ధర్మజు ని రక్తం ఎన్ని బొట్లు నేలమీద పడతాయో అన్ని సంవత్సరాలు ఇక్కడ అనావృష్టి కలుగుతుంది.!
🚩ధర్మజు ని రక్తం ఎన్ని బొట్లు నేలమీద పడతాయో అన్ని సంవత్సరాలు ఇక్కడ అనావృష్టి కలుగుతుంది.!
.
✍🏿యుద్ధంలో జయం పొందిన విరాటరాజు, అంతకుముందే తన పట్టణానికి తిరిగి వచ్చాడు. . తన విజయాన్ని మెచ్చుకోవడానికి వస్తున్న వాళ్లందర్నీ అభినందిస్తున్నాడు.ఉత్తరుడు కనబడకపోయే సరికి ఎక్కడున్నాడు ? అని అడిగాడు
. దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ మున్నగు కురువీరులు. సైన్యంతో వచ్చి ఉత్తరిదిక్కున గోగ్రహణం చేసారనీ అందుచేత ఉత్తరుడు, బృహన్నల రధసారధిగా చేసుకొని ఒక్కడే యుద్ధానికి వెళ్లాడనీ, విరాటరాజు తెలుసుకుని దుఃఖంతో కుంగిపోయాడు
.
మహారాజా ! కౌరసైన్యాన్ని జయించి, మనగోవుల్ని మళ్లించి ఉత్తరుడూ, సారధీ వస్తున్నారు. చివరకు రధానికైనా ఈషణ్మాత్రంకూడా ప్రమాదం లేకుండా సురక్షింతగా ఉన్నారు. మమ్మల్ని పిలిచి మీరువడిగా పోయి పురంలో ప్రకటించండి అంటే వచ్చాం అన్నారు, వారు.
✍🏿విరాటరాజు హృదయాంతరాళాల నుండి పొంగిపొర్లిన ఆనందం ఆశ్రువులరూపంలో అతని నేత్రాలనుండి ధారాపాతంగా ప్రవహించినది. అతని ఒడలు పులకాంకితమైంది. ఏమిటేమిటి ? అంటూ గొల్లవాళ్లచేత పదేపదే చెప్పించుకొన్నాఆ శుభవార్త. మంత్రుల మొగములు సగర్వంగా చూచాడు.
కంకుభట్టును చూచాడు. నేస్తం ! ఒక ఆట వేద్దామా ? అన్నాడు, పట్టలేని సంతోషంతో .
నువ్వు సంతోషపరావశ్యంతో ఉన్నవు. ఈ వేళనీతో ఆడిగెలవడం కష్టం. అందుచేత భయపడుతున్నాను. అన్నాడు, కంకుడు.
విరాటుడు నవ్వినాడు. ఈ పరిసరంలో ఉన్న సైరంధ్రిని పాచికలు తెమ్మన్నాడు. ముందుకు దిగినాడు, ఇక్కడకురా అని కంకుణ్ణి పిలిచినాడు.
విరాటరాజు ఆనందోత్సాహం పట్టలేకపోతున్నాడు. చూశావా
నా కొడుకు ఉత్తరుడి బాహుబలం శౌర్యం ఎంతుఉదాత్తమైనవో ! కౌరవ సైన్యాన్ని ముట్టడించి, గెల్చి, గోవుల్ని తెచ్చాడు ! ఇంత ఘనకార్యం ఎప్పుడైనా, ఎవరైనా, ఎక్కడైనా చేశారా ! అన్నాడు పాచికలు వేస్తూ..
✍🏿భీష్మ, కర్ణ, దుర్యోదన, ద్రోణ, కృపామున్నగు యోధుల్ని ఉత్తరుడు ఒక్కడే జయించగలిగి నట్లయితే, ఇంతకన్న ఆశ్చర్యకరమైన విషయం లోకంలో ఉంటుందా ?
ప్రపంచంలో ప్రసిద్ధి కెక్కుతాడు అన్నాడు , కంకుడు.
కంకుడి మాటలు విరాటుని బాధించాయి. అతడు కటకట పడినాడు
.కౌరవసైన్యాన్నే అన్నమాటేమిటి ? దేవతలూ, రాక్షసులూ కలిసి వచ్చినా గెలుస్తాడు, ఉత్తరుడు, శత్రుసైన్యాలకు జడుపుపుట్టే ఆ బృహన్నలరధం మీద ఉండాలిగాని అన్నాడుకంకుడు .
విరాటుడి కోపం రెట్టించింది.ధర్మరాజు పట్టువదల్లేదు.
