మంగమ్మ శపథం... అనుమంగమ్మల కధలు.!

మంగమ్మ శపథం... అనుమంగమ్మల కధలు.!

.

(Veera Narasimha Raju గారికి కృతజ్ఞతలతో)

.

మంగమ్మ కథ అనేది ఒక జానపద కథ.. దీనిని తెలుగు నాట రాకాసి "రామిరెడ్డి కూతురు"

అనే కథ గా చిన్న పిల్లలకు అప్పట్లో అందరికీ చెప్పే వారు.

తరువాత దీనిని జెమినీ వాసన్ "మంగమ్మ శపథం" చిత్రంగా తొలుత తమిళములో 

వైజయంతీ మాల తల్లి వసుంధరా దేవి తో తీసారు.

అది విజయవంతం అయిన దాదాపు పదేళ్ళ తరువాత అదే చిత్ర కథను మంగళ గా హిందీ, తెలుగు (తమిళ్లో మళ్ళీ తీసారేమో నాకు తెలియదు ) భాషల్లో భానుమతి తో తీసారు.

అదీ విజయవంతం అయింది. దాదాపు అదే కథతో అక్కినేని అంజలితో "స్త్రీ సాహసం"

అని వినోదావారు తీసారు.. 

మళ్ళీ 1964 లో జమున ఎన్టీఆర్ తో అదే కథను మంగమ్మ శపథం గా తీసారు 

అదీ విజయవంతం అయింది.

ఈ కథను మా ముత్తమ్మ ఆదిలక్ష్మి గారు రాకాసి రామి రెడ్డి కూతురు కథగా మాకు చెప్పే వారు.. ఆమెకు బహుశా ఈ సినిమాల సంగతి తెలియదు, ఆమె సినిమాలు కూడా చూసి ఎరుగరు. 

కానీ ఈ కథ మా ఇంటిలో అందరికీ మేము పిల్లలుగా ఉండేప్పుడు ఆమె చెప్పే వారు.

(రంజన్ భానుమతి తెలుగు హిందీ మంగళ చిత్రములో )

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!