శ్రీ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి!!

శ్రీ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి

VINJAMURI VENKATA APPARAO·SATURDAY, 9 DECEMBER 2017

దేవుల పల్లి కృష్ణశాస్త్రిగారి తండ్రి గారు !

-

దేవులపల్లివారి వంశములో అందరూ సంస్కృతాంధ్ర పండితులే వారి వంశచరిత్ర చాలాగొప్పది.

అందులో సోదరకవులు సుబ్బరాయశాస్త్రిగారు,తమ్మనశాస్త్రిగారు(అసలుపేరు వేంకటకృష్ణశాస్త్రిగారు,తండ్రిగారి పేరే ) పిఠాపురం సంస్థానంలో భాసించిన కవిరత్నాలు.అందరూ తమ ఇలవేలుపు శ్రీరామచంద్రుని దయవలనే సంస్కృతాంధ్రకావ్యములు రచించినవారే.

కృష్ణశాస్త్రిగారి కుమారులు కృష్ణశాస్త్రిగారే వీరివంశవృక్షంలో చివర కొమ్మ మన భావకవిగారు కృష్ణశాస్త్రిగారు

.శ్రీ సుబ్బరాయశాస్త్రిగారు ఈ రోజు మీకు గుర్తుకు రావటం చాలా ఆశ్చర్యకరం.

ఎందుకంటే పిబ్రవరి 1, 1895 తేదీ కీ.శే సుబ్బరాయశాస్త్రిగారు అప్పటి మద్రాసులో తెలుగువారి భాషాభేషజాన్ని వాక్సుద్దిని బహిరంగంగా ప్రదర్శించి పండిత పామర ప్రశంసలనందుకొన్నరోజు .

ఈ రోజుకి 118సంవత్సరాలు.అది మద్రాసు ట్ర్రిప్లికేను శ్రీపార్ధసారధి గుడి మద్యాహ్నం గుడితలుపులు మూసియుండుటచే పార్ధస్వామి దర్శనంకాలేదు.అక్కడనున్న పురోహితులు దర్శనవేళలు అయిపోయయన్నారు.

వెంటనే శాస్త్రిగారీక్రింది శ్లోకాన్ని ఆశువుగా చెప్పేరు: శ్లో. స్వామిన్! పార్ధతురం...

శ్రీ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రిగారు.దేవులపల్లిసోదరకవులలో యొకరు.రెండవవారు తమ్మనశాస్త్రులవారు.

1879 వ సంవత్సరం నివంబరు నెల పిఠాపురసంస్శ్చానాధీశుడు శ్రీగంగాధరరామరాయ మహారాజుగారి యాస్థానం కవిపండితులతో కిటకట లాడుతోంది.కారణం శతావధాని,భరతాభ్యుదయ ప్రబంధకర్త విద్వాన్ శ్రీ మాడభూషి వేంకటాచార్యులవారు,శతావధానము చేయుటకు విచ్చేసినారు.

అపూర్వ శతావదాన ప్రక్రియ.అవధాననైపుణ్యము,అసాధారణ ధారణకు రాజావారబ్బురపడి వారిని తగురీతి 

సమ్మానించి యిట్లనిరి:-సభ్యులారా!మనయాస్థానంబున నేతాదృక్షవిచక్షణులెవ్వరేని నివ్వటిల్లుదురే? యని ప్రశ్నించిరి.

అప్పుడు యొక సభ్యుడు లేచి దేవా!దేవర సంస్థానిక విద్వాంసులగు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రులుగారు,వారి కుమారులు యిరువురు కూడా అవధానంబునకు సమర్ధులని విన్నవించిరి. కాని వారికి దేవులప్లలి వారి కవితా శక్తి మాత్రమే తెలియును కాని వారిధారణశక్తిగాని,మేధా శక్తిగాని ఇంతవరకు ప్రకటితము కాలేదు.

వెంటనే రాజావారు చంద్రంపాలెంనుండి దేవులపల్లివారిని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించిరి.ఈ ఇరువది యారేళ్ల యువకులైన సుబ్బరాయశాస్త్రిగారికి ఇది క్రొత్తగానుండుటచే మరునాడు అవధానము చేయుటకంగీకరించిరి. 

మరునాడవదధానమునకు హాజరైన శ్రీమాడభూషివారు శ్రీ శాస్త్త్రిగారి అద్బుత కవితా శక్తి,అసాధారణధారణా శక్తిని గాంచి ముగ్ధులై మహారాజు గారితో నిట్లనిరి.వీరిపద్యములన్నియు ప్రబంధముల వలె భాసించుచున్నవిగాని ఆశువుగా చెప్పినట్లుగనబడుటలేదు.

అందు యొక పద్యం చిత్తగించండి అని ఇది అవధానములలో ఆంధ్రీకరించమని పచ్ఛకులడిగిన ప్రశ్నయని యట్లు పృఛ్చకులడుగరాదని అయినను శాస్త్రిగారు ఆశువుగా ఆంధ్రీకరించిరనియు తెల్పిరి.

ఆపద్యం ఇది:

చ.జముకొడుకీదుపట్టియును జన్నపుటోరెపు ఱేనికందు దూ ర్పుమనియగానివెజ్జులకుబుట్టినవారునుబావగార్లుఱేం డ్లుమఱఁదులౌదురైదుగురిలోఁగడుఁజిన్నతఁడెన్బావగాఁ డుమఱఁదిగాడుపెద్దయతడుందగఁద్రోవదికెంచిచూచినన్.

దీనికి మూలమగు సంస్కతశ్లోకము కాళిదాసు చాటువు: .

శ్లో.ద్రౌపద్యాఃపాండుతనయాఃపతిదేవరభావుకాః న దేవరో ధర్మరాజః స్సహదేవో న భావుకః!!

-


ఉ. వేలపు రాఘవుండు పది వేల పురాణము లన్యు నెన్న నీ 

యేలిక లన్న రావుకులు లేప్పటి వరాల కప్పు డొప్పు భూ

పా లి నిజం ముగా దన కటంచును దేవులపల్లి వంస భూ 

పాళీదలంచు చుండు దానపాలిటి కీయు భయంబే ప్రాపుగాన్.!!

(దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి గారు చెప్పిన పద్యం మహేంద్ర విజయం నుండి. )

మా నాన్న గారు మాకు చదివి వినిపించేవారు.....వారి మేన మామగారి పద్యాలూ .

---

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!