తెలుగు సాహిత్యంలో-పదపల్లవాలు !

తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో చూద్దాం.

1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 

-దేవులపల్లి కృష్ణ శాస్త్రి

2. ‘‘కప్పివుంచితే కవిత్వం విప్పి చెబితే విమర్శ’’

డా.సి.నారాయణరెడ్డి

3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 

- కాళోజి

4. ‘‘గత కాలము మేలు వచ్చుకాలముకంటెన్‌’’ 

- నన్నయ

5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 

-సుబ్బారావు పాణిగ్రాహి

6. ‘‘రాజే కింకరుడగు కింకరుడే రాజగు’’ 

-బలిజేపల్లి లక్ష్మీకాంతం

7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 

-బసవరాజు అప్పారావు

8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 

-గుర్రం జాషువా

9. ‘‘అత్తవారిచ్చిన అంటుమామిడితోటనీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 

- కాళ్ళకూరి నారాయణరావు

10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’ 

- దాశరధి

11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 

-నార్ల వెంకటేశ్వర రావు

12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 

- తిరుపతి వెంకట కవులు

13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ 

- గురజాడ

14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 

- గరిమెళ్ళ సత్యనారాయణ

15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’ 

- శ్రీనాథుడు

16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 

- పోతన

17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 

- గద్దర్

18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 

- శ్రీ శ్రీ

19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 

- వెన్నలకంటి

20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 

- కొనకళ్ల వెంకటరత్నం

-

ఇంకా వున్నాయి !

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!