చిన్ని కృష్ణుడు.!

చిన్ని కృష్ణుడు.!

.

పలుకు తేనెలొలుకు

కులుకు వయ్యారాల తళుకు 

చిట్టి బుగ్గలకీ వెన్నముద్దలంటి

ముద్దులొలుకు సొగసు!

ఇట నటు చూడ అంతటా వుండు

ఎంత వెదకినా.. అతను..దొరకని పండు 

మెడలో ముత్యాల పేరుల కళలు

కళ్ళలో చిలిపితనాల.. కాంతులు!

చిన్నారి పాదాల మువ్వలు .. రవళించగా., 

చిట్టి పెదవులు.. మురళి మ్రోగించగా., 

సమ్మోహనమయ్యె జగతి

చిన్నికృష్ణుని కాంచుట పూర్వజన్మ సుకృతి !

Comments

  1. సార్ అద్భుతమైన బ్లాగు చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్లాగు చదివాను.మరిన్ని విషయాలు మాకు అందించాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!