రామసేతువు*!

రామసేతువు*!

హనుమంతుడు లంక నుంచి తిరిగి వస్తూనే చెబుతాడు- 'రామచంద్రా! నువ్వు సేనను ఈయ మహాసముద్రం దాటించడం ఎలాగా అని మాత్రమే. వానరసేన లంకకు చేరిందంటే, ఇక లంకానగరం సర్వనాశనం అయినట్టే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు' అని ఈ విషయం సుగ్రీవుడితోనూ చర్చిస్తాడు.

,

'రామా, నీది సామాన్యమైన శక్తికాదు, నీకు తోడు మేమంతా ఉన్నాం. సేతు బంధనానికి ఏదో ఉపాయం దొరుకుతుంది. దిగులు వదలి, దాని స్ధానంలో శత్రువు మీది క్రోధాన్ని నింపు తప్పక కార్యసిద్ధి జరుగుతుంది. అంటాడు వానరరాజు.

వానరసేన సముద్ర తీరం దాకా చేరిన తరవాత, విభీషణుడు శ్రీరాముడి శరణు కోరతాడు. సేతు బంధనం గురించి రాముడు ఆయనతోనూ చర్చిస్తాడు. 

'సముద్రుడు నీ వంశీకుడే కదా, నయాన ప్రార్ధించి ఆయన సహకారం పొంద' మని సూచిస్తాడు విభీషణుడు. రాముడు దర్భశయం చేస్తూ, మూడు రోజులపాటు శాస్త్రోక్త విధానంలో సముద్రుణ్ని ఉపాసిస్తాడు. సముద్రుడు ప్రత్యక్షం కాకపోవడంతో, రాముడు ఇక బలప్రయోగంతో సముద్రాన్ని ఇంకింపజేయడానికి సిద్ధమవుతాడు. బ్రహ్మస్త్రం సంధించబోతుండగా సముద్రుడు భయపడి దిగి వస్తాడు.

.

'నీ సేనలో విశ్వకర్మ పుత్రుడు నలుడున్నాడు. అతని చేత వారధి కట్టించు. దాన్ని నేను భరిస్తాను' అంటాడు. నలుడు కేవలం అయిదురోజుల్లో మహావృక్షాలు, కొండశిలలు నిర్మాణ సామగ్రిగా, వానరుల బలమూ ఉత్సాహమూ మూలధనంగా, అంతటి సముద్రం మీద అందమైన నూరు యోజనాల వారధి నిర్మిస్తాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!