బట్టతలపై పద్యము!

-

బట్టతలపై పద్యము!

సీసము.; 

తలనూనె రాసెడు తగులాటముండదు- 

క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు/ 

చుండ్రు బాధలు తప్పి సుఖము గల్గు/ 

పెళ్ళాము కోపాన పెనుగులాడెడు వేళ- 

జుట్టింత దొరకదు పట్టుకొనగ/ 

అద్దంబు దువ్వెన లవసరమే లేదు- 

పర వనితలు వెంటబడుట కల్ల/ 

-

తేటగీతి. ;

కడకు కుంకుడు, శీకాయ ఖర్చు మిగులు/ 

తలకు స్నానంబు చేయుట సులభమౌను/ 

ఇన్ని గణనీయ లాభంబు లెంచి చూడ/ 

బట్టతల గల్గు వాడె పో భాగ్యశాలి.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!