వివేకానంద రాక్ మెమోరియల్, కన్యాకుమారి !
💥
.హిందూ మహాసముద్రం లో ఉన్న వివేకానంద మెమోరియల్ రాక్ గార్డెన్ తమిళనాడులోని కన్యాకుమారి ఒడ్డున కలదు. ఇక్కడికి వెళ్ళడానికి ఫెర్రీ సౌకర్యం కలదు. ఉదయం 8 నుండి సాయత్రం 4 వరకు మాత్రమే ఫెర్రీ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇది సముద్ర తీరం నుండి 200 మీటర్ల దూరంలో, సముద్రంలో ఒక పెద్ద రాయిపైన కలదు.
.
💥💥
వివేకానంద రాక్ మెమోరియల్ శ్రీ రామకృష్ణ పరమహంస భక్తుడైన స్వామీ వివేకానంద కు చెందినది. శ్రీ రామకృష్ణ రామకృష్ణ మిషన్ ను స్థాపించారు. వివేకానంద రాక్ మెమోరియల్ ను 1970 లో బ్లూ మరియు రెడ్ గ్రానైట్ రాళ్ళ తో నిర్మించారు. దీనిని రాక్ ఐలాండ్ లో శిఖరం పై సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తున నిర్మించారు. ఈ ప్రదేశం సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణం లో కలదు. మెమోరియల్ రెండు రాళ్ళ పై నిలబడి వుంటుంది. ఐలాండ్ నుండి 500 మీటర్ల ఎత్తున వుంటుంది.
.💥💥
వివేకానందుడు కన్యాకుమారి కి వచ్చి ఈ రాక్ వరకూ ఈత కొట్టుకుంటూ వెళ్లి అక్కడ రాత్రి మొత్తం తీవ్ర ధ్యానం లో ఉన్నాడని చెపుతారు. దాని తర్వాత ఆయన తాను దేశానికి పూర్తి గా అంకితం అవ్వటానికి నిర్ణయించుకున్నాడు. తన వేదాంత సందేశాన్ని ప్రపంచం అంతా వినిపించేందుకు సంసిద్ధుడు అయ్యాడు. 1983 సంవత్సరం లో ఆయన చికాగో లో వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించాడు. వివేకానంద రాక్ మెమోరియల్ వివేకానందుడి 1982 , డిసెంబర్ 24,25 మరియు 26 లలో ధ్యానం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం కొరకు చేసిన శ్రీపాద పరి సందర్శనను ప్రతిబింబిస్తుంది.
💥💥💥
వివేకానంద రాక్ మెమోరియల్ భవనం లో వివేకానందుడి విగ్రహాన్ని పర్యాటకులు చూడవచ్చు. ఈ మెమోరియల్ లో రెండు మండపాలు, శ్రీ పద మండపం మరియు వివేకానంద మండపం వుంటాయి. శ్రీపాద మండపం కన్యాకుమారి చే ఆశీర్వదించా బడిన శ్రీపాద పరాయి అనే పవిత్ర ప్రదేశంలో వుంటుంది.
వివేకానంద మండపం 4 భాగాలు అంటే సభ మండపం, ధ్యాన మండపం, ముందు ప్రవేశం మరియు ముఖ మండపం గా వుంటుంది. ధ్యాన మండపం ఒక మెడిటేషన్ హాల్ . దీనిలో పర్యాటకులు ధ్యానం చేయవచ్చు.
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
Comments
Post a Comment