పరోపకారః పుణ్యాయ- పాపాయ పరపీడనమ్"!

పరోపకారః పుణ్యాయ- పాపాయ పరపీడనమ్"!

-

ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ పండితుడున్నాడు. పనిమీద పట్నం వెళ్లి

తిరిగి వస్తుండగా పెద్ద వాన పడింది. గొడుగు లేదు.

గబగబ ఒక ఇంటి అరుగుమీదకు చేరుకున్నాడు.

-

అది ఒక వేశ్య ఇల్లు. వర్షం తగ్గింది. ఆ ఇంటిముందునుంచి ఒక మరణించిన వ్యక్తి యొక్కశవాన్ని అంతిమయాత్రకు

తీసుకువెడుతున్నారు. ఆ వేశ్య తన కుమార్తెను పిలిచి 

ఆ చనిపోయిన వ్యక్తిస్వర్గానికి వెళ్లాడో లేక నరకానికి వెళ్లాడో

తెలుసుకుని రమ్మని పంపింది.

-

బయట వున్న పండితుడు ఆ మాటలు

విని ఆశ్చర్యపోయాడు. మరణించిన

వారు ఎక్కడకు వెళతారో తెలుసుకునే 

విద్య గురించి తనకు తెలియనందుకు చింతించి, ఆ

విషయమేమిటో తెల్సుకునేందుకు మరికొంతసేపు

అక్కడేఉండాలని నిర్ణయించుకున్నాడు.

ఇంతలో బయటకు వెళ్లినామె వచ్చినది.

చనిపోయిన వ్యక్తి నరకానికి వెళ్లాడని

చెప్పింది. కాస్సేపటికి ఇంకొక శవయాత్ర

వచ్చినది. మళ్లీ ఆ అమ్మాయి బయటకు

వెళ్లి వచ్చినది. " అమ్మా! ఈ వ్యక్తి స్వర్గానికి వెళ్లాడు" అన్నది.

-

ఈ మాటలు విని ఆశ్చర్యపోయిన ఆ పండితుడు

ఇంటి తలుపు తట్టాడు. ఒక స్త్రీ తలుపుతీసి "ఎవరు మీరు? " 

అని అడుగగా 

అమ్మా! నీవు నీ కుమార్తెను వెలుపలకి

పంపడం గమనిస్తూ ఉన్నాను. మొదట చనిపోయినవ్యక్తి నరకానికివెళ్లాడని,రెండవవ్యక్తిస్వర్గానికివెళ్లాడని

మీఅమ్మాయిఎలాచెప్పగలుగుతున్నది?

అసలామె ఎక్కడకు వెళ్లి వచ్చినది?

తల్లి కుమార్తెను పిలచినది. ఆ అమ్మాయి

ఇలా అన్నది. 

-

"ముందుగా నేను మొదట మరణించిన

వ్యక్తియొక్క శవయాత్రలో పాల్గొన్నవారి

వద్దనుండి వివరాలు సేకరించాను. 

ఈయన మరణానికి ఇరుగుపొరుగు

చాలా ఆనందిస్తున్నారు. బ్రతికివున్న

పుడు ఇతడు అందరి వస్తువులు దొంగిలిస్తూండేవాడు

అందరినీ తిడుతూవాళ్లతో దెబ్బలాడేవాడు. 

అబద్ధపు సాక్ష్యాలు చెప్పి అందరినీ యిరికించి

కష్టపెట్టేవాడు. వీరి మాటలను బట్టి 

అతడు నరకానికి పోతాడు అని అర్థం చేసుకున్నాను. 

ఇక రెండవవాడి గురించి.

ఆవ్యక్తి చిరునామా తెలుసుకొని ఇరుగు

పొరుగు నుండి అభిప్రాయాలు సేకరించాను. అక్కడ అందరు దుఃఖిస్తున్నారు. అయ్యో రామా! ఎంత

విపరీతం జరిగింది. ఈయన అందరి తలలో నాలుకలా ఉండేవాడు. ఎల్లప్పుడూ సాధువులను,మహాత్ములను 

ఆదరించేవాడు. సత్సంగం చేసేవాడు.

అనారోగ్యంతో వున్నవారిని భౌతికంగానూ, ఆర్థికంగాను ఆదుకొనేవాడు. మానసిక ధైర్యం ఇచ్చేవాడు. అతడు మరణించినందు

వలన మేము దిక్కులేనివాళ్ల

మయ్యాము"అని విలపించసాగారు. 

వారి మాటలు విని అతడు స్వర్గానికే

వెళ్లాడని నిశ్చయించాను." అన్నది.

-

పండితుడు అనుకున్నాడు. "మంచి పనులు చేసేవారికి సద్గతులు, చెడుపనులు చేసేవారికి దుర్గతులుప్రాప్తిస్తాయని పెద్దలు చెప్పారు.

నేనే ఆ విషయం విస్మరించాను," అనుకున్నాడు.

-

"పరోపకారః పుణ్యాయ పాపాయ 

పరపీడనమ్"

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!