అన్నమయ్య 'పద' సేవ

అన్నమయ్య 'పద' సేవ
అయమేవ అయమేవ ఆదిపురుషో
జయకరం తమహం శరణం భజామి

01.అయమేవ ఖలుపురా అవనీధరస్తుసో
ప్యయమేవ వటదళాగ్రాధి శయనః
అయమేవ దశవిధైరవతార రూపైశ్చ
నయమార్గ భువిరక్షణం కరోతి

02.అయమేవ సతతం శ్రియఃపతిర్దేవేషు
అయమేవ దుష్ట దైత్యాంతకస్తు
అయమేవ సకల భూతాంత రేష్వాక్రమ్య
ప్రియభక్త పోషణం ప్రీత్యా తోతి

03.అయమేవ శ్రీ వేంకటాద్రౌ విరాజతే
అయమేవ వరదోపి యాచకానాం
అయమేవ వేదవేదాంతైశ్చ సూచితో
ప్యయమేవ వైకుంఠాధీశ్వరస్తు (4-313)

తాత్పర్యము
ఇతడే ఇతడే (ఈ మహావిష్ణువే) సృష్టిలో మొదటి పురుషుడు. జయాన్ని ఇచ్చే అతనిని నేను శరణు కోరుచున్నాను.

1.ఇతడే పూర్వం భూమిని మోసిన వాడు. ఇతడే మర్రి ఆకు మీద పడుకొన్నవాడు. ఇతడే దశావతారాలు ధరించి , నీతి మార్గములో భూమిని , ప్రజలను రక్షించుచున్నాడు.

2.ఇతడే ఎప్పుడు దేవతలలో లక్ష్మీ పతి. ఇతడే దుష్టులైన రాక్షసులను అంతము చేసినవాడు. ఇతడే అన్ని రకాలైన జీవులలో అంతర్యామిగా ఉండి ప్రేమతో తన ప్రియ భక్తులను పోషించుచున్నాడు.

3. ఇతడే వేంకటాద్రి పర్వతంలో ప్రకాశించుచున్నాడు. ఇతడే యాచకులకు వరములిచ్చు శ్రేష్ఠుడు. ఇతడే వేద వేదాంతములలో సూచింపబడినవాడు. ఇతడే(ఈ మహావిష్ణువే) వైకుంఠానికి అధిపతి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!