-మహాభారతం-ఒక కొత్త విషయాము -10-.

-మహాభారతం-ఒక కొత్త విషయాము -10-.

-

మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం.

--

మహభారతంలో శిఖండిది ఒక ప్రత్యేకమైన పాత్ర.భీష్ముడి మీద పగతో అంబ శివునికై తపస్సు చేసి తిరిగి శిఖండిగా జన్మిస్తుంది.అయితే శిఖండి ఎవరికి పుత్రిక గా జన్మిస్తుంది?

-

జ)అంబ పాంచాల రాజుకి శిఖండి అనే కూతురిగా జన్మిస్తుంది.

(శిఖండిని చలన చిత్రాలలో నపుంసకుడిగానూ, ఏమీ చేతకాని వాడి లాగానూ చూపిస్తారు. కానీ నిజానికి శిఖండి జన్మతః స్త్రీ. శిఖండి వరపుత్రిక కావటం వల్ల ఆమెను స్త్రీ లా కాక పురుషుడి లాగా నే పెంచుతాడు 

పాంచాల రాజు.యుద్ధ విద్యలూ నేర్పుతాడు.ఐతే ఆమె స్త్రీ అన్న విషయం తెలియని రాజ పురోహితులు ఆమెకు ఒక రాజకుమారి తో వివాహం చెయ్యతానికి నిశ్చయిస్తారు.చేసేది లేక పాంచాల రాజూ ఒప్పుకుంటాడు. అయితే పెళ్ళి కూతురికి ఈ విషయం తెలిసి శిఖండి స్త్రీ అన్న విషయం అందరికీ చెప్పేస్తుంది.తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకొందామని ఒక గుహలో ప్రవేశిస్తుంది శిఖండి. 

అక్కడ ఉన్న ఒక గంధర్వుడు ఆమె కథ విని జాలి పడి తన పురుష రూపాన్ని ఆమెకిచ్చి ఆమె స్త్రీ రుపాన్ని తాను గ్రహిస్తాడు.ఈ విధంగా శిఖండి స్త్రీగా జన్మించి పురుషుడిగా మారుతుంది.(ఆమెకు పురుష రూపాన్ని ప్రసాదించినందుకు గంధర్వ రాజైన కుబేరుడు ఆ గంధర్వుడి పై కోపించి ఆమె మరణించేంత వరకు స్త్రీ రూపం లోనే ఉండమని శపించటం వేరే కథ.)

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!