కాళింది లో గోవిందం -

కాళింది లో గోవిందం -( రచన... ఓలేటి శ్రీనివాసభాను...)

ఆడింది ఆడింది పాదం

కాళింది లో గోవిందం

మున్నీట సర్పం - మూడింది దర్పం ...

మిన్నూ-  మన్నూ ఏకం...

ఊగింది లోకం!   ఆడింది .... ఆడింది పాదం ...


గాలీ-నీరూ కాలకూటంగా

వ్రేపల్లె కే సంకటంగా

ఘోరంగా- ప్రాణం పోవంగా

"రంగా.. రంగా" యన్న ఆలకించంగా!  ఆడింది... ఆడింది పాదం...


పడగెత్తి నాగన్న లేవంగా

బుసకొట్టి కోరలు తెరువంగా

వాటంగా- వాలం సాయంగా

నిలువెల్ల మదమంత - నీటను కలువంగ!  ఆడింది ... ఆడింది పాదం


నేత్రం- జలజాతపత్రం

గాత్రం-ఎంతో పవిత్రం

శిఖిపింఛ మౌళి - శ్రీ  బాల శౌరి

చిందులేసిన తీరు చిత్రాతి చిత్రం!  ఆడింది .. ఆడింది పాదం..


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!