ఆనందం '

' ఆనందం '

మూడక్షరాల ఈ పదానికి మనిషిని మూడులోకాలకూ అధిపతిని చేయగల సామర్ధ్యమున్నది. అంత గొప్ప అనుభూతి ఇది.
అనందమనెది అంత గొప్పది కదా! అదెక్కద ఉన్నదని ప్రశ్న. దీన్నికి సరైన సమాధానం దొరకక, దొరికినా ఒకరి అభిప్రాయాన్నిమరొకరు అంగీకరించక సమాజం గజిబిజి పాలౌతున్నది. ఆనందమనేది బయట ఎక్కడనో లేదు. ఏ వస్తువులోనో లేదు. మన మనస్సులోనే ఉన్నది. మన స్థితిని బట్టే ఆనందంగానీ, విషాదంగానీ! తిరుగులేని సత్యమిది.
'నీకు ఏ పదార్దం తింటే ఆనందంగా ఉంటుంది?' అని ఒకాయనను అడిగాం. 'పరమాన్నం తాగితే!' అన్నాడాయన. 'పరమాన్నంలో ఏమున్నది? గారైతే స్వర్గానికి బెత్తెడు దూరమే'! అన్నాడు మరొకాయన. చూశారా? ఒకరికి ఆనందాన్ని కలిగించిన పదార్థం మరొకరికి కలిగించటం లేదు. ఒక ఇంట్లో అన్నగారు తీరని సంస్యతో సతమతమౌతున్నాడు. తమ్ముడు వ్యాపారం లో మంచి లాభం వచ్చి హుషారుగా ఉన్నాడు. ఆ సమయంలో పిల్లవాడు వచ్చి రేడియో పెట్టాడు. పాట వస్తున్నది- మంచి పాటే ఆ పాట మొదటి వాడికి ఎక్కడా లేని కోపాన్ని తెప్పించింది; రెండో వాడికి అనందాన్ని రెట్టింపు చేసింది. తేడా ఎక్కడ ఉన్నది ? రేడియో పాటలో లేదు. మనుషుల మనస్సులలోనే!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!