ఉర్దూ నా మజాకా ..!

ఉర్దూ నా మజాకా ..!

.

ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధులు భోగరాజు పట్టాభి సీతారామయ్యగారు ఒకసారి హైదరాబాదుకు వచారట 

.

వచ్చిదే తడవుగా ఆయనను అరెస్ట్ ఆదేశాలిచ్చింది నిజాం ప్రభుత్వం.వెంటనే ఆయన బస దగ్గరికి పోలీసులు వచ్చారు.కానీ ఆయన ఎలా ఉంటారో వాళ్లకి తెలియదు.దాంతో వాళ్ళు 

అక్కడి వాళ్ళతో 

"పటప్పాబాహీసత్తార్ మియా హై క్యా?"అని అడిగారట.

(పట్టాభి సీతారామయ్య)వాళ్ళలాఎవరిని గురించి అడుగుతున్నారో

గ్రహించిన ఓ పెద్దమనిషి "యహా సత్తార్ మియా కోయీ నహీ హై.ఇన్కా నామ్ తో సీతారామయ్యా హై" అని బదులిచ్చాడట 

చేసేది లేక పోలీసులు తిరిగి వెళ్లిపోయారట.

అప్పట్లోనే మరో సందర్భం లో టంగుటూరి ప్రకాశం పంతులు వరంగల్ దర్శిం చారట.

ఆజంజాహి మిల్లు అతిథి గృహం ఆయన విడిది.అక్కడికి ఒక పోలీస్ అధికారి వచ్చి 

"యహా పీర్ ఖాసీం కౌన్ హై "(ప్రకాశం) అని అడిగారట.అక్కడ వున్నా వాళ్లకు అర్థం కాక 

వాళ్ళ దగ్గర వున్నకాగితం చూసారట.అందులో ఉర్దూ లో టాంగ్ టూటీ పీర్ కాశీం ను అరెష్ట్ చెయ్యమని వుందట.అప్పుడు అక్కడవున్న వద్దిరాజు రాజేశ్వరరావు

"టాంగ్ టూటీ??" యహా తో సబ్ కె టాంగ్ ఠీక్ హై దేఖో (కాలువిరిగిన)అన్నారాట.

ఆ పోలీసు అధికారి అక్కడ వున్న అందరినీ ప్రకాశం గారిని కూడా చూసి అందరి కాళ్ళు కూడా సరిగా వుండడం చూసి మాఫ్ కర్నా అని వెళ్ళిపోయాడట. అసలు టంగుటూరు టాంగ్ టూటీ ఎలా అయింది?ఉర్దూ భాషకు సొంతలిపి లేదు,పర్షియన్ లిపి లో వ్రాస్తారు.దానితో తెలుగు పదాలకు సరిఅయిన అక్షరాలూ లేక యిలా అపార్థాలు ధ్వనిస్తాయి.

మాట తేడా వస్తే కొంపలు మునుగుతాయి అని అంటారు కానీ యిక్కడ ఆ తేడాలే ఆ నాయకులను రక్షించాయి. తన యాత్రా స్మృతిలో దాశరథి కృష్ణమాచార్య పంచుకున్న అనుభవాలివి.

కర్నూల్ లో పినాకపాణి గారు ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు వుండే వారు.ఈ మధ్యనే 100 ఏళ్ళ వయసులో అనుకుంటా చని పోయారు.

ఒక మహమ్మదీయుడు ఆయనకోసం వచ్చి "పీనేకా పానీ కహా హై" అని దారిలో పోయే ఒకతన్ని అడిగాడట.అతను పీనేకాపానీ తో నల్ మే హై అని జవాబిచ్చాడట.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!