Posts

Showing posts from August, 2013

కాళింది లో గోవిందం -

Image
కాళింది లో గోవిందం -( రచన... ఓలేటి శ్రీనివాసభాను...) ఆడింది ఆడింది పాదం కాళింది లో గోవిందం మున్నీట సర్పం - మూడింది దర్పం ... మిన్నూ-  మన్నూ ఏకం... ఊగింది లోకం!   ఆడింది .... ఆడింది పాదం ... గాలీ-నీరూ కాలకూటంగా వ్రేపల్లె కే సంకటంగా ఘోరంగా- ప్రాణం పోవంగా "రంగా.. రంగా" యన్న ఆలకించంగా!  ఆడింది... ఆడింది పాదం... పడగెత్తి నాగన్న లేవంగా బుసకొట్టి కోరలు తెరువంగా వాటంగా- వాలం సాయంగా నిలువెల్ల మదమంత - నీటను కలువంగ!  ఆడింది ... ఆడింది పాదం నేత్రం- జలజాతపత్రం గాత్రం-ఎంతో పవిత్రం శిఖిపింఛ మౌళి - శ్రీ  బాల శౌరి చిందులేసిన తీరు చిత్రాతి చిత్రం!  ఆడింది .. ఆడింది పాదం..

పోతనా మాత్యుని శ్రీ కృష్ణుని వర్ణన....

Image
పోతనా మాత్యుని శ్రీ కృష్ణుని  వర్ణన.... కటి చేలంబు బిగించి, పింఛమున జక్కం గొప్పు బంధించి, దో స్తట సంస్ఫాలన మాచరించి, చరణద్వంద్వంబు గీలించి, త త్కుటశాఖాగ్రము మీదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానం బనూనంబుగన్.. కృష్ణుడు కాళీయమర్దనానికి సంరంభంతో ఉరుకుతున్న సందర్భం. పైన చెప్పిన పద్యం ఒక స్థిరచిత్రం (still photograph) అయితే, ఇది చలనచిత్రం! అందులో కృష్ణుని పసితనం కనిపిస్తే ఇందులో గోపకిశోరుని పొంగు మన కళ్ళముందు కదలాడుతుంది. ఉత్తరీయాన్ని నడుముకి బిగించాడు. జాఱకుండా పింఛాన్ని చక్కగా కొప్పున బంధించాడు. జబ్బలు రెండూ చఱిచాడు. రెండు కాళ్ళనీ దగ్గరగా తెచ్చాడు. తెచ్చి, ఆ చెట్టుకొమ్మపైనుండి గభాలున చెఱువులోకి దూకాడు. ఎవరు? సింహకిశోరం లాంటి గోపాలుడు. "లాంటి" ఏవిటి, అప్పుడతడు సింహకిశోరమే! అంతెత్తునుండి దూకేసరికి, గుభగుభమన్న శబ్దం నలుదిక్కులా నిండిపోయిందట! పద్య నిర్మాణంలోని సొగసు బిగువు వల్ల కృష్ణుడిలో ఉఱకలు వేస్తున్న అదే ఉత్సాహం మనలోనూ కలగడం లేదూ! అదీ కవిత్వమంటే!

