జానకి అమ్మకు -జన్మ దిన శుభకాంక్షలు !

జానకి  అమ్మకు     -జన్మ దిన శుభకాంక్షలు !  

-

జానకి 1931 సంవత్సరం డిసెంబరు 12న పశ్చిమ బెంగాల్లో జన్మించింది.. తండ్రి టి. వెంకోజీరావు పేపర్ పరిశ్రమలో నిపుణుడు, తల్లి పేరు శచీదేవి. ఈమె అస్సాం గౌహతిలో మెట్రిక్యులేషన్ వరకు చదివింది. అరిజోనా విశ్వవిద్యాయంలో గౌరవ డాక్టరేట్ పొందింది.

అనేక రంగస్థల నాటకాలలో కూడా నటించింది. 

తన 11 వయేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఈమె మొట్టమొదటి చిత్రం షావుకారు ఈమె ఇంటి పేరైపోయింది. ఈమె 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మళయాళం సినిమాలోను నటించింది.

 ప్రముఖ తెలుగు కథానాయకి కృష్ణకుమారి ఈమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పనిచేసింది. ఈమె సత్యసాయిబాబా భక్తురాలు.


విజయా ప్రొడక్షన్స్ వారి షావుకారు (1950) ఈమె మొదటి సినిమా. ( 1949లో "రక్షరేఖ" అనే సినిమాలో "చంద్రిక"గా నటించిందని ఉంది . తరువాత ఆమె "షావుకారు జానకి"గా ప్రసిద్ధురాలయ్యింది. అప్పటి అందరు ప్రముఖ నాయకుల సరసన నటించింది. అనేక పురస్కారాలు పొందింది. తెలుగులో ఈమె సినిమాలలో ప్రసిద్ధమైనవి కొన్ని - షావుకారు, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, రోజులు మారాయి.


నటించిన కొన్ని తెలుగు సినిమాలు[మార్చు]

హే రామ్ (2000) (షావుకారు జానకిగా) .

శబ్దవేది (2000)

దేవి (1999)

శుభాకాంక్షలు (1998)

మేడమ్ (1993)

గీతాంజలి (1989)

స్వరకల్పన (1989)

మురళీ కృష్ణుడు (1988)

సంసారం ఒక చదరంగం (1987)

గోపాలరావు గారి అమ్మాయి (1980)

తాయారమ్మ బంగారయ్య (1979)

రంగూన్ రౌడీ (1979)

సమాజానికి సవాల్ (1979)

రామరాజ్యంలో రక్తపాతం (1976)

అక్కా చెల్లెలు (1970)

భామావిజయం (1967)

మంచి కుటుంబం (1965)

డాక్టర్ చక్రవర్తి (1964)

సవతి కొడుకు (1963)

పెంపుడు కూతురు (1963)

పెంచిన ప్రేమ (1963)

మంచి మనసులు (1962)

బాటసారి (1961)

శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960) .... (ఎరుకల సానిగా)

రేచుక్క పగటిచుక్క (1959)

ముందడుగు (1958)

ఆలుమగలు (1957)

భాగ్యరేఖ (1957)

భలేబావ (1957)

పాండురంగ మహాత్మ్యం (1957)

చరణదాసి (1956)

ఏది నిజం (1956)

జయం మనదే (1956)

నాగుల చవితి (1956)

కన్యాశుల్కం (1955) .... (బుచ్చమ్మ)

రోజులు మారాయి (1955)

వద్దంటే డబ్బు (1954)

కన్యాదానం (1954)

పిచ్చి పుల్లయ్య (1953) ....వసంత

షావుకారు (1950)

రక్షరేఖ (1949) .... చంద్రిక

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!