Posts

Showing posts from December, 2017

భగీరధ ప్రయత్నం!

Image
భగీరధ ప్రయత్నం! - భగీరధుడు ఘోర తపస్సు చేసి దేవలోకంలో ఉన్న గంగను భువికి దించి తన పితరులకు పుణ్యలోక ప్రాప్తి కలిగించాడు.  ఇదీ సాదారణంగా అందరికీ తెలిసిన కధ.కానీ భగీరధుడి పూర్వులకు ఏమైనది? వారికి పుణ్యలోకాలు ఎందుకు కలగలేదు? అంటే మాత్రం ఏ కొద్ది మందో తప్పితే చెప్పలేరు. . ఇప్పుడు భగీరధుడు గంగ కోసం తపస్సు చెయ్యాల్సిన అవసరం ఎందుకొచ్చింది? చివరికి ఏమైనది అనేది ఈ ప్రచురణలో వివరిస్తాను సగరుడు ఇక్ష్వాకు వంశంలోని రాజు. శ్రీరాముని పూర్వుడు. అతనికి యవనాశ్వుడనే పుత్రునితో పాటు అరవై వేల మంది పుత్రులు కలరు. ఒకనాడు సగరుడు అశ్వమేధ యాగము చేయుటకు తలచెను.తలచినదే తడవుగా తన కులగురువును సంప్రదించి సుముహుర్తము నిర్ణయించి యాగము ప్రారంభించెను.యజ్ఞ సమాప్తి అయిన పిదప యజ్ఞాశ్వమును వదలి దానికి రక్షకులుగా సగరుని అరవై వేల మంది పుత్రులు వెడలిరి.ఈ యాగమును చూసి ఇంద్రుడు ఇది తన ఇంద్ర పదవి కొరకై జరుగుతున్న యజ్ఞము గా భావించి దానిని భగ్నము చేయుటకై ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించి పాతాళం లో ఉన్న కపిల మహర్షి ఆశ్రమములో దాచెను. అశ్వ రక్షకులైన సగరుని పుత్రులు దాని కొరకై వెదకుచూ అన్ని లోకములలోనూ గాలించి చివరకు పాతళంలోని ...

-మహాభారతం-ఒక కొత్త విషయాము -10-.

Image
-మహాభారతం-ఒక కొత్త విషయాము -10-. - మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం. -- మహభారతంలో శిఖండిది ఒక ప్రత్యేకమైన పాత్ర.భీష్ముడి మీద పగతో అంబ శివునికై తపస్సు చేసి తిరిగి శిఖండిగా జన్మిస్తుంది.అయితే శిఖండి ఎవరికి పుత్రిక గా జన్మిస్తుంది? - జ)అంబ పాంచాల రాజుకి శిఖండి అనే కూతురిగా జన్మిస్తుంది. (శిఖండిని చలన చిత్రాలలో నపుంసకుడిగానూ, ఏమీ చేతకాని వాడి లాగానూ చూపిస్తారు. కానీ నిజానికి శిఖండి జన్మతః స్త్రీ. శిఖండి వరపుత్రిక కావటం వల్ల ఆమెను స్త్రీ లా కాక పురుషుడి లాగా నే పెంచుతాడు  పాంచాల రాజు.యుద్ధ విద్యలూ నేర్పుతాడు.ఐతే ఆమె స్త్రీ అన్న విషయం తెలియని రాజ పురోహితులు ఆమెకు ఒక రాజకుమారి తో వివాహం చెయ్యతానికి నిశ్చయిస్తారు.చేసేది లేక పాంచాల రాజూ ఒప్పుకుంటాడు. అయితే పెళ్ళి కూతురికి ఈ విషయం తెలిసి శిఖండి స్త్రీ అన్న విషయం అందరికీ చెప్పేస్తుంది.తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకొందామని ఒ...

బాలకృష్ణుడు!

