🔻💥అశ్వత్థామ కావించిన మారణహోమం .. సౌప్తికపర్వం 💥🔻





🔻💥అశ్వత్థామ కావించిన మారణహోమం .. సౌప్తికపర్వం 💥🔻
------------------------------(నిద్రాపర్వం)!
.🚩🚩
ఏ మానవునకైనను మితిమీరిన ఆవేశము మంచిది కాదు. ఆవేశము వివేకమును చంపుటేగాక నీచతకు పాల్పడజేయును. అందునూ, క్రోధస్వభావుని ఆవేశము మహాక్రూరము

అశ్వత్థామ ద్రోణాచార్యుని ఏకైక ప్రియపుత్రుడు. తన తండ్రి విద్యాధనము అన్యుల కంటే తనకెక్కువ చెందవలెనని ఆశించుటే గాని, యోగ్యతవిషయ మాతని యోచనకు రాదు. గురు పుత్రుడనను అహంకారమే అతని ఆధిక్యభావనకు ప్రబలహేతువు.

అయోగ్యుడని తెలిసియు పుత్రప్రేమకు వశుడై ఆచార్యుడు అశ్వత్థామకు బ్రహ్మాస్త్రప్రయోగము బోధించాడు. ఉపసంహారము బోధించలేదు. దాని ప్రయోగము ఎట్టి పరిస్థితులలోనూ మానవులపై జరగకూడదన్నాడు.
🚩
మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనునకు మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూబపై కాకులు పగటి పూట ఎలా దాడి చేస్తాయో, అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందించాడు. అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యునితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళాడు. కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది. కానీ అప్పటికే కృష్ణుడు సాత్యకితో సహా పాండవులందర్నీ గంగానదీ తీరానికి తరలించాడు.

🚩
తన శిరోరత్నాన్ని కోల్పోయిన అశ్వత్థామ.
అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం పొందాడు. అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వచ్చాడు. ద్రౌపదీ పుత్రులైన ఐదుమంది ఉపపాండవులను చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరినీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ అలా చేయలేక పోతాడు. కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకు దారి మళ్ళిస్తాడు. వారిలో అర్జునుని కోడలు ఉత్తర కూడా ఉంది. ఆమె కడుపులో ఉన్నది. పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్టించాల్సిన పరీక్షిత్తు. బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బతికిస్తాడు. అశ్వత్థామను 3 వెల సంవత్సరాలపాటు కుష్టు వ్యాధి గ్రస్థుడివి కమ్మని కృష్ణుడు శపిస్తాడు.
🚩🚩🚩
పక్క ఇంటి పగవానిని ప్రత్యక్షముగ ఎదిరించలేక అతడింట లేనప్పుడు రాత్రివేళ అతని కొంపకో లేక పంటకుప్పకో నిప్పంటించి లేదా అతని పండ్ల పూలతోటలనో చాటుమాటుగా ధ్వంసం చేసి నీచపరాక్రమమును, రాక్షసావేశమును ప్రదర్శించిన అశ్వత్థామలను ఎందరినో లోకమున నేడు చూస్తున్నాము- అను అప్పజోడు వేంకటసుబ్బయ్య గారి వాక్కు అక్షరసత్యం!

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!