:-ప్రవరుని సౌశీల్యాది ప్రశంస--:

:-ప్రవరుని సౌశీల్యాది ప్రశంస--:

(అల్లసాని పెద్దన -మనుచరిత్)

ఉ. 

ఆ పురిఁ బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా

షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ

క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భ కులాభరణం, బనారతా

ధ్యాపన తత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూవిలాసుఁడై. 51


-

తా

ధ్యాపన తత్పరుండు,ప్రవరాఖ్యుఁడలేఖ్య తనూ విలా

సుడై

అఖ్య అంటే పేరు. ప్రవరుడు ఆనే అఖ్య కలవాడు."ఆ

పురిన్.ఉండు" అని చెప్పి ఊరుకోకుండా "ఆ పురిన్

పాయక ఉండున్"అని చెప్పటంలోఒక విశేషం ఉంది

"పాయక" అంటే విడిచిపెట్టకుండా,విడిచిపెట్టి ఎక్కడె

క్కడికో వెళ్ళాలనీ,బహుదేశాలు చూడాలని లోపల

ఎంత కోరికగా ఉన్నా,విడిచిపెట్టి వెళ్ళలేక పోతున్నా

డు. అందుకే ముక్కూ మొగం తెలియని సిద్ధుడెవరో

వచ్చి పాదలేపనం ఇవ్వగానే హిమాలయాలకి ఎగిరి

పోయాడు.

మకరాంక శశాంక మనోజ్ఞ మూర్తి అంటే మన్మ

ధుడిలా,చంద్రుడిలా మనోహరమైన మూర్తి గలవాడు

వాక్కునందు రెండవ ఆదిశేషుడు. వివిధాధ్వర నిర్మల

ధర్మ కర్మ దీక్షా పరతంత్రుడు. పలు తెరగులైన యజ్ఞ

ముల,పుణ్యకర్మముల నియమాలకు అధీనుడగువా

డు. అంబురుహగర్భ కులాభరణంబు,బ్రాహ్మణ కుల

మునకు అలంకారము అగువాడు. ఎల్లప్పుడూ

వేదాధ్యయనం చేయించుట యందు ఆసక్తి కలవా

డు అంటే వేదాధ్యయనం చేయుటయందు ఆసక్తి క

లవాడు.అంటే వేదపఠనం నిత్యం తాను చేయడమే

కాకుండా,శిష్యులకు కూడా నేర్పడంలో మహా శ్రద్ధ కల

వాడు. ధర్మాచరణం‌,కర్మాచరణం తప్పనివాడు.

లేఖ్యము అంటే లిఖింపదగినది. చిత్రించి చూ

పించగలిగిన విలాసం- లేఖ్యవిలాసం అలా లిఖించి,

చిత్రించి చూపించలేనంతటి,వీలుకానంతటి తనూ వి

లాసం కలవాడు - అలేఖ్య తనూ విలాసుడు.

ఇలా ఈ పద్యంలో ప్రతి విశేషణమూ భావికధలో

సార్థకమయ్యేట్టుగా కవి నిబంధించాడు.

వివరణ శ్రీ బాలాంత్రపు వేంకటరమణ గారు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!