Image
బాలకృష్ణుడు!  - "ఘల్లున మ్రోవగ గజ్జెలు ఘల్లున మ్రోవగ గజ్జెలు ఝల్లున పొంగెను ఎడదలు జవరాండ్రలకున్ తెల్లని గోవుల వెంబడి నల్లని గోవిందుడురుక నాట్యపు భంగిన్! - నల్లనివాడైన బాలకృష్ణుడు తన తెల్లని ఆవులను తోలుకొని పోవుటకు సిద్ధమై, వాటివెంట ఉరుకగా, ఆయన పాదములకు ఉన్న గజ్జెలు ఘల్లుమన్నవి.  ఆ రవము వినగానే నందవ్రజములో ఉన్న యవ్వనవతుల హృదయములు ఒక్కసారిగా ఝల్లుమని ఆనందంతో ఉప్పొంగాయి.

భట్టుమూ ర్తి వ్రాసిన "వసుచరిత్రలో ఒక పద్యము.

Image
భట్టుమూ ర్తి వ్రాసిన "వసుచరిత్రలో ఒక పద్యము. - వాసు రాజు వ్యాహ్యాళి కై వచ్చి ఒక చోట విశ్రమించినాడు. అప్పుడు ఎక్కడి నుండియో మధుర గానము వినపడెను. ఎవరో ఒకయువతి మధురముగా పాడుతూ వుంది. అప్పుడు ఆ రాజు తన వెంట వచ్చిన వయస్యుని (మిత్రుడిని)ఎవరిదీ గంధర్వగానము?పోయి చూచిరా అనిపంపించాడు. ఆ మిత్రుడు వెళ్లి చూసి వచ్చి ఆమె సౌందర్యమును యిలా వర్ణించాడు. - "కమనీయాకృతి యోగ్య కీర్తనలం గన్పట్టు నా శ్యామ, యా  సుమబాణాంబక, యా యమూల్య మణి, యా చొక్కంపు పూబంతి యా  సుమనోవల్లరి,ఆ సుధా సరసి యా సొంపొందు డాల్దీవి యా  కొమరు బ్రాయంపు రంభ, ఆ చిగురుటాకుంబోడి నీకేతగున్ ! - అర్థము:--ఆమె కమనీయ రమణీయ అవయవ సౌందర్య యౌవ్వనము,ఆమె మన్మధ బాణముల వంటి కన్నులు గలది.(అరవింద,మశోకంచ,చూతంచ,నవమల్లికా, నీలోత్పలంచ పంచైతేపంచ బాణస్యసాయికా ఈ  ఐదూ మన్మధుని బాణాలు)పద్మరాగ మణి వంటి పెదవులు కలది.పూదీగేల వంటి చేతులు గలది,అమృత సరస్సు వంటి నాభి గలది,చొక్కమైన పూబంతుల వంటి కుచములు గలది,చిగురుటాకుల వంటి పాదములు గలది,అంతేకాక సన్నని దేహము గల్గి మన్మథ బాణము,అమూల్యమైన మణి పూబంతి  వంటి యింతి ;పూలతీగ...

-నాయుడు పేట రాజమ్మ-శివ దీక్షా పరురాలనురా !

Image
-నాయుడు పేట రాజమ్మ-శివ దీక్షా పరురాలనురా ! (బాపు గారి చిత్రం.) - నాయుడు పేట రాజమ్మ, పెండ్యాల సత్యభామ.తన జీవితాన్ని శ్రీ కాళహస్తీశ్వరునికి - చేసిన పుణ్యవతి ఆ దేవ నర్తకి.@ “శివ దీక్షా పరురాలనురా......” అనే పాటను, రాజమ్మ అభినయించింది. ఒక కోనసీమ పండితుడు ఆమె విద్వత్తును ఆమూలాగ్రమూ శోధించ నిర్ణయించుకున్నాడు. ‘ప్రతి హస్తము-’నకూ ఆమెను ఆపే వాడు;  “ఈ హస్తమునకు, ముద్రకూ శాస్త్ర ప్రమాణాలను వివరించు!”  అని ప్రశ్నలతో నిలదీసేవాడు.రాజమ్మ ఆతని సందేహాలకు దీటైన జవాబుగా నిలబడగలిగినది. శాస్త్రాల నుంచి శ్లోకములను చదివి, అభినయం చేస్తూ వెంత వెంటనే చూపించినది.“రాజామణీ! నీ విద్య నా హృదయాన్ని కదిలించి, కరిగించినది, ఇవాళ నృత్య కళలో లీనమై, మైమర్చిపోయాను ” తన్మయుడైన ఆ పండితుడు రాజమ్మకు – తన శాలువాను కప్పి, వినయపూర్వకంగా మనసారా గౌరవించాడు.@ శ్రీ కాళహస్తి రాజమ్మ సకల కళా విశారద. ఆమె నిండు పౌర్ణిమ నాటి సంగీత సాగరము, నీటి చెలమ నుండి ఊరే నీటి ఊట వంటిది ఆమె విద్య.స్త్రీ రూప తాండవ నృత్య మహేశుడు ఆమె.ఆమె విద్యలను దీటుగా నేర్చుకోగల విద్యార్ధి అసంభవమే!ఆంధ్ర కళామ తల్లి పూర్వ పుణ్య భాగ్య వశాత్తూ, నటరాజ ...

