"కార్యేషు దాసీ కరణేషు మంత్రీ..

Padma Sree Vamgara.....
"కార్యేషు దాసీ కరణేషు మంత్రీ...భోజ్యేషు మాతా శయనేషు రంభా..అపురూపమైనదమ్మ ఆడజన్మ.... ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా..." అని ఓ పక్కన రాస్తూనే ఉంటారు...ఇంకో పక్కన ఇల్లాళ్ళు అగచాట్లు పడుతూనే ఉంటారు. ఏమైనా ఎదురు ప్రశ్నిస్తే.... "నీ సాధింపు తట్టుకోలేకపోతున్నా" అంటూ తాగి వస్తారు.

"తాగేప్పుడు మీకు ఇల్లాలు జ్ఞాపకం ఉండదా" ??? అంటూ ప్రశ్నిస్తుందా అమాయక ఇల్లాలు..

"నిజం చెప్పమంటావా ? తాగినప్పుడు నేను ప్రతి బాధనూ మరిచిపోతాను" అంటాడు భర్త.

పెళ్ళికి ముందు "నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం" అన్న వ్యక్తి పెళ్ళైన తరువాత ఇలా ఎలా మాట్లాడేస్తాడు ? అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇదేదో బలవంతపు పెళ్ళో లేక పెద్దలు కుదిర్చి చేసిన సాంప్రదాయాల పెళ్ళిళ్ళ విషయంలోనోనే కాదు జరుగుతున్నది...

"నీకు నేనూ, నాకు నువ్వూ...ఒకరికొకరం నువ్వూ నేనూ..." అనుకొంటూ పెద్దలను, సమాజాన్ని సైతం ఎదిరించి పెళ్ళి చేసుకొన్న ప్రేమైక జీవుల వ్యధ కూడా.... "ఎందుకిలా ?" అని అడగడం కూడా అనవసరమే... దానికి సమాధానం ప్రతి ఒక్కరికీ తెలుసు... కాకపోతే ఎవరి చేదు వారిది..... ఎవరి అనుభవాలు వారివి....

అందుకే కామోసు ఎవరో కవి అన్నాడు...

"అందబోయి చేజారిపోయిన అందాలెన్నో ఈ లోకాన
చేతికందీ చేదైపోయిన బంధాలెన్నీ జీవితాన"

అంటూ...

తన అనుభవాల సారాన్ని , ప్రతి వ్యక్తి జీవితాన్ని రెండు వాక్యాల్లో విదిలించి పారేసాడు. అందనంత కాలం మధురంగా ఉండి... అందిన తరవాత చేదైపోవడమేంటో....

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!