Abhimanam Songs - Oho Basthi Dorasani - Akkineni Nageswara Rao, Savitri,...

ఓహో బస్తి దొరసాని ' పాటకి మాతృక హిందీ అయినా అందులో 'హాయ్' ఉంది.

ఇప్పుడే గుర్తు వచ్చిన ఒక హిందీ కాపీ పాట. రెండు బాషలలోను నాకు ఇష్టం.

పల్లవి:

ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది

అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది

ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది

అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది

ఓహో బస్తీదొరసానీ..

చరణం : 1

ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది

పూలదండతో బాటే మూతికూడ ముడిచింది

ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది

పూలదండతో బాటే మూతికూడ ముడిచింది

హాయ్.. ఆపై కోపం వచ్చింది

వచ్చిన కోపం హెచ్చింది

అందచందాల వన్నెలాడి అయినా బాగుంది

ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది

అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది

ఓహో బస్తీదొరసానీ..

చరణం : 2

కొత్త పెళ్ళికూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది

మత్తుమత్తు కన్నులతోను మనసుతీర చూసింది

కొత్త పెళ్ళికూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది

మత్తుమత్తు కన్నులతోను మనసుతీర చూసింది

హాయ్... ఆమెకు సరదా వేసింది

జరిగి దగ్గరకొచ్చింది

అందచందాల వన్నెలాడి కోపం పోయింది

ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది

అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది

ఓహో బస్తీదొరసానీ..

చరణం : 3

పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది

పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది

పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది

పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది

హాయ్... చివరకు చిలిపిగ నవ్వింది

చేయి చేయి కలిపింది

అందచందాల వన్నెలాడి ఆడి పాడింది

ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది

అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది

ఓహో బస్తీదొరసానీ ఓహో బస్తీదొరసానీ ఓహో బస్తీదొరసానీ

Comments

  1. పాత పాటలు పాత చింతకాయ పచ్చడి లా ఉంటుంది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.