మీగడపెరుగుతో మేళవించిన చల్ది, ఊరగాయలూ తెలుగుదనపు ఘుమఘుమలు

Image
కడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి విమల శృంగంబును వేత్ర దండంబును జాఱి రానీక డా చంక నిఱికి మీగడపెరుగుతో మేళవించిన చల్ది ముద్ద డాపలి చేత మొనయ నునిచి చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి సంగడీల నడుమ జక్కగ గూర్చుండి నర్మభాషణముల నగవు నెఱపి యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద శైశవంబు మెఱసి చల్ది గుడిచె... (పోతనామాత్యుడు) ఆవుల్ని తోలుకొని ఊరుబయట వనంలోకి గోపాలకులందరూ వచ్చారు. భోజనం వేళ అయ్యేసరికి తెచ్చుకున్న చల్ది తినాలని అందరూ కూర్చున్నారు. కృష్ణుడి చేతిలో ఎప్పుడూ మురళి ఉంటుంది కదా! మరి అన్నం తినేదెలా? ఆ వంశనాళాన్ని (అంటే వెదురు గొట్టం!) తన నడుము చుట్టూ చుట్టగా కట్టుకున్న తుండుగుడ్డలో జొనిపాడు. అంతేనా - ఆవులని అదిలించేందుకు చిన్న బెత్తము (వేత్రదండం), కొమ్ముబూరా కూడా ఉన్నాయి చేతిలో. వాటినేమో జాఱిపోకుండా ఎడం చంకలో ఇఱికించాడు. అదే చేతిలో చలిది ముద్దని అదిమి పట్టుకున్నాడు. మాములు చల్దన్నమా అది! చక్కని చిక్కని మీగడపెరుగుతో కలిపినది. మరి ఆ పెరుగన్నంలో నంచుకోడానికి ఏమిటున్నాయి? చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలున్నాయి. అంటే ఇంకాస్త కావా

దృత రాష్ట్రుడు అనగా,

Image
దృత రాష్ట్రుడు అనగా,  తనది కాని రాష్ట్రాన్ని తనదిగా భావించే వాడే దృతరాష్ట్రుడు. మాయ స్వరూపం తోటే, భగవద్గీత మొదలయినట్లుగా అనిపించుచున్నది.. భగవద్గీత మొదటి  అధ్యాయం, దృతరాష్ట్ర ఉవాచ... అని మొదలవుతుంది..  రాష్ట్రుడు అనగా, రాష్ట్రమును ధరించినవాడు..దృత రాష్ట్రుడు అనగా,  తనది కాని రాష్ట్రాన్ని తనదిగా భావించే వాడే దృతరాష్ట్రుడు. ఈ ప్రపంచము,  దేహము,ఇంద్రియములు, మనస్సు బుద్ధి మున్నగున్నవి దృశ్యములు. అవి తానూ కాదు.  దృక్కగు ఆత్మ ఒకటియే తానూ గాని, దేహాది దృశ్య పదార్దములు కాదు. కానీ అజ్ఞాని,  తనది కానట్టి, అనగా ఆత్మేతమైనట్టి దేహాది దృశ్యరూప రాష్ట్రమును తనదిగా దలంచి  దానిపై మమత్వము, అహంభావము గలిగియుండుచున్నాడు. కనుకనే అతడు దృతరాష్ట్రుడు.  అజ్ఞాన భావంతో గూడి యుండు వారందరున్నూ దృత రాష్ట్రులే అని  గీతా మకరందం వివరిస్తుంది.  తనది కాని దానిని తనదిగా భావించి, భ్రమించే అజ్ఞాన అంధకారంలో ఉన్న  జీవుడు ఇలా పలికెను..అని మాయా స్వరూపాన్ని గురించి గీత  మొదట్లోనే వివరించుచున్నది..

అదే నీ ధ్యానము. శివధ్యానము. ..

Image
శివధ్యానము పరమేశ్వరుని ధ్యానము గురించి మహాకవి కాళిదాసు చక్కగా వివరించేడు. శివుడు జ్ఞాన స్వరూపుడు గనుక, ఆయన జ్ఞానాత్మకమైన స్వరూపాన్నే ధ్యానిస్తూ ఉంటాడు. అంటే తననే ధ్యానిస్తూంటాడు.  ఈ విశ్వంలో ప్రతిదీ సృష్టిగతమైన తన ధర్మాన్ని అనుసరించి చరిస్తుంది. నువ్వు వాటి గురించి ధ్యానించినా, లేకపోయినా వాటి పని అవి నియమానుసారం చేసుకుపోతుంటాయి. వాటికి నీ ధ్యానంతో పనిలేదు.  మరి ఈ సృష్టిలో నీకూ అస్తిత్వం వుంది. మిగతావాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీ అస్తిత్వానికి అర్థం ఏమిటి? అసలు నువ్వెందుకు ఉన్నట్లు? కాబట్టి నీవేమిటో తెలుసుకో. నీదైన జ్ఞానాన్ని పొందు. సృష్టిగతమైన నీ ధర్మం పట్ల, నీ జీవనచర్య పట్ల పరిపూర్ణమైన ఎరుకను కలిగివుండు. ఆనందంగా వుండు. శాంత మనస్కుడవై వుండు.  అదే నీ ధ్యానము. శివధ్యానము. 

