-అధ్యాపకుడు మూర్ఛపోయాడు-


-

-అధ్యాపకుడు మూర్ఛపోయాడు-

-

సంస్కృతం తరగతి నడుస్తోంది

అధ్యాపకుడు విభక్తి , వచనములు వివరిస్తున్నాడు .

" రామ " శబ్దము ఉదాహరణగా తీసుకుందాం ... 

రామః .....రామౌ.... రామాః 

అంటే తెలుసుగదా , 

రాముడు .... (ఇద్దరు ) రాములు ......(అనేక) రాములు

సంస్కృతములో ఏక వచనము , బహువచనమే కాక , ద్వి వచనము కూడా ఉంటుంది.

దీన్నే ఇంకోలా ,

అహం రామః అస్మి -- నేను రాముడిని [ అయి ఉన్నాను ]

ఆవాం రామౌ స్వః --మేమిద్దరము రాములము [అయి ఉన్నాము]

వయం రామాః స్మః --మేము రాములము [అయి ఉన్నాము ]

అని చెప్పవచ్చు... అర్థం అయిందా..

అందరూ తలలాడించారు..

అధ్యాపకుడు :- ఏదీ , సుబ్బారావు , ఇంకో ఉదాహరణ చెప్పూ..

సుబ్బారావు :-

అహం బ్రహ్మః అస్మి [ అహం బ్రహ్మాస్మి ]

ఆవాం బ్రహ్మౌ స్వః 

వయం బ్రహ్మాః స్మః

అధ్యాపకుడు మూర్ఛపోయాడు. 

(అహం గురు అస్మి [ అహం గురు ]

ఆవాం గురు స్వః 

వయం గురు స్మః

అధ్యాపకుడు మూర్ఛపోయాడు)

---------------

ఈ జోకు అర్థం కాని వాళ్ళు చేతులెత్తండి

.

అయితే గురు శబ్దము , రామ శబ్దము ఒకేలా ఉండవు.. గురు శబ్దము ఉకారాంతము. రామ శబ్దము అకారాంతము. గురు శబ్దము వాడినపుడు , 

అహం గురు అస్మి 

ఆవాం గురూ స్వః

వయం గురవః స్మః 

అని వస్తుంది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!