భర్థృహరి శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి అద్భుతమైన అనువాదం:

భర్థృహరి శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి అద్భుతమైన అనువాదం:


వనజభవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్

వనజవనీ విహార కలనంబుఁ దొలంగగఁ జేయుఁగాని, గుం

భవమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ

జనిత మహా యశో విభవ సారము హంసకు మాన్పఁ జాలునే? 


ప్రతిభ ఉన్నవాడిని ఎవరూ, బ్రహ్మ అయినా కూడా, అణచివేయ లేరని భావం. బ్రహ్మకు తన వాహనమైన హంస మీద కోపం వచ్చి, తన కలువల సరస్సులో విహరించే వీలు లేకుండా చేయగలడేమో గాని, పాలనీ, నీటినీ వేరుచేయగల గోప్యమైన నైపుణ్యం ద్వారా వచ్చిన పేరు ప్రఖ్యాతులను లేకుండా చేయగలడా?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!