“పాలుపంచుకొనుట”

Image
ఒకనాడు బాలకృష్ణుడు గోపబాలురతో కూడి ఆటలాడుచుండెను. “మీరందఱూ వేషధారులు నేను సూత్రధారిని” అంటూ వారితో వింత ఆటలాడేవాడు చిన్నికృష్ణుడు. ఆటలమధ్యలో ఉండగా వారికి కమ్మని కాగిన పాల వాసనలు వచ్చినవి. వారు ఆ వాసనలు వచ్చుచున్న ఇంటిలోకి వెళ్ళారు. అక్కడ వారికి ఎన్నో కడవలనిండా మంచిగా కాగిన కమ్మని పాలు కనిపించాయి. అఖిలలోక వసుప్రదాత అయిన కృష్ణస్వామి కడవలలోని పాలను తన తోడిపిల్లలకు పంచివేశాడు. అంతటితో ఆగకుండా ఖాళీ అయిన కడవలను కూడా పగులగొట్టి వేశాడు. కన్నయ్య చేతలోని ఆంతర్యం గ్రహించలేక పాపం ఆ ఇంటి పడుచు యశోదతో శ్రీకృష్ణుని దుడుకుపని వివరించి “ఓ పడతీ! నీ బిడ్డడు మా ఇంట ఇటువంటి అల్లరి చేశాడు. అసలు మీ వాడికి భయభక్తులు ఉన్నాయా?” అని వాబోయింది. ఆ లీలామానుషవిగ్రహుని అర్థం చేసుకొనుట ఎవరి తఱం ? పడఁతీ! నీ బిడ్డఁడు మా కడవలలో నున్న మంచి కాఁగిన పా లా పడుచులకుఁ బోసి చిక్కిన కడవలఁ బో నడిచె నాజ్ఞ గలదో లేదో? జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా? “పాలు” అనే శబ్దము పంచుకోదగిన పదార్థమునకు సంకేతము. అందుకనే మన తేనెల తెలుగు భాషలో “పాలుపంచుకొనుట” అనే ప్రయోగం ఉన్నది. నలు

Keshav.Keshav. Painting.

Image
Keshav.Keshav. Painting.

Bhagavatha - Markandeya's Vision of Maya

Image
Bhagavatha - Markandeya's Vision of Maya Sage Sukha describes the qualities of Kaliyuga, which began immediately after Krishna's departure. Wealth alone will be the criterion of the pedigree, morality and merit. Righteousness, purity of body and mind, forgiveness, keenness of memory will decline. Men will be greedy, immoral and merciless. Kings will be impatient to conquer the whole globe. Mother earth laughs: "Kings wage wars and want to own the entire earth. Glorious kings, mighty demons have ruled this earth, but their names are mere stories now -- and their object remains unaccomplished." Shuka says, "O King! The stories of these legends have been narrated to instill in men the ephemeral nature of worldly enjoyments and also to help develop a distaste for them. On the other hand, inculcating a taste for Krishna's stories, and devoting oneself to him, gives joy and permanently ends all misery." Parikshit asks Shuka, "Tell me O Sage!

ముందుగ వచ్చితీవు...

