చల్లగాలిలో యమునాతటిపై శ్యామసుందరుని మురళి! (రచన: బాలాంత్రపు రజనీకాంత రావు)

చల్లగాలిలో యమునాతటిపై 

శ్యామసుందరుని మురళి!

(రచన: బాలాంత్రపు రజనీకాంత రావు)

-

చల్లగాలిలో యమునాతటిపై

శ్యామసుందరుని మురళి!

మురళి, శ్యామసుందరుని మురళి

ఉల్లము కొల్లగొనే మధుగీతులు

మెల్లమెల్ల చెవి సోకునవే

చల్లగాలిలో!

తూలి వ్రాలు వటపత్రమ్ములపై

తేలి తేలి పడు అడుగులవే!

పూలతీవ పొదరిల్లు మాటు గా 

పొంచిచూచు శిఖి పింఛమదే 

చల్లగాలిలో!

తరువు తరువు కడ డాగి డాగి 

నన్నరయు కన్నుగవ మురుపులవే

మురిసి మురిసి, నా వెనుక దరిసి

కనుమూయు చివురు కెంగేళులివే

మూయు చివురు కెంగేళులివే 

చల్లగాలిలో యమునాతటిపై

శ్యామసుందరుని మురళి!

మురళి, శ్యామసుందరుని మురళి

అరయు: గమనించు; డాగి: దాగి; కన్నుగవ: కనుదోయి, (రెండు) కళ్ళు; మురుపు: సంతోషాతిశయము; కెంగేలు: కెంపు+కేలు - అరచెయ్యి

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.