పేస్ బుక్ మనో భావాలు. ... .

పేస్ బుక్ మనో భావాలు. ...
.
నా మట్టుకు నేను ఫేస్ బుక్ ని నన్ను నేను వెంటిలేట్ చేసుకోడానికి వాడతాను.
మనుషుల్ని లైక్ లు కామెంటుల కొలమానంగా, మొత్తానికి ఫేస్ బుక్ కొలమానంగా లెక్కేయడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఎవడికి వాడు గొప్పే. ఎవడి గొప్పలు వాడివే. ఎవరో పట్టించుకోవాలని ఎవరూ పట్టించుకోవట్లేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా ??. ఫేస్ బుక్కే ప్రతిభని కొలమానంగా నిర్ణయించే స్థాయికి వెళ్ళిందనుకుంటార??
ఈ మధ్య మనుషుల భావోద్వేగాలను కూడా ఫేస్ బుక్కే కంట్రోల్ చేస్తున్నట్టుంది. ఇంకా నయం ఫేస్ బుక్కే తిండి పెడితే, ఫేస్ బుక్కే అవసరానికి ఆదుకునే మాధ్యమం అయితే మనుషులందరూ ఏమైపోయేవాళ్ళో... !!, ఇన్ని లైకులు వచ్చిన వాళ్ళు ఇంత గొప్ప అని ఫేస్ బుక్ నిర్ణయిస్తే అస్సలు మనం ఒప్పుకోం కదా .. !! నిజంగా మనకి తెలియదా లైకులు ఎందుకోస్తాయి దేనికోస్తాయి అని తెలిసి కూడా ఫీలింగ్స్ బయటపెట్టుకోవడం ఎందుకూ అంటున్న అహ ఎందుకూ అంటున్నా ?? వాడెవడో నీ ప్రతిభ గుర్తిస్తే గాని మనం మనుషుల లెక్కలోకి రామా ?? అహ రామా లేక వాళ్ళు గుర్తించని ప్రతిభ అసలు సిసలైనది అయితే జనాలు గుర్తించకుండా, ఒప్పుకోకుండా అది బయటపడకుండా ఉంటుందా అని అడుగుతుండా ??
ఇది కేవలం ఒక మాధ్యమం అంతే ..
కాని ఒక విషయం మాత్రం గమనించానబ్బా..ఈ ఫేస్ బుక్ చేసే గొప్ప పనుల్లో, ఎదుటి వాళ్ల వైపు ఒక్క వేలెత్తి చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళు నీ వైపుకి కూడా చూపిస్తున్నాయి చూసుకోమంటుంది... !!
ఇంకా మనుషులని లైకులు. కామెంటుల ప్రాతిపదికన లెక్కగట్టె మనస్తత్వాలకు, అంతా నేనే అని ఫీల్ అయ్యే మహానుభావులకు దండాలు ... ఫేస్ బుక్ ఇవ్వాలుంటుంది, రేపు పోతుంది దీన్ని మించిన నెట్వర్క్ సైట్ లు రావచ్చు. అటు ఇటుగా మారకుండా ఉండేది మనిషే. వాణ్ని ఫేస్ బుక్ గోడకి కట్టేసి బావిలో కప్ప అని మాత్రం నిర్నయించేయోద్దప్ప ..!!x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!