శూర్పణఖ రావణుని యెదుట సీతాసౌందర్యమును వర్ణించుట.

కన్నులు కలువలో? కాము బాణంబులో?

తెలివిగా నింతికిఁ దెలియరాదు,

పలుకులు కిన్నెర పలుకులో? చిలుకల

పలుకులో? నాతి కేర్పఱుపరాదు,

అమృతాంశుబింబమో? యద్దమో? నెమ్మోము

తెంపుతో సతికి భావింపరాదు,

కుచములు బంగారుకుండలో? చక్రవా

కమ్ములో? చెలి కెఱుగంగరాదు,


కురులు నీలంబులో? తేటిగుంపు లొక్కొ?

పిఱుదు పులినంబొ? మన్మథు పెండ్లియరుగొ?

యనుచుఁ గొందఱు సంశయం బందుచుండ

వెలది యొప్పారు లావణ్య విభ్రమముల !


కలదో! లేదో! యనుచును

బలుమఱు నెన్నడుముఁ జూచి పలుకుదు రితరుల్,

బలిమో! కలిమో! యనుచును

బలుమఱు జఘనంబుఁ జూచి పలుకుదు రితరుల్.


బంగారు నీరు నిలువునఁ

బొంగారుచు నుండ నజుడు వోసిన మాడ్కిన్,

శృంగార మెల్ల నిలువునఁ 

బొంగారుచు నుండుఁ గరగి పోసిన మాడ్కిన్.


(రామాయణము, అరణ్యకాండము - మొల్ల)


శూర్పణఖ రావణుని యెదుట సీతాసౌందర్యమును వర్ణించుట.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!