ఆయన ఇల్లెక్కడ...?* జోక్🌺
👉🏿ఓ పల్లెటూరి వ్యక్తి పనిమీద హైదరాబాద్ వెళ్ళాడు.
తీరా అక్కడికెళ్ళాక అతనికి సిన్మా యాక్టర్ల ఇళ్ళు చూడాలనిపించి ఫిలిం నగర్ వెళ్ళాడు.
👉🏿అక్కడ ఒకతన్ని పిలిచి "బాబూ...! చిరంజీవి ఇల్లెక్కడ...?" అనడిగాడు.
"రాజేంద్రప్రసాద్ ఇంటిప్రక్కన..." అని చెప్పేసి వెళ్ళిపోయాడతను.
👉🏾మళ్ళీ ఇంకొక అతన్ని ఆపి "ఏవండీ...! రాజేంద్రప్రసాద్ ఇల్లెక్కడ...?" అనడిగాడు.
"ఆ మాత్రం తెలీదా...! చిరంజీవి ఇంటి ప్రక్కనే... అతనూ వెళ్ళిపోయాడు.
👉🏿 పల్లెటూరి వాడికి చిర్రెత్తుకొచ్చింది. ఎవడూ సరిగ్గా సమాధానం చెప్పట్లేదని మరోక అతన్ని ఆపి "సారూ...! చిరంజీవి ఇల్లు, రాజేంద్రప్రసాద్ ఇల్లు ఎక్కడో కాస్త వివరంగా చెబుతారా..." అన్నాడు తెలివిగా.
👉🏿"భలే వాడివే! ఇందులో వివరించాడనికేముంది? వాళ్ళిద్దరి ఇళ్ళూ ప్రక్క ప్రక్కనే" అనేసి అతనూ వెళ్ళిపోయాడు. 🤣
🤣పల్లెటూరాయన ఇంకెవర్ని అడగలేదు
Comments
Post a Comment