గుప్పెడంత ప్రేమ…!
గుప్పెడంత ప్రేమ…! (మెరుపుకల...నా కొత్త కలల లోకం) . అమ్మ ప్రేమ కావాలి అమ్మ ఒడిలో పడుకోవాలని నా బాధలు భయాలు చెప్పుకోవాలని అమ్మ చెయ్యితో నాతలను ప్రేమగా నెమరాలి నా భయాలు అన్నీ మరిచి హాయిగా పడుకోవాలని నాకు అనిపిస్తుంది కానీ ఆ అమ్మ ప్రేమ నాకు దొరకలేదు .. నా అదృష్టం ఏంటో నాకు ఊహరాకముందే నాన్న చనిపోయాడు నాన్న ప్రేమ ఎలావుంటుందో తెలీదు సినిమాలో చూడడం పుస్తకాల్లో చదవడం తప్ప … ఇక తోడబుట్టిన వాళ్ళ గురించి ఐతే ఏంచెప్పిను స్వార్ధానికి రూపం వుండి బట్టలు వేస్తే వాళ్ళు అని చెప్పొచ్చు … బ్రహ్మదేవుడు నాతల రాత రాసేటప్పుడు బాగా ఫస్ర్టేషన్ లో వున్నట్టుంన్నాడు ఆ సరస్వతీ మాతమీద వున్న కోపం మొత్తం నామీద చూపించాడు పాపం ఆయనను నేను నిందించలేను ఎందుకంటే ఫస్ర్టేషన్ నమ్మా … ఫస్ర్టేషన్ … నేను అర్థం చేసుకోగలను మిస్టర్ బ్రహ్మ … అది సంగతి ఇంతకీ మనం ఎక్కడ వున్నాం హు… గుప్పడంత ప్రేమ కోసం నేను తపించిపోతుంన్నా నా తలమీద చేయివేసి నేనుంన్నానంటూ ధైర్యం చెప్పాలి , నా రెండు చెంపలమీద తనరెండు చేతులతో నన్ను దగ్గరగా లాగుకుని ప్రేమగా నా నుదురుపైన ముద్దు పెట్టాలి నేనుంన్నానంటూ , నేను టెంషన్ లో వుండి నిద్