✍🏿చిరునవ్వునవ్వి యుద్ధం చేయాలని వేడుకపడి, అతి సాహసుడై, బృహన్నల ఉత్తరుణ్ణి సారధిగా చేసుకొని కౌరవసేనలను జయించి, ఒక్క పశువైనా పోకుండా అన్నిటినీ తెచ్చి ఉంటాడు. నా మాట నిజం అవుతుందోకాదో చూస్తూండు, అన్నాడు కంకుడు. అంతటితో ఆగక బృహన్నల విజయం పురంలో చాటించు అన్నాడారాజు మొగం చూస్తూ.
✍🏿విరాటుడు రౌద్రుడుయాడు. బుసకొట్టాడు. పేడిని పొగడడం మానమంటే మానవేం ? అంటూ పాచికను కంకుడి మొహానికేసి కొట్టాడు.
ఈ విధంగా దెబ్బతినినా, ధర్మారాజుకు కోపంరాలేదు. ద్రౌపది వైపు చూచి ఊరుకున్నాడు. ద్రౌపది గబగబ పరుగెత్తి అతని నొసటి దెబ్బనుండి కారుతున్న రక్తాన్ని తన పమిట చెంగుతో అద్ది, ఆ చేరువలోనున్న బంగారు కలశలోని నీళ్లతో చేతులు తడుపుకొని గాయాన్ని నెమ్మదిగా తుడుస్తున్నది.
✍🏿రక్తాన్ని చీర చెంగుతో అద్దుతున్నావేం ? అని విరాటుడు సైరంధ్రిని అడిగినాడు.
నిర్మలమైనవంశంలో పుట్టిన ఈ పుణ్యాత్ముని నెత్తురు ఎన్ని బొట్లు నేలమీద పడతాయో అన్ని సంవత్సరాలు ఇక్కడ అనావృష్టి కలుగుతుంది. ఉత్తమ బ్రాహ్మణుడికి హాని చేయడంవల్ల కలిగే పాపం ఎట్లాగూ కీడు కలిగిస్తుంది. కనుక నీకు హాని రాకుండా ఉండాలని ఇలాగ చేశాను. అంటూ ఆమె అతని గాయాన్నుండి కారుతున్న నెత్తురు తుడుస్తున్నది.
ఉత్తరుడొక్కడూ లోపలికి వచ్చినాడు. తండ్రిపాదాలకు మోకరిల్లాడు. విరాటుడు ఆనందబాష్పాలు కార్చి, కొడుకును గట్టిగా గుండెలకదుముకొన్నాడు. ఉత్తరుడు తండ్రికి పునః ప్రణామాలు చేశాడు. పిమ్మట కంకుడికి సగౌరవంగా నమస్కరించాడు. ఆతని నుదుటను ఉన్నగాయం చూచి ఇదేమి ? అన్నాడారుద్దాగా.
నాయానా ! నేను నీ విజయాన్ని పొగడుతూంటే అతడు పేడివాణ్ణి పొగడాడు. దాంతో, నేను కోపం ఆపుకోలేకపోయాను. అప్పుడు నాచేతిలో ఉన్న పాచికపుచ్చుకొని కొట్టాడు, అన్నాడు విరాటుడు.
ఉత్తరుడు భయమూ, సంభ్రమమూపడినాడు.
✍🏿అయ్యయ్యో ! నాన్నా ! గొప్పతప్పుచేశావు. నీవు ఇలాగ చేయవచ్చా ? వారు ఏం చెపుతే అదల్లా మనం అంగీకరించాలిగాని, ఇలాగ, కాదు, కూడదు అంటూ నిషేదించవచ్చా ? వారిని సవినయంగా బ్రతిమాలుకోండి. పవిత్రచరిత్రులైన పరమద్విజుల్నికోపించి అవమానించిన పరిపాలకులకు ఆయువు, సిరి కలుగుతాయా ? అన్నాడు, ఉత్తరుడు, అత్యాదరంతో.
ఉత్తరుని మాటలు పాటిగా బట్టి, విరాటుడు ధర్మరాజును భయభక్తులతో వేడుకొన్నాడు క్షమించమని. ధర్మరాజు నాకేం కోపంలేదు. నీ తండ్రి చెడుమార్గన నడిచేవాడు కాదు. ఈ దినము అటువంటిది హాని కలిగింది అని నవ్వుతూ ఉత్తరుడితో అన్నాడు. అప్పుడు తండ్రి, కొడుకులు సంతోషించారు.💥
Comments
Post a Comment