొలువున నెలకొనియుండి నీవు


సరస సద్గుణ నికురంబ శారదాంబ (69)


అక్షయ్యంబగు సాపరాయని తెలుంగాధీశ కస్తూరికా


భిక్షాదానము సేయురా సుకవిరాడ్ బృందారకశ్రేణికిన్


ద్రాక్షారామ పురీ విహార వర గంధర్వాప్సరోభామినీ


వక్షోజ ద్వయ కుంభికుంభములపై వాసించు నవ్వాసనల్ (70)


ధాటీ ఘోటక రత్న ఘట్టన మిళద్ద్రాఘిష్ఠ కల్యాణ ఘం


టా టంకార విలుంఠ లుంఠిత మహోన్మత్తాహిత క్షోణిభృ


త్కోటీరాంకిత కుంభినీధర సముత్కూటాటవీ ఝూట క


ర్ణాటాంధ్రాధిప సాంపరాయని తెలుంగా నీకు బ్రహ్మాయువౌ (71)


కందుకకేళి సల్పెడు ప్రకారమునం బురుషాయిత క్రియా


తాండవకేళి సల్పెడు విధంబున వాసరభామ లేత నీ


రెండ ప్రభాతవేళ రచియించెను గుబ్బలమీది హారముల్


కుండలముల్ కురుల్ కదల గోమయపిండము లింటిముందటన్ (72)


గురుకుచముల్ ప్రియోక్తులును క్రొమ్ముడియున్ నిటలాలకంబులున్


మురిపెపు మాటలున్ నగవు ముద్దుమొగంబును గల్గుగాని యా


సురతపునేర్పు మాటలును సూక్ష్మ విభీషణ భూషణంబులున్


బరువడితో విభుం గవయు భావము పుట్టదు విప్రభామకున్ (73)


గురుకుచయుగ్మ మాననము కోమలికంబులు ముద్దుమాటలున్


అరపు లతిప్రసంగములు నప్పట నప్పట మేలమాట లం


తరిత కళానిధానములు తాడనపీడన భూషణంబులున్


బరువడి నొంద నేర్చు ప్రియభాషలు గల్గు నరేంద్రభామకున్ (74)


పురుషుడు గూడువేళ పెడబుద్దులు సుద్దులు కానిచేతలున్


సరగున మేనికంపు చెడు చందపు రూపము నేహ్యవస్త్రముం


బరగు నిరంతరంబు నెడ దాయని సౌఖ్యము లేని ప్రేమయున్


విరహపు జూడ్కు లుమ్మలిక వీసము బుల్లులు వైశ్యభామకున్ (75)


వరగంభీర పయోధరంబులు గుణాభావప్రవీణత్వము


న్నరవిందాస్య సుగంధగంధ్అ పటు వేణ్యత్యంత సౌందర్య ము


ద్ధుర తంద్రాణ వివేకసంపదయు మాధుర్యాది గాంభీర్యముం


దరుణీరత్నము శూద్రభామ గుణముల్ తథ్యంబె వర్ణింపగన్ (76)


హరినీలముల కప్పు లణగించు నునుకొప్పు


విడ పువ్వుదండ దా వీడబార


గోటిచందురు డాలు గోటుసేయగ జాలు


మొగము కుంకుమచుక్క సొగసు గులుక


నల జక్కవల జక్కు లణగద్రొక్కగ నిక్కు


పాలిండ్లపై నాచు పైట జార


నిసుకతిన్నెల మెట్టు పసిడిచెంపల గొట్టు


పిరుదుపై మొలనూలు బెళుకుదేర


జిగురు కెమ్మోవి బగడంపు బిగియు మెరయ


మాటలాడగ గనుదోయి తేటలమర


జెమటలూరంగ సింహాద్రి జేరవచ్చె


భోగగుణధామ యాంధ్ర నియోగిభామ (77)


బంగారు వంటి మేనును


శృంగారము లొల్కు కుల్కు చిక్కని చన్నుల్


బంగారపు నెరచీరలు


చెంగటి చూపులు నియోగిచేడెల కొప్పున్ (78)