Image
ముందుగ వచ్చితీవు... ఈ రోజు మళ్ళీ తిరుపతివెంకటకవులదే ఇంకొక పద్యాన్ని తలుచుకుందాం: ముందుగ వచ్చితీవు, మునుముందుగ నర్జును నేను జూచితిన్ బందుగులన్న యంశమది పాయకనిల్చె సహాయ మిర్వురున్ జెందుట పాడి, మీకునయి చేసెద సైన్య విభాగ మందు మీ కుం దగు దాని గైకొనుడు, కోరుట బాలుని కొప్పు ముందుగన్ ఈ పద్యంలోని గొప్పదనం తెలియాలంటే అది వచ్చే సందర్భాన్ని ఒక్కసారి సింహావలోకనం చెయ్యాలి. కౌరవ పాండవులకి యుద్ధం నిశ్చయమైపోతుంది. సైన్య సమీకరణంలో భాగంగా, కృష్ణుణ్ణి తనవైపుకు తిప్పుకోవాలన్న ప్రయత్నంతో దుర్యోధనుడు స్వయంగా కృష్ణుని వద్దకు బయలుదేరుతాడు. అది తెలుసుకుని ధర్మరాజు అర్జునుణ్ణి కృష్ణుడి వద్దకు పంపిస్తాడు. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి చేరుకుంటారు. దుర్యోధనుడు కాస్త ముందువస్తాడు. కానీ కృష్ణుడి తలదగ్గరున్న ఆసనంలో కూర్చోడంతో, కాళ్ళదగ్గరున్న అర్జునుణ్ణి ముందుచూస్తాడు కృష్ణుడు. తను ముందొచ్చాను కాబట్టి, తనకే సాయంచెయ్యాలంటాడు దుర్యోధనుడు. ఇదీ సందర్భం. కృష్ణుడు తన మాటల చాకచక్యాన్నంతా చూపించే పద్యమిది. పద్యం చూడ్డానికి సాధారణంగా ఉన్నా, ఇలాటి పద్యం రాయడం కష్టం. తనకి మాత్రమే సాయం చెయ్యాలన్న దుర్యోధనుడితో, అర

శ్రీ వడ్డాది సుబ్బారాయుడు.

Image
ఒక తండ్రి, తన బిడ్డకి ఊహ తెలియని రోజుల్లో, పనిమీద పరదేశానికి వెళ్ళి, కొన్నాళ్ళ తర్వాత ఆ బిడ్డకి ఊహ తెలిసే వయసుకి తిరిగి వచ్చాడనుకోండి. "అతనే నాన్న" అని తల్లి చెప్పి, ఆ తండ్రి ఆప్యాయంగా ఆ బిడ్డని చేరబోతే, ఆ బిడ్డ మనస్థితి ఎలా ఉంటుంది? ఇలాటి అనుభవం ఈ కాలంలో మరీ అరుదేమీ కాదు. ఉద్యోగ రీత్యా భార్యా పిల్లలని వదలి పరదేశాలకి వెళ్ళే వాళ్ళు చాలామందే కనిపిస్తారు కదా. అలాటి పరిస్థితిని పద్యంలో వర్ణించడమే కాదు, మరో మహత్తరమైన విషయాన్ని చెప్పడానికి, దీన్నొక పోలికగా ఉపయోగించిన ఒక మంచి పద్యం ఇది. జననీ గర్భములోన నుండగ విదేశంబేగి, బెక్కేండ్లకున్ జనుదే దండ్రిని గాంచు బిడ్డవలె నీ సంబంధమున్ ముందు నే గన కీ వేళ నెఱింగి స్నేహభయశంకాముత్త్రపాశ్చర్య భా జనమై నిల్చితి జేరదీసికొనవే సద్భక్తచింతామణీ! ఈ పద్యాన్ని రాసిన కవి శ్రీ వడ్డాది సుబ్బారాయుడు. ఇతను 1854-1938 మధ్య కాలంలో జీవించారు.

ఆంధ్రప్రశస్తి.....

Image
ఖండకావ్యము: తెలుగు వెలుగు కృతికర్త: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు ఖండిక: ఆంధ్రప్రశస్తి రాజమహేంద్రుని రంగస్థలంబున నాట్యమాడించె నన్నయ్య కవిత, కావేరినీటిలో గలిపి సంగీతంబు ద్రావణంబొనరించె త్యాగరాజు, జీవకళలుదేఱ జిత్రవిహారముల్ చిత్రించిరీయాంధ్ర శిల్పివరులు, అసహాయశూరులై యలరి యీయాంధ్రులు గంగలో కత్తులుగడిగినారు, ధణధణంధణ సాగరాంతముల మ్రోగె జయరవంబులనీభేరి జగతిలోన, అలరెనీ శాసనములు శిలాక్షరముల రమ్యతరమైనదౌర! యాంధ్రప్రశస్తి!!!

భరతభూమి ధన్యభూమి.

