(పారిజాతాపహరణము - నంది తిమ్మన)


పారిజాతాపహరణము - నంది తిమ్మన....


చక్కనిదాన నంచు, నెలజవ్వని నంచు, జగంబులోనఁ బే
రెక్కినదాన నంచుఁ, బతి యెంతయుఁ నా కనురక్తుడంచుఁ దా
నిక్కుచు విఱ్ఱవీగుచు గణింపదు కాంతల సత్య ; యింతకున్
స్రుక్కకయున్నె నీ మహిమ సూచిన బోటులు విన్నవించినన్.

(పారిజాతాపహరణము - నంది తిమ్మన)

నారదుడు స్వర్గలోకము నుండి తనకు తెచ్చియిచ్చిన పారిజాతపుష్పమును, శ్రీకృష్ణుడు తన సరసనే వున్న పట్టమహిషి రుక్మిణికి సమర్పించినాడు. ఆ దివ్యప్రసూనమును ధరించిన రుక్మిణీదేవి, వింత తేజస్సుతో విరాజిల్లినది. అప్పుడు నారదునిలో కలిగిన మనోభావము ఈ పద్యము.

' అందగత్తె ననియు, నవయవ్వనములో ఉన్నదాన ననియు, లోకప్రసిద్ధురాల ననియు, నాథునికి తనపై మిక్కిలి అనురాగము కలదనియు సత్యభామ చాలా గర్వపడుచుండునట ! ఆమె, పారిజాతపుష్పధారణచే ప్రకాశించునట్టి రుక్మిణీదేవి మహిమను చూచినచోగాని, విన్నచోగాని (చూచిన చెలులవలన విన్నచోగాని) దుఃఖింపకుండా ఉండగలదా ! ' అని కలహప్రియుడైన దేవర్షి అనుకుంటున్నాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!