వ రవీణా మృదు పాణి ఎవరు?

వ రవీణా మృదు పాణి ఎవరు?

💥💥💥

👉🏾కర్ణాటక సంగీతం నేర్చుకున్న (కుంటున్న) విద్యార్థులు అందరు 'మోహన' రాగం లోని "వరవీణా మృదుపాణి" గీతం తప్పని సరిగా నేర్చుకుంటారు.
👉🏾ఇది శ్రీ పురందర దాస రచన. కర్ణాటక సంగీతానికి
'మాయా మాళవ గౌళ' రాగాన్ని మౌలిక రాగంగా తీసుకుని సరళీ, జంట స్వరాల తో ప్రారంభించి అలంకారాలు, పిళ్ళారి గీతాలు మొదలయిన వాటిని పాఠ్య అంశాలు గా క్రమ పరచి అపారమైన సేవ చేసిన ఈ మహానుభావుడు "కర్ణాటక సంగీత పితామహుడు" అని జగద్విదితము.

👉🏾 అయితే నాకు ఎప్పుడూ ఒక సందేహం ఉండేది.
ఈ గీతం 'సరస్వతి' గురించా? లేక 'లక్ష్మి' గురించా? అని. ఎందుకంటే వీణ ఉండేది సరస్వతి కి కదా! అందుకే 'వీణాపాణి' అన్నారు. అంతే కాకుండా గీతం చివరలో 'జయవాణి' అని ముగిస్తారు.
కాని, గీతంలో స్తుతించే దేవిని 'రంగ నాయకి' అని అభివర్ణిస్తారు.
అంటే శ్రీ రంగనాథుని పత్ని అయిన శ్రీ మహాలక్ష్మి.
లక్ష్మీ శ్లోకం లో కూడా "శ్రీ రంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం" అని వర్ణన ఉంది.

👉🏾ఈ గీతాన్ని దాని అర్థాన్ని పరిశీలిద్దాం.

రాగం: మోహన
తాళం: రూపక
💥
వరవీణా మృదుపాణి వనరుహ లోచను రాణి

సురుచిర బంభరవేణి సురనుత కల్యాణి

నిరుపమ శుభగుణలోల నిరత జయాప్రదశీల

వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి

సరసీజాసన జనని జయ జయ జయ జయవాణి 🚩

👉🏾తాత్పర్యము:
వర వీణను తన మృదువైన చేతుల దాల్చిన పద్మలోచనుని
(విష్ణుని) రాణియై, తుమ్మెదల వంటి వంపులు తిరిగిన కురులు గలిగి, దేవతలచే స్తుతించ బడిన, శుభ గుణములు గలది,
సామ్యం లేని మంచి లక్షణాలు గలిగి, ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించే స్త్రీ, వరదుని (విష్ణుని) ఇష్ట సఖియైన రంగనాయకి
(శ్రీ రంగని పత్ని) అయి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే

బ్రహ్మకు తల్లి అయిన లక్ష్మీ దేవి జయాన్ని ప్రసాదించు గాక!

తమిళం లో అలమేలు మంగను 'తాయారు' అని వేంకటేశుని 'పెరుమాళ్' అని అంటారు.
ఆ విధంగా ఈ శ్లోకం శ్రీ లక్ష్మీ దేవిని స్తుతించేది అయినా, వరవీణ, జయవాణి పదాలకు లక్ష్మికి గల సంబంధం నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే చెప్పగలరు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Comments

  1. పురందర దాసు గారు భక్త శిఖామణి. ఆయన తండ్రి గా సకల పురుష దేవ స్వరూపాలను, తల్లిగా సకల స్త్రీ దేవతా స్వరూపాలను   దర్శించారు. అందుకే సరస్వతీమాత, లక్ష్మీమాత, పార్వతీమాత అందరినీ తల్లిగానే తలచి పరిమితులు లేని భక్తిపారవశ్యాన్ని గీతములు, స్తోత్రముల రూపములో వ్రాసి ఉంటారు  
    (నా చిన్ని బుర్రకు తట్టిన ఆలోచన. మన్నించగలరు)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!