పోతన గారి భాగవత పద్యం.! . 'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా ... కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ".! . (చదువుకోడానికి హాయిగా ఉండే పద్యం .) . సరస్వతీ మాత దర్శనం పోతనకింకా కాలేదు . ఆ దర్శనంకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఆ మాతృమూర్తి రూపాన్ని ఊహించుకుంటున్నాడు . అందరూ అనుకునే మాట . సరస్వతీ మాత తెలుపు రంగులో ధగధ్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందని . ఇక తన ఊహలకు పదను పెట్టాడు . శరత్కాలంలో తెల్లని కాంతులీనే మేఘాల వంటి తెలుపా లేక శారద చంద్రబింబం లాగా ఉంటుందా కాదు కాదు పచ్చకర్పూరం లాంటి తెలుపేమో మాతది . ఊహకు అందలేదు . తెల్లని పటీరమూ (చందనం) , రాజహంసా , జాజిచెండ్లూ , నీహారాలూ (మంచు తుంపెరలు) , డిండీరం ( నురుగు ) , వెండికొండా , రెల్లుపూలూ , మల్లెలూ , మందారాలూ , పుండరీకాలూ ( తెల్ల తామర పూలు ) , ఆదిశేషుడూ , అన్నిటికీ మించి ఆకాశ గంగా ప్రవాహం — తెల్లగా , తేలికైన పసుపురంగుతో ఉండే వస్తువులన్నీ మదిలో భాసించాయి . ఏవీ మాతృమూర్తి తెలుపు రంగుకు ఉపమానాలుగా సరిపోలేదు . మాతృమూర్తిని ఆర్తితో అడిగ...
యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! (ఎక్కడ స్త్రీలు పూజింప బడతరో,అక్కడ దేవతలు నివసిస్తారు. ) - స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం. ప్రహ్లాదుడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృ భావము జొచ్చి మరలువాడు అని పోతన వివరిస్తాడు. సీతని పరాభవించి రావణుడు, ద్రౌపదిని అవమానపరచి కౌరవులు ఎలా నాశానమయ్యారో మనకి తెలుసు. ఇన్ని తెలిసినా, ప్రగతి పథంలో పయనించే ఈ ఆధునిక యుగంలో నవ నాగరిక సమాజంలో కార్యాలయాల్లో,కళాశాలల్లో, అన్నిచోట్లా స్త్రీలు వేదింపబడటం శోచనీయం. చాటింగులు, డేటింగులతో, సెల్ ఫోను సంభాషణలతో యువత విచ్చలవిడిగా సంచరిస్తూ,లేత వయస్సు లోనే విషయవాంఛలకు లోబడి జీవితాలను నాశనం చేసుకోడం చూస్తూనే ఉన్నాం. స్త్రీలపై యాసిడ్ దాడులు, గొంతులు కోయడాలు, అత్యాచారాలు ఇలా ఎన్నోదురాగాతాలు సమాజంలో జరగడానికి కారణం క్రమశిక్షణా లోపమే. ఎంత చదువు చదివినా,ఎంత విజ్ఞానం సంపాదించినా, అరణ్యరోదనన్యాయంలా”పనికి రాకుండా పోతోంది. అసమానతలు తొలగి, ఆభిజాత్యాలు మరచి, అందరు సుఖశాంతులతో జీవించాలన్నా,సమతా,మమతా, మానవతలు సమాజంలో వెల్లివిరియాలన్న- ఒక్కటే మార్గ...
Comments
Post a Comment