తప్పు నాది కాదు .. త్రాగిన సీసా ది !

తప్పు నాది కాదు .. త్రాగిన సీసా ది !


తాగిన సీసాలదే తప్పంతా!

ఏకాంబరానికి అర్ధరాత్రి వేళ మెలకువ వచ్చింది. చుట్టూ చూడగానే రాత్రి జరిగింది గుర్తుకు వచ్చింది. గుర్తుకు రాగానే దుఃఖం పొంగుకు వచ్చింది. మంచం చుట్టూ పడున్న మందు సీసాలు కనబడగానే కోపం తన్నుకు వచ్చింది.

‘ఛీ! ఈ పాడు మందు కారణంగానే కదా పెళ్ళాంతో గొడవ పడింది’ 

ఆ ఆలోచన రాగానే నేల మీద పడున్న ఓ ఖాళీ సీసాను తీసుకుని గట్టిగా గోడకేసి కొట్టాడు. అది భళ్ళున పగిలింది.

‘నాకూ నా భార్యకు మధ్య కొట్లాటకు నువ్వే కారణం, నీకు అదే శాస్తి’ అంటూ రెండో ఖాళీ సీసాను కూడా అదే స్పీడులో పగల గొట్టి, మరో సీసాను చేతిలోకి తీసుకున్నాడు.

చూస్తే అది సీలు తీయని కొత్త మందు బాటిలు.

ఏకాంబరం భద్రంగా దాన్ని పక్కన పెట్టాడు.

‘తాగిన ఆ సీసాలవల్లే ఈ గొడవంతా. ఇందులో నీ తప్పేమీ లేదు’ అనుకున్నాడు జనాంతికంగా.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!