రాపాడంగల గుబ్బ చన్నుగవతో రాకేందుబింబంబుపై


చూపేయంగల ముద్దునెమ్మొగముతో దోరంపు మైచాయతో


జూపున్ ముద్దుల బాలసంఘములతో సొంపారు లేనవ్వుతో


వేపార్యంగన వచ్చె గాసెబిగితో వేణీభరచ్ఛాయతోన్ (79)


విడినకొప్పున జాజివిరు లొప్పుగా వ్రాల


జిట్టి కుంకుమ చుక్కబొట్టు చెదర


జక్కగా బటువారు సందెడు కుచ్చెళ్ళు


చెలగు మెట్టియలపై జిందులాడ


గొదమగుబ్బల బైటకొంగు చయ్యన జార


ముక్కునత్తొక వింత ముద్దుగులుక


మొలగంట లిమ్మగు మ్రోతతో రంజిల్ల


గనకంపు టందియల్ ఘల్లురనగ


బొసగు కర్పూరవీడ్యముల్ పొందుపరిచి


యనుగు జేడెలతో ముచ్చటాడికొనుచు


నలరు సింహాద్రిపైకెక్కి హర్షమునను


వచ్చె కలకంఠి వేపారి మచ్చెకంటి (80)


కుసుమంబద్దిన చీరకొంగు వొలయం గ్రొవ్వారు పాలిండ్లపై


ద్రిసరంబుల్ పొలుపార వేణి యవటూ దేశంబుపై రాయగా


బస నెవ్వాడొ యొకండు రాత్రి రతులన్ బల్గాసి గావింపగా


నసియాల్వాడుచు వచ్చుచున్నయది కర్ణాటాంగనన్ గంటిరే (81)


వీసపు ముక్కునత్తు నరవీసపు మంగళసూత్ర మెంతయున్


గాసుకురాని కమ్మ లరకాసును కానివి పచ్చపూసలున్


మాసినచీర గట్టి యవమాన మెసంగగ నేడు రాగ నా


కాసలనాటి వారి కనకాంగిని జూచితి నీళ్ళరేవునన్ (82)


ఒక చెంప కోరగా నొనగూర్చి దిద్దిన


తురుమున నుండి క్రొవ్విరులు జార


రాత్రి యెవ్వాడొ బల్ రతుల గాసి యొనర్ప


బడలిక నడుగులు తడబడంగ


వింతవారల జూచి వెస నవ్వినను కప్పు


గల దంతముల కాంతి వెలికి జార


జడిముడి నడచుట జెలరేగి గుబ్బల


పై దాకి యొక్కింత పైట జార


జెమటచే దిరునామంబు చెమ్మగిల్ల


హాళి డా చేత విడియంబు గీలుకొలిపి


రంగపురి రాజవీథి గానంగనయ్యె


నాదు మది గోర్కె లూర వైష్ణవ వధూటి (83)


రంభాస్తంభము లూరువు


లంభోరుహ నిభము లక్షు లతను శరంబుల్


జంభాసురారి మదగజ


కుంభములీ నంబివారి కోడలి కుచముల్ (84)


మీగాళ్ళ జీరాడు మేలైన కుచ్చెళ్ళ


తీరున మడిచీర దీర్చికట్టి


బిగువుగుబ్బల మీద నిగనిగల్ దళుకొత్తు


నోరపయ్యెద కొంగు జారవైచి


వలపుల కొక వింత గలుగగా గొప్పలౌ


కురులు నున్నగ దువ్వి కొప్పుపెట్టి


నెలవంక నామంబు సలలితంబుగ నుంచి


తిరుచూర్ణ మామీద తీర్పుచేసి


యోరచూపుల విటుల దా నూరడించి


గిల్కు మెట్టెల రవరవల్ గుల్కరింప


జిలికి చేసిన తామ్రంపు జెంబు బూని


వీథి నేతెంచె సాతాని వెలది యొకతె (85)


పూజారివారి కోడలు


తా జారగ బిందెజారి దబ్బున బడియెన్


మై జారు కొంగు తడిసిన


బాజారే తిరిగిచూసి పక్కున నవ్వెన్ (86)


