అదే నీ ధ్యానము. శివధ్యానము. ..

శివధ్యానము

పరమేశ్వరుని ధ్యానము గురించి మహాకవి కాళిదాసు చక్కగా వివరించేడు. శివుడు జ్ఞాన స్వరూపుడు గనుక, ఆయన జ్ఞానాత్మకమైన స్వరూపాన్నే ధ్యానిస్తూ ఉంటాడు. అంటే తననే ధ్యానిస్తూంటాడు. 


ఈ విశ్వంలో ప్రతిదీ సృష్టిగతమైన తన ధర్మాన్ని అనుసరించి చరిస్తుంది. నువ్వు వాటి గురించి ధ్యానించినా, లేకపోయినా వాటి పని అవి నియమానుసారం చేసుకుపోతుంటాయి. వాటికి నీ ధ్యానంతో పనిలేదు. 


మరి ఈ సృష్టిలో నీకూ అస్తిత్వం వుంది. మిగతావాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీ అస్తిత్వానికి అర్థం ఏమిటి? అసలు నువ్వెందుకు ఉన్నట్లు?


కాబట్టి నీవేమిటో తెలుసుకో. నీదైన జ్ఞానాన్ని పొందు. సృష్టిగతమైన నీ ధర్మం పట్ల, నీ జీవనచర్య పట్ల పరిపూర్ణమైన ఎరుకను కలిగివుండు. ఆనందంగా వుండు. శాంత మనస్కుడవై వుండు. 



అదే నీ ధ్యానము. శివధ్యానము. 


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!