ఇక నాకే సొంతం . ... ప్రియా !!
Burra Padmasri Sri
చుక్కలన్నీ కట్టకట్టుకొచ్చాయి
నీ అందాన్ని చూడాలని .
వెన్నెల చుట్టరికమే కలుపుకుంది ,
నీ చుట్టూ తిరగాలని .
చందమామ వరసే కలిపాడు ,
నిను కవ్వించి ,రెచ్చగొట్టాలని .
మల్లెలు మత్తుజల్లుతున్నాయి ,
నీ ఊహల లోకానికి నిన్ను నెట్టేస్తూ .
చల్లగాలి కొంటెగా హత్తుకుంది ,
నీ అనుమతి అడిగే ఆలోచనకూడా లేకుండా .
మబ్బుల పల్లకీలు
నింగి నుండి నేలకు దిగుతున్నాయి ,
ఇంద్రలోకానికి ఆహ్వానం పలుకుతూ .
ఓహో !!!!ప్రకృతే చలించే నీ అందం
ఇక నాకే సొంతం . ... ప్రియా !!
Comments
Post a Comment