వాసన గల్గు మేను నిడు వాలు గనుంగవ గబ్బిగుబ్బలున్


గేసరిమధ్యమున్ మదనకేళికి నింపగు బాహుమూల వి


న్యాసము గల్గినట్టి యెలనాగను బోగముదాని జేయ కా


దాసరిదాని జేసిన విధాతను నేమనవచ్చు నీశ్వరా (87)


బంగరులింగమూర్తి చనుబంతుల మధ్య నటింపుచుండగా


జెంగులుజార మేల్వలువ చీరయు వీడ మదీప్సితంబు లు


ప్పొంగగ వామహస్తమున బొల్పగు నీవిని బట్టి వేడ్కతో


జంగున గోడదాటు నగసాలె శిరోమణి జూచితే సఖా (88)


తల్లియు గొండపల్లి నొక తామరగండికి నీళ్ళకేగగా


దెల్లని చీరకొంగు నెగదీసుక నవ్వుచు నీళ్ళు ముంచగా


గొల్లల లింగకాయ చనుగుబ్బల సందున నాట్యమాడగా


జల్లని మాటలాడు నగసాలె శిరోమణి జూచితే సఖా (89)


అగసాలిది కాబోలును


సొగసైన మిటారి యోరచూపుల తోడన్


జగమెల్లను వలపించుచు


మగటిమితో వచ్చె బురము మార్గము వెంటన్ (90)


పొలుపొందగ విభూతి బొట్టు నెన్నొసలిపై


దళుకొత్త చెమట కుత్తలపడంగ


సొగసుగా బూదండ జోపిన కీల్గొప్పు


జారగా నొకచేత నరుదుకొనగ


బిగిచన్నుగవ మీద బిరుసుపయ్యెదచెంగు


దిగజారి శివసూత్ర మగపడంగ


ముక్కున హురుముంజి ముత్యాలముంగర


కమ్మవాతెర మీద గంతులిడగ


గౌను జవ్వాడ మెట్టియల్ గదిసి మ్రోయ


గమ్మవిలుకాని జాళువా బొమ్మ యనగ


మెల్లమెల్లన సింహాద్రి మీదికేగె


గన్నె పూబోడి యగసాలి వన్నెలాడి (91)


వాలగు కన్నుదోయి బిగివట్రువ గుబ్బలు కారుచీకటిం


జాల హసించు కొప్పు జిగి సారసమున్ నగు మోము గల్గు నా


బాలిక గూలికొమ్ముకొన బట్టలు నేసెడు వానికిచ్చె హా


సాలెత కాదురా కుసుమసాయకు పట్టపు దంతి యింతియే (92)


కుమ్మరివారి బాలిక చకోరవిలోచన ముద్దుగుమ్మ యా


వమ్ము దరిన్ రసామలిన వస్త్రము చుంగులుజార కట్టి తా


గమ్మని మ్రోతతో గరనఖమ్ముల భాండము లంగజాస్త్ర పా


తమ్మన బ్రోవు దీసె విటతండము గుండియ లారవిచ్చగన్ (93)


ముంగురు లంట జుట్టి తన మోమున మోము నమర్చి చీర ముం


గొంగు వదల్చి మన్మథుని గోప్యపు గేహము చెమ్మగిల్లగా


నంగజకేళి బల్లవుల నార్భటులం గరగింపనేర్చు నీ


జంగమువారి కాంత రతిజాణశిఖామణి యెంచి చూడగన్ (94)


తళ్కు తళ్కను కాంతి బెళ్కు కెంపుల ముంగ


రందమై కెమ్మోవి యందు గుల్క


ధగ ధగ ద్ధగలచే దనరారు బంగారు


గొలుసు లింగపుకాయ కొమరుమిగుల


నిగ నిగన్నిగలచే నెగడు చెల్వపు గుబ్బ


మేరు మిన్నందున మెలగుచుండ


రాజహంస విలాస రాజితంబగు యాన


మందు మెట్టెలు రెండు సందడింప


సరసదృక్కుల విటులను గరగ జూచి


పొందికైనట్టి మోమున భూతి రేఖ


రాజకళ లొప్ప నద్దంకి రాజవీథి


బొలిచె నొక కొమ్మ గాజుల ముద్దుగుమ్మ (95)


