భగీరధ ప్రయత్నం!
భగీరధ ప్రయత్నం! - భగీరధుడు ఘోర తపస్సు చేసి దేవలోకంలో ఉన్న గంగను భువికి దించి తన పితరులకు పుణ్యలోక ప్రాప్తి కలిగించాడు. ఇదీ సాదారణంగా అందరికీ తెలిసిన కధ.కానీ భగీరధుడి పూర్వులకు ఏమైనది? వారికి పుణ్యలోకాలు ఎందుకు కలగలేదు? అంటే మాత్రం ఏ కొద్ది మందో తప్పితే చెప్పలేరు. . ఇప్పుడు భగీరధుడు గంగ కోసం తపస్సు చెయ్యాల్సిన అవసరం ఎందుకొచ్చింది? చివరికి ఏమైనది అనేది ఈ ప్రచురణలో వివరిస్తాను సగరుడు ఇక్ష్వాకు వంశంలోని రాజు. శ్రీరాముని పూర్వుడు. అతనికి యవనాశ్వుడనే పుత్రునితో పాటు అరవై వేల మంది పుత్రులు కలరు. ఒకనాడు సగరుడు అశ్వమేధ యాగము చేయుటకు తలచెను.తలచినదే తడవుగా తన కులగురువును సంప్రదించి సుముహుర్తము నిర్ణయించి యాగము ప్రారంభించెను.యజ్ఞ సమాప్తి అయిన పిదప యజ్ఞాశ్వమును వదలి దానికి రక్షకులుగా సగరుని అరవై వేల మంది పుత్రులు వెడలిరి.ఈ యాగమును చూసి ఇంద్రుడు ఇది తన ఇంద్ర పదవి కొరకై జరుగుతున్న యజ్ఞము గా భావించి దానిని భగ్నము చేయుటకై ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించి పాతాళం లో ఉన్న కపిల మహర్షి ఆశ్రమములో దాచెను. అశ్వ రక్షకులైన సగరుని పుత్రులు దాని కొరకై వెదకుచూ అన్ని లోకములలోనూ గాలించి చివరకు పాతళంలోని కపిల