తన ఆత్మ (baapu .)గురించి ముళ్ళపూడి.!

తన ఆత్మ (baapu .)గురించి ముళ్ళపూడి.!

శరీరాలు వేరైనా ఆత్మలోకటే బాపురమణ లకి ................

తన ఆత్మ బాపు గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఏమన్నారో చూడండి..........

బాపు అంటే ప

ని. రోజుకి ఇరవై గంటల పని. లొంగని గుర్రాల మీద సవారీకి కసి, పట్టుదల.

బాపు కళాతపస్వి కాదు. అంటే గడ్డాలూ, విగ్గులూ పెంచేసి, గుహల్లో దూరిపోడు. తెల్లారగట్ట నాలుగ్గంటలకి లేచి ఓ రెండు గంటలు బొమ్మలేస్తాడు. తర్వాత సరదాగా ఓ రెండు గంటలసేపు బొమ్మలేసుకోవడం, ఆ తర్వాత ఇంకో గంటన్నర బొమ్మల ప్రాక్టీసు, ఆలసిపోతాడు గదా, అందుకని - ఓ రెండు గంటలసేపు హాయిగా బొమ్మలు గీయడం, అదయ్యాక తనకిష్టమైన కథలకి బొమ్మలు గియ్యడం, ఆ తర్వాత..... ఇదీ వరుస.

ఈలోపున వచ్చేపోయే ఫ్రెండ్స్ తో జోక్స్ చెప్పుకోవడం, వాళ్లకి గ్రీటింగ్స్ కార్డ్స్ వేసి పెట్టడం, వాళ్ళ కథలకి బొమ్మలు వేసి పెట్టడం, కార్టూన్లు వేసి పెట్టడం - వాళ్ళని నుంచోమని, కూర్చోమని, చెయ్యలా పెట్టమని, చెయ్యిలా పెట్టమని, రకరకాల భంగిమలలో రేఖాచిత్రాలు వేసుకోవడం........

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!