🔻 భీష్మ ప్రతిజ్ఞ!🔻 .
💥సంసార జీవితంపైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహమాడాలని నిశ్చయించుకుని శంతనుడు
సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు.
అప్పటికే భీష్ముడిని పుత్రుడిగా కలిగిన శంతనుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయటానికి వారు నిరాకరించారు. దానితో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనలోని తేడాను గమనించి, మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకుని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించడానికి సిద్ధమయ్యాడు భీష్ముడు. ఈ వివాహంకోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి, తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణా బాధ్యతను స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా అసలు వివాహమే చేసుకోనని భీష్మించి, తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు. తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుని అభినందించి, తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే వరాన్ని భీష్మునికి ప్రసాదించాడు శంతనుడు.💥
(చిత్రం రాజారవి వర్మ.)
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Comments
Post a Comment