దేవులపల్లి కృష్ణశాస్త్రి ....

సార్వజనీనమైన మనిషి ఆలోచనల్లో పుట్టిన సాహిత్యం... వెయ్యికాలాలు వర్థిల్లుతుందట. సరిగ్గా అలాంటివే దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం. విరహవేదనను ఎంత హృద్యంగా వర్ణించారో చూడండి ఆయన. క్షణాలు రాళ్ళుగా మారి కదలడం లేదట. మనసులో రూపం మాత్రం అలానే ఉందట. పోనీ వెళ్దామా అంటే... కుదరడం లేదట. అసలు వేదన ఎంత మధురంగా ఉంటుందా అని... చదివిన వారికి తొలి సారి అనిపిస్తుంది....




ఏ సీమల ఏమైతివో ఏకాకిని నా ప్రియా.. ఏకాకిని నా ప్రియా..
ఏలాగీ వియోగాన వేగేనో నా ప్రియా..
ఏలాగీ మేఘమాసమేగేనో ప్రియా.. ప్రియా.. ప్రియా..
ఘడియ ఘడియ ఒక శిలయై కదలదు సుమ్మీ..
ఎద లోపల నీ రూపము చెదరదు సుమ్మీ..
పడి రావాలంటే వీలు పడదు సుమ్మీ.. వీలు పడదు సుమ్మీ..

దారులన్నియు మూసె దశ దిశలు ముంచెత్తె..
నీరంధ్ర భయధాంథకార జీమూతాళి.. ప్రేయసీ..
ప్రేయసీ.. వెడలిపోయితివేల ఆ అగమ్య తమస్వినీ గర్భకుహరాల..
తమస్వినీ గర్భకుహరాల..

లోకమంతా పాకినవి పగటి వెలుగులు..
నాకు మాత్రం రాకాసి చీకట్ల మూలుగులు.. రాకాసి చీకట్ల మూలుగులు..

ఎపుడు నీ పిలుపు వినబడదో అపుడు నా అడుగు పడదు.. 
ఎచటికో పైనమెరుగక ఎందుకో వైనమందక నా అడుగు పడదు..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!