Image
పిల్లలకు పాలు లేకపోతే మనం ఎంత బాధపడతామో లేగదూడలకు పాలుపట్టినీయకుండా పాలుపిండుకుంటే ఆవులు కూడా అంతే బాధను అనుభవిస్తాయి. సర్వాంతర్యామి అయిన బాలకృష్ణుడు పశుపక్షాదుల బాధలను అర్థం చేసుకొని వాటిని బాధించకుండా వాటితో సహజీవనము చేయాలని మనకు బోధించినాడు. ఆవులు దూడలకు పాలు ఇచ్చిన తరువాతే మనం మిగిలిన పాలు తీసుకోవాలన్నదే జగద్గురువైన కృష్ణుని ఆంతర్యం . పశుపక్షాదులను సైతం ప్రేమించి అహింసాయుత జీవనాన్ని లోకానికి బోధించిన భరతభూమి ధన్యభూమి.

కష్టజీవి శ్రీకృష్ణుడు ........సత్యనారయణ పిస్కా...

Image
కష్టజీవి శ్రీకృష్ణుడు ........సత్యనారయణ పిస్కా...   మీలో చాలామందికి ఈ వ్యాసం యొక్క శీర్షిక (Title) చిత్రంగా తోచవచ్చు - "శ్రీకృష్ణుడు కష్టజీవి ఏమిటీ?!" అని. వ్యాసమును చదివిన పిమ్మట, ఈ శీర్షిక పెట్టడంలోని సామంజస్యాన్ని మీరే నిర్ణయించాలి.          శ్రీరాముని కంటే హెచ్చు సందర్భాల్లో కష్టనష్టాలను చవిచూసినవాడు శ్రీకృష్ణుడు...         కృతయుగంలో శ్రీరామునిగా మనకు ఎన్నో ఆదర్శాలను బోధించిన శ్రీమహావిష్ణువే, మళ్ళీ ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా జన్మించి ఎన్నో బాధలనూ, కష్టాలనూ అనుభవిస్తూ, మనకెన్నో ధర్మసందేశాలను అందించాడు.          శ్రీకృష్ణునిది విలాసజీవితం అనుకుంటారు ఎంతోమంది. నిజానికి, శ్రీరాముని కంటే హెచ్చు సందర్భాల్లో కష్టనష్టాలను చవిచూసినవాడు శ్రీకృష్ణుడు.          శ్రీకృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు. శ్రీరాముని జీవితమే మనకు కష్టాలమయంగా కనిపిస్తుంటుంది. ఈ విషయంపై ఒకసారి దృష్టి సారిద్దాం.          శ్రీరాముని శైశవం, బాల్యం బహుసుఖంగానే గడిచాయి. సీతను వివాహమ

చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ...

Image
చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టు దట్టి సందిట తాయెత్తులు సరి మువ్వ గజ్జెలు చిన్ని కౄష్ణా నిన్ను నే చేరి కొలుతు ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా పోయెద మెక్కడి కైనను మాయన్నల సురభులాన మంజులవాణీ.. (పోతనామాత్యుడు..)

యోరుగల్లు,..

Image
ఖండకావ్యము: తెలుగు వెలుగు కృతికర్త: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు ఖండిక: ఆంధ్రరాజధానులు  శ్రీయుగంధరమంత్రి శేఖరశేముషీశ్రీరమ్యమైనది యోరుగల్లు, కాకతీరుద్రుని కైలాససదనమై యొప్పారు శైలాగ్రమోరుగల్లు, ఉభయకవిసుహృత్తునుజ్జ్వలకవితాసి నొఱపుజేసినఱాయి యోరుగల్లు,  మందారమకరందమాధుర్యమును జీర్ణమొనరించుకొనుభూమి యోరుగల్లు, పాదుసాహులకును పైకత్తిగానాగి గుండెతల్లడంబు గూర్చె పెల్లు, చెప్పగిప్పరాని శ్రీలకు పుట్టిల్లు, వీరరసముగల్లదోరుగల్లు!!!

తెలుగు తల్లి!!!

