గోదావరిపై ఎద కృష్ణమ్మ నీ వాల్జడ.! (వేటూరి వారి కలం)

గోదావరిపై ఎద కృష్ణమ్మ నీ వాల్జడ.!

(వేటూరి వారి కలం)

.

గోదావరిపై ఎద కృష్ణమ్మ నీ వాల్జడ

నిండారి తెలుగింటి అందాలే వెలిగించే 

నండూరి వారెంకిలా ఓ...

గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా

ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల 

కిన్నెరసాని పాటలా ఓ...॥

సిగ్గల్లే పండెనులే సాయంత్రము

బుగ్గల్లో పండాలి తాంబూలము॥

ఎన్నెల్లె కోరుకునే ఏకాంతము

నన్నల్లుకోమంది వయ్యారము

కౌగిలిలో మేలుకొనే కానుకవో మేనకవో 

నా స్వప్న లోకాలలో

గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా

గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం

మువ్వమ్మ మురిసేటి మురళీపురం

కవ్వాలే కడవల్లో కదిలే క్షణం

కడలల్లే పొంగింది నా మానసం

పొన్నలలో పొగడలలో తుంటరివో తుమ్మెదవో 

నా బాహు బంధాలలో

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!