మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 23. -

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

శ్లోకం - 23.

-

కస్త్వం కోఅహం కుత ఆయాతః 

కా మే జననీ కో మే తాతః|

ఇతి పరిభావయ సర్వమసారం

విశ్వం త్యక్త్వా స్వప్న విచారం||

-

శ్లోకం అర్ధం : నీవు ఎవరు ?నేను ఎవరు ?మనం ఎక్కడనుంచి వచ్చాం ,?

నీ తల్లి ఎవరు? తండ్రి ఎవరు ?,ఈ వివరాలు తెలిసిఇది ఒక

కల అని తెలుసు కో .సంసారా బంధాలు గూర్చి ఆలోచన మా ని ,

గోవిందుని భజయింపుము

-

తాత్పర్యము : ప్రతి ఒక్కరు తమ తమ మనసులలో ఈ విధముగా ప్రశ్నించు కోవలెను. 

నేను ఎవడను?, ఎక్కడ నుంచి వచ్చినవాడను? ఈ జగములో నేను ఏమి చేయుచున్నాను? నాకు తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, బంధువులు, శత్రువులు, మిత్రులు, సేవకులు, గురువులు ఈ విధమైన పలు సంబంధములతో నాతో ఉన్న వీరందరూ ఎవరు? వారితో నా ఆత్మకు సంబంధమేమి? ఆ బంధము ఎంత పురాతనమైనది? ఎంత కాలము నుంచి కలదు? ఇంకెంత కాలము ఉండును? ఈ తనువు తదనంతరము ఇంకను అట్టి బంధము ఉండునా? లేకున్న వారేమగుదురు? నేనేమగుదును? ఈ దేహము ఎచ్చట నుండి వచ్చినది? తిరిగి ఎచ్చటకు పోవును? నాయొక్క నిజస్వరూపమేది? ఈ విధముగా సంసారమును గూర్చి విచారించవలెను. 

అప్పుడు మన ప్రశ్నలకు మనకే సమాధానము దొరుకును. ఆ సమాధానములతో ఆత్మతత్వము అవగతమగును. 

సంసారము ఒక కల వలె తోచును. మన బంధములన్ని ఒక మిధ్య అని జీవన్నాటకములో మనము ధరించిన పాత్రలని అర్ధమగును. 

దాని వలన మనసులో అలిమిన మోహము నశించి, మమకారము, వ్యామోహము, వస్తు ప్రపంచముపై ఆశా పాశములు నశించి ప్రశాంత చిత్తము కలుగును. దాని మూలముగా బంధ విముక్తులమై పరమానందము బడయగలము.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!