సినిమా పాటల్లో హాస్యం.!

సినిమా పాటల్లో హాస్యం.!

.

హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజు రాఘవయ్య చౌదరి.

అంతే కాకుండా ఆయన హాస్యాన్ని social commentaryకి కూడా బాగా

వాడుకున్నాడు.

ఈయన రాసిన “సరదా సరదా సిగరెట్టు” అనే పాట ఇలాటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది. 

దీన్లో చివరి చరణం నాకు పూర్తిగా గుర్తులేదు గాని దాన్లో

పొగతాగితే “ఊపిరితిత్తుల కేన్సర్‌ కిదియే కారణమన్నారు డాక్టర్లు”

అని ఒక పాత్ర అంటే రెండో పాత్ర వెంటనే,

“కాదన్నారులే పెద్ద యాక్టర్లు” అని అప్పట్లో పెద్దపెద్ద యాక్టర్లు

సిగరెట్ల advertisements ఇవ్వటం, సినిమాల్లో సిగరెట్లు తాగటాన్ని glamorize చెయ్యటం, మీద విసిరిన మంచి చెణుకు.

ఆ తర్వాత మళ్ళీ మొదటి పాత్ర “థియేటర్లలో పొగతాగటమే నిషేధించినారందుకే” అంటే రెండో పాత్ర “కలెక్షన్లు లేవందుకే” అని చాలా సునిశితమైన joke వెయ్యటం

ఈ పాటకి గొప్ప హంగుని తెచ్చిపెట్టింది.

.

అలాగే పేకాట గురించిన పాట “అయయో చేతులొ డబ్బులు పోయెనే,

అయయో జేబులు ఖాళీ ఆయెనే” అనేది కరుణ, హాస్యం కలగలిసి మెరిసిన పాట.

ఆ పాట చివరగా అంతా పోయాక కూడా, “

గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు, మళ్ళీ ఆడి గెల్వవచ్చు,

ఇంకా పెట్టుబడెవడిచ్చు, ఇల్లు కుదువబెట్టవచ్చు,

ఛాన్సు తగిలితే ఈ దెబ్బతొ మన కరువు తీరవచ్చు” అంటూ జూదగాళ్ళ

సైకాలజీని అద్భుతంగా పట్టుకుంటుంది.

అంతటితో ఆక్కుండా, “పోతే?” అనే సందేహం,

దానికి “అనుభవమ్ము వచ్చు” అనే తిరుగులేని సమాధానం

ఈ పాటలో రక్తినీ సూక్తినీ ముక్తాయించటానికి పనికొచ్చినయ్‌.

.

ఇలాటిదే మరో పాట “భలే ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే” అనేది.

దీన్లో అత్తమామల ఆస్తికోసం ఇల్లరికపు అల్లుళ్ళు ఎలాటివైనా భరిస్తారనే

విషయాన్ని కళ్ళక్కట్టినట్టు చూపిస్తూ

“జుట్టు పట్టుకుని బైటకీడ్చినా చూరుపట్టుకుని వేలాడి, దూషణభూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవాడికి భలే ఛాన్సులే”

అనటం కూడా చక్కటి ప్రయోగం.

ఈ కోవలోదే మరో పాట “చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అనేది.

దీన్లో జనానికి, దేశానికి నష్టం కలిగించే పన్లు చేసేవాళ్ళే నిజమైన చవటలని చూపించటం జరిగింది.

ఉదాహరణకి ఒక పాత్ర “బడా బడా టెండర్లను పాడి ప్రాజెక్టులు కట్టించాను, వరద దెబ్బకు కొట్టుకుపోతే మళ్ళీ టెండరు పాడాను

, చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అంటుంది.

మొత్తం మీద ఇలాటి పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచిచూపిస్తూ మరో వంక దురాచారాల్ని, దురలవాట్లని చమత్కారం, అవహేళన మేళవించి ఎత్తిచూపటం జరిగింది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!