మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకం 2

మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

శ్లోకం 2

. 

మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్దిం మనసి వితృష్ణాం

యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్||

. 

"భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతె !

.

తా. ఓయి మూఢుడా! ధనమునందు ఆశను వదలిపెట్టుము. 

నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా నేది లభించునో దానితో 

నీమనస్సును తృప్తిపరచుకొనుము. మంచి బుద్దిని అలవరచుకొనుము

. 

గొవిందుని భజింపుము గోవిందుని భజింపుము గోవిందుని భజింపుము మూఢమతీ!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!