శ్రీకర భూషణంబులును సిబ్బెపు గుబ్బలు ముద్దుచెక్కులున్


గోకిలవంటి పల్కులును గొల్చిన చేరల గేరు కన్నులున్


బ్రాకట దేహకాంతియును బంగరుచాయకు హెచ్చువచ్చు నీ


చాకలివారి సుందరికి సాటిగ రారిక దొంటి జవ్వనుల్ (96)


మకరధ్వజునికొంప యొక చెంప కనుపింప


జీర కట్టినదయా చిగురుబోడి


యుభయపక్షములందు నురుదీర్ఘతరములౌ


నెరులు పెంచినదయా నీలవేణి


పసుపు వాసన గ్రమ్ము పైట చేలము లెస్స


ముసుకు బెట్టినదయా ముద్దుగుమ్మ


పూర్ణచంద్రుని బోలు పొసగు సిందూరంపు


బొట్టు పెట్టినదయా పొలతి నుదుట


నెమ్మి మీరంగ నిత్తడిసొమ్ములలర


నోరచూపుల గుల్కు సింగార మొల్క


గల్కి యేతెంచె మరుని రాచిల్క యనగ


వలపులకు బేటి యొక యొడ్డె కుల వధూటి (97)


విడిబడి నిట్ట వేగి యట బిర్రున వ్రాలిన నంతలోన దా


వడిసెల చేతబట్టుకొని వట్రువగుబ్బల బైట జారగా


నడుము వడంకగా బిరుదు నాట్యము సేయగ గొప్పు వీడగా


దొడదొడ యంచు నెక్కె నటు దొడ్డమిటారపు రెడ్డి కూతురున్ (98)


తొలకరి మించుతీగె గతి దోప దుకాణము మీద నున్న యా


యలికులవేణితో దములపాకుల బేరము లాడబోయి నే


వలచుట కేమి శంకరుని వంటి మహాత్ముడు లింగరూపమై


కలికిమిటారి గుబ్బచనుగట్టుల సందున నాట్యమాడగన్ (99)


నిబ్బరపు గలికిచూపులు


జబ్బించుకలేని పిరుదు సన్నపు నడుమున్


మబ్బు కురు లుబ్బు కుచములు


బిబ్బీలకు గాక కలవె పృథివీస్థలిపై (100)


హరినీలముల కప్పు లదలించు నునుకొప్పు


చెంగావిముసుకులో చిందులాడ


చక్రవాకముల మెచ్చని బలు సిబ్బెపు


బిగువు చందోయి పింపిళ్ళుకూయ


ధవళాబ్జరుచులునా దళుకులీనెడు నవ్వు


వెన్నెల నిగ్గుతో వొయ్యమంద


గొంతుకూర్చొని రసికుల దర్శన స్పర్శ


నంబుల మోహద్రవంబు జార


నెడమ కుడి హస్తముల సన్నలెసగ విటుల


రమ్ము రమ్మని పిలుచు గారవము దోప


నుర్వి మెరయించు కార్పాసపర్వతంబు


చేరి మర్దించె నొక్క పింజారితరుణి (101)


ఆ కదురున బికరవము


న్నా కదురున భృంగరవము నాత్మరవంబున్


ఏకీకృతముగ నేకు ల


నేకులు విన వడికె ముదిర యే కులముదిరా (102)


తెల్లమడుంగు కట్టి యరుదెంచెడు పాంథుల రెప్పలార్పగా


నొల్లక చూచుగాని మదినున్న విధంబు విలాసవైఖరిన్


చెల్లమి చేసి గాఢరతి నేలు నుపాయమొసంగదయ్యె నా


కల్లరి బొమ్మ యించుక విఘట్టన శూన్యపయోధరాగ్ర జా


గ్రల్లసమాన తైక్ష్ణలగు ద్రావిడభామల కెంత వెర్రియో (103)


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!