"పాలగుమ్మి వారి 'గాలి వాన' "

"పాలగుమ్మి వారి 'గాలి వాన' "

-

ప్రతి గొప్ప రచన వెనుక ఒక అలజడో,ఆవేదనో,అనుభూతో

ఉంటుంది. వెనుక వుండే కథ ఒక్కోసారిఆసక్తికరంగా ఉంటుంది. పాలగుమ్మి పద్మరాజుగారు భీమవరం కళాశాలలో కెమిస్ట్రీ హెడ్ గా ఉండేవారు. 

ఆ రోజుల్లోమామిడిపూడి వెంకట రంగయ్య,నండూరిరామకృష్ణమాచార్యులు, ధూళిపాల సోమయాజులు, డి. సన్యాసయ్యవంటిఅతిరధమహారధులకు

భీమవరంలో తమ కాలేజీలో ఉద్యోగమిచ్చి మళ్లీ వారెవ్వరూ కాలేజీ

వదిలి వెళ్లిపోకుండా ఉండేందుకు చిన్నచిన్న ఇళ్లస్థలాలు కూడా ఉచితంగా ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నారట అప్పటి కాలేజీ అధికారులు.

-

నండూరి వారి ఇంటిప్రక్కనే పద్మరాజుగారు చిన్న ఇల్లు కట్టుకున్నారు.

డబ్బు అంతగా లేకపోవడం వల్ల పక్కాఇల్లు కట్టుకోలేదు.

నాలుగైదు అడుగులఎత్తువరకూ ఇటుకగోడలూ,ఆపైన తాటాకులపాక. 

ఆ పాకనే గది,హాలు, వంటిల్లుగా విభజించుకుని కాలక్షేపం

చేస్తున్నారు. వారి ఇల్లు అంటే ఒక పెద్దతాటియాకుల పాక అన్న మాట.

ఒకసారి ఒక అర్థరాత్రి భయంకరమైన గాలివాన వచ్చి 

ఇంటి కప్పులు ఎగిరిపోతున్నాయి. 

పెద్దపెద్ద చెట్లు కూలిపోతున్నాయి. ఒకటే గాలీ, వానా. కరెంటు లేదు. 

పై కప్పు ఆకులు ఎగిరిపోతున్నాయి. ఇటుక గోడలు ఊగిపోతు

న్నాయి. ఇక ఇంట్లో వుంటే ప్రమాదం అనిచెప్పి పద్మరాజుగారు భార్యని హెచ్చరించిబయటకు వెళ్లిపోదాం అన్నారు.

ఇద్దరూబయలుదేరారు. ఆయన ఇలా బయటకు

వచ్చారు,ఆమె ఇంట్లో చిక్కుకుపోయారు.

ఇంతలో ఇటుకగోడలూ, ఇంటిపైకప్పు మొత్తం అంతా 

ఫెళ...ఫెళ...మని కూలిపోయింది. 

ఆ శిధిలాల క్రింద ఆమె చిక్కుకు పోయారు.

పద్మరాజుగారికి ఒక్కసారిగ పిడుగు పడినట్లయింది. తన భార్య... శిధిలాల క్రింద ఆమె ఏమైందో ? అవి తీయడానికి

తన ఒక్కడివల్ల అయ్యేది కాదు. చుట్టూ

కారుచీకటి. ....అంధకారం....భయంకర

మైన తుఫాను.... ఎవ్వరూ కనిపించడం

లేదు. నిస్సహాయంగా ఒక్కడూ నిలబడి

యున్నాడు. భార్య బ్రతికి ఉందా? చనిపోయిందా? భయంకరమైన ఆలోచనల్లో చేష్టలుడిగి, చైతన్యం నశించి

స్థాణువులా నిలబడిపోయాడు.

చేతుల్లోటార్చిలైట్లు పుచ్చుకుని 

హాస్టల్లో ఉన్న విద్యార్థులు, 

ఊళ్లో వున్న తోటి లెక్చరర్లూ

పరుగెత్తుకుని వచ్చారు. వంద రెండు

వందలమంది పోగుపడ్డారేమో ఓ అరగంట లోపులో

ఆ ఇటుకలూ,ఆకులూ

తొలగించి పద్మరాజుగారి భార్య శరీరాన్ని

బయటకు తీసారు. తీసారేకాని ఆమె

బ్రతికి ఉన్నదీ లేనిదీ తెల్లవారితేగాని

తేలలేదు. ఎట్టకేలకు కథ సుఖాంతమైనది.

.

ఈలోగా ఆయన పొందిన ఆవేదన, పడిన ఆందోళనా...గుండెనీ, మనసునీ

కలచివేసిన అనుభవం చాలా భయంకర

మైందీ,బలమైందీ.

అంత బలమైన అనుభూతిలోంచి వచ్చింది కనుకే ఆయన

"గాలివాన " తెలుగు వాస్తవ కథకి 

ప్రపంచ కథానికల పోటీలో ద్వితీయ బహుమతి

వచ్చింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!