మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 27.

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

శ్లోకం - 27.

-

గేయం గీతా నామ సహస్రం 

ధ్యేయం శ్రీపతి రూపమజస్రం|

నేయం సజ్జన సంగే చిత్తం

దేయం దీనజనాయ చ విత్తం||

-

శ్లోకం అర్ధం : భగవత్ గీతను, విష్ణు సహస్రనామములను సంకీర్తన చేయుచుండ వలయును, ఎల్లప్పుడూ శ్రీపతి రూపముపై మనసు నిలిపి ద్యానింప వలెను. ఎల్లప్పుడునూ సజ్జనులతో సహవాసము చేయవలెను. బీదలకు ధనము పంచి పెట్టవలెను. 

-

తాత్పర్యము : సర్వశాస్త్రసారము శ్రీమద్ భగవత్ గీతలో కలదు, అలాగే సర్వమంత్రసారము శ్రీ విష్ణు సహస్రనామములో కలదు. 

వీనిని పఠించు వారికి సర్వ మంత్రములు, సర్వ శాస్త్రములు పఠించిన ఫలము దొరుకును. వీటిని పఠించి, వాటిలో అర్ధము తెలుసుకొన్నచో విశ్వజ్ఞానమంతయు వారికి అవగతమైనట్లే. 

కేవలము పఠించుటయే కాదు, ఆ భావము మననము చేసుకొని, త్రికరణ శుద్ధిగా ఆచరించవలెను. మంచివారు, జ్ఞానులు, గురువులతో స్నేహము చేసి, వారి సాంగత్యముతో మనకున్న జ్ఞానము పెంచుకొనవలెను. బీదలు, అనాధల యెడల దయ, కరుణ కలిగి వారికి అన్న, ధన,

విద్యా దానములొసగవలెను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!