స్వర్గసుఖాలు 🚩

                          స్వర్గసుఖాలు 🚩

💥
👉🏾అన్ని ప్రశ్నలే... సంధానాలు లేవు....పూజించి చూడు.

👉🏾అన్ని మతగ్రంధాలలోనూ పుణ్యం చేసుకుంటే స్వర్గసుఖాలు అనుభవిస్తామని వుంది. పాపం చేస్తే నరకం తప్పదు. 
కనుక, స్వర్గం-నరకం, హేవెన్-హెల్, జన్నత్-దోజక్---
ఇవన్నీ మనిషిని ధర్మ మార్గం మీద నడిపించటానికి 
ఇచ్చే ప్రోత్సాహకాల లాంటివి. అంతకు మించి ఇంకేమీ లేదు.
ఇక, స్వర్గానికి వెళ్తే మనకు అయ్యే గిట్టుబాటు ఏమిటీ?

👉🏾మన వాళ్ళు స్వర్గసుఖాలు కొన్ని చెప్పారు---
సురాపానము, రంభా, ఊర్వసీ,తిలోత్తమా, మేనక, ఘృతాచీ మొదలైన దేవవేశ్యలతో సమాగమము. 
బైబుల్ లోనూ, కొరాన్ లోనూ స్వర్గం లో ఉద్యానవనాలు వుంటవని వున్నది. వాటికి అండర్ గ్రౌండ్ నీటి సరఫరా కూడా వున్నదట. లేకపోతే, ఈ బోడి మాన్సూన్ వానల మీద నమ్మకం ఏమిటీ?
 శుభం.

👉🏾కాని, ఆడవాళ్ళు పుణ్యం చేసుకునే వీలు లేదా? 
వుంటే, స్త్రీలకు ప్రత్యేక సదుపాయాలేమిటీ?
 మగధీరులకైతే, రంభాసమాగమం లాంటి ఏర్పాట్లు వున్నవి. 

👉🏾స్త్రీలకు----కంతుడో, జయంతుడో, మన్మధుడో? 

తప్పు, తప్పు.చెంపలేసుకోండి. కాదు కూడదు, 

👉🏾పండుగ రోజైనా పాత మొగుడే అని, రామేశ్వరం పోయినా శనేశ్వరమే అని అక్కడా పాతివ్రత్యమేనా? 
పురాణానికి పోతే ఏమి చెప్పారే అని మొగుడు అడిగితే, 
భార్య అన్నదట: "అక్కడా నీ మొహానే మొద్దులు పెట్టమన్నారు", 
అని.
👉🏾అన్ని ప్రశ్నలే... సంధానాలు లేవు....పూజించి చూడు.

🔻🚩🔻🚩🔻🚩🔻🚩🔻🚩🔻🚩🔻🚩🔻🚩🔻🚩

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!