Image
ఖండకావ్యము: తెలుగు వెలుగు కృతికర్త: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు ఖండిక: తెలుగుతల్లి భద్రాద్రి రఘురాము పాదసేవదరించు రామదాసుండు గారాపుబిడ్డ, కృతిరామునకునిచ్చి కృతకృత్యుడైనట్టి పోతన్న నీముద్దు పుత్రకుండు,  రామసంకీర్తనారక్తి ముక్తుండైన త్యాగయ్య నీప్రియతనయుడమ్మ, కాళహస్తీశ్వరు కరుణావిశేషంబు గన్న కన్నప్ప నీకన్నకొడుకు, కాంచికాక్షేత్రమందు శంకరుని కరుణ నవ్యయపదంబు గైకొన్న యసదృశుండు, వాడు చిరుతొండనంబి నీపాపడమ్మ, తెలియ నీకెవ్వరీడమ్మ తెలుగు తల్లి!!!

ధర్మవర్తనులమైతే బ్రహ్మలోక ప్రాప్తి కరతలామలకము.....

Image
మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావింపజేస్తుంది. ఆచారముతోనే ధర్మవర్ధనము జరుగుతుంది. దైవభీతి పాపభీతి లేనివాడు తనకుతానే కాక సమాజానికి కూడా హానికరము. అతిథిసేవ మిత్రవాత్సల్యం క్షమాగుణములు మనకు ఆదర్శప్రాయములు. ధర్మవర్తనులమైతే బ్రహ్మలోక ప్రాప్తి కరతలామలకము.....

Laila Majnu 1949 Telugu - Payanmaye Priyatama, Ghantasala, SamudralaSr C...

Image
మనసును హత్తుకునేలా ఘంటసాల గారి మొదటి హిట్ సాంగ్.

సామజ వర గమన......

Image
సామజ వర గమన సాధు హృత్ - సారసాబ్జు పాల కాలాతీత విఖ్యాత సామని గమజ - సుధా మయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మామ్ పాలయ వేదశిరో మాతృజ - సప్త స్వర నాదా చల దీప స్వీకృత యాదవకుల మురళీవాదన వినోద మోహన కర, త్యాగరాజ వందనీయ....

దేవులపల్లి కృష్ణశాస్త్రి ....

Image
సార్వజనీనమైన మనిషి ఆలోచనల్లో పుట్టిన సాహిత్యం... వెయ్యికాలాలు వర్థిల్లుతుందట. సరిగ్గా అలాంటివే దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం. విరహవేదనను ఎంత హృద్యంగా వర్ణించారో చూడండి ఆయన. క్షణాలు రాళ్ళుగా మారి కదలడం లేదట. మనసులో రూపం మాత్రం అలానే ఉందట. పోనీ వెళ్దామా అంటే... కుదరడం లేదట. అసలు వేదన ఎంత మధురంగా ఉంటుందా అని... చదివిన వారికి తొలి సారి అనిపిస్తుంది.... ఏ సీమల ఏమైతివో ఏకాకిని నా ప్రియా.. ఏకాకిని నా ప్రియా.. ఏలాగీ వియోగాన వేగేనో నా ప్రియా.. ఏలాగీ మేఘమాసమేగేనో ప్రియా.. ప్రియా.. ప్రియా.. ఘడియ ఘడియ ఒక శిలయై కదలదు సుమ్మీ.. ఎద లోపల నీ రూపము చెదరదు సుమ్మీ.. పడి రావాలంటే వీలు పడదు సుమ్మీ.. వీలు పడదు సుమ్మీ.. దారులన్నియు మూసె దశ దిశలు ముంచెత్తె.. నీరంధ్ర భయధాంథకార జీమూతాళి.. ప్రేయసీ.. ప్రేయసీ.. వెడలిపోయితివేల ఆ అగమ్య తమస్వినీ గర్భకుహరాల.. తమస్వినీ గర్భకుహరాల.. లోకమంతా పాకినవి పగటి వెలుగులు.. నాకు మాత్రం రాకాసి చీకట్ల మూలుగులు.. రాకాసి చీకట్ల మూలుగులు.. ఎపుడు నీ పిలుపు వినబడదో అపుడు నా అడుగు పడదు..  ఎచటికో పైనమెరుగక ఎందుకో వైనమందక నా అడుగు పడదు..

నాకు నచ్చిన చిత్రాలు...

Image
నాకు  నచ్చిన  చిత్రాలు...