మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకం 10

మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

శ్లోకం 10

. 

వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః।

క్షీణే విత్తే కః పరివారో జ్ఞాతే తత్వే కః సంసారః।।

. 

"భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతె !

.

తా. 

.

వయస్సు మళ్ళినవానికి కామవికారమెక్కడిది? 

నీరు లేని చోట చెఱువెట్లుండును?

ధనము లోపించినప్పుడు పరివారమెట్లండును? 

తత్వము తెలిసిన తరువాత సంసార బంధమేముండును?

. 

గొవిందుని భజింపుము గోవిందుని భజింపుము గోవిందుని భజింపుము మూఢమతీ!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!