-మహాభారతం-ఒక కొత్త విషయాము -9-.

Image
-మహాభారతం-ఒక కొత్త విషయాము -9-. - మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం. - కురుక్షేత్ర యుద్ధ సమయంలో ధ్రుతరాష్ట్రుడికి దివ్య దృష్టి ఇస్తానంటాడు కృష్ణుడు.కానీ తన కుమారులు ఒకరినొకరు చంపుకోవటం తాను కళ్ళారా చూడలేనని తిరస్కరిస్తాడు ధ్రుతరాష్ట్రుడు.  కానీ కృష్ణుడు వేరే అతనికి దివ్య దృష్టి ప్రసాదించి ధ్రుతరాష్త్రుడికి యుద్ధ విశేషాలు వివరించమంటాడు. కృష్ణుడు ఎవరికి దివ్య దృష్టి ప్రసాదిస్తాడు? జ)కృష్ణుడి ద్వారా దివ్య దృష్టి పొందేది సంజయుడు .(ఇతను అర్జునుడికి ప్రాణ స్నేహితుడు.) -

తెలుగులో మొదటి నీతి పుస్తకంసుమతి శతకం! (రచన: వెల్చేరు నారాయణరావు.)

Image
తెలుగులో మొదటి నీతి పుస్తకంసుమతి శతకం! (రచన: వెల్చేరు నారాయణరావు.) . 1966లో ప్రచురించిన సుమతి శతకానికి పీఠిక రాస్తూ నిడదవోలు వెంకటరావు సుమతి శతకం మొట్ట మొదటి సారిగా ఆదిసరస్వతి ముద్రణాలయం వారు  1868 ఏప్రిల్ 20వ తారీకున ప్రచురించారు అని రాశాడు. తెలుగులో ఏ పుస్తకానికైనా ఇంత నిక్కచ్చిగా అది ప్రచురించబడిన సంవత్సరం, నెల, తేదీతో సహా తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం.  దాదాపు 100 సంవత్సరాల క్రితం ప్రచురించబడిన ఇంత విలువైన సమాచారం వెంకటరావుకి ఎలా దొరికిందో ఆయన వివరించలేదు.  కానీ ఈ సమాచారాన్ని ఇంకొక ఆలోచన లేకుండా మచ్చా హరిదాసు  (తథ్యము సుమతి: పరిశోధన వ్యాసాలు, 1984, పే. 67),  ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం, 2002, సంపుటం 1, పే 224) తిరిగి చెప్పారు. కాని 1868 సంవత్సరపు ప్రచురణ నాకు ప్రపంచంలో ఏ గ్రంథాలయంలోనూ దొరకలేదు. ఇలాటి ముద్రణ తాము చూసినట్లు ఏ పరిశోధకుడు నాతో చెప్పలేదు.  అందుచేత 1870 సంవత్సరపు ప్రచురణనే సుమతి శతకానికి మొదటి ముద్రణగా నేను భావిస్తున్నాను. . 1930లో ప్రచురింపబడి Director of Public Instruction వారిచే మూడవ తరగతి పాఠ్య పుస్తకముగ...

పుచ్చు పప్పులు -

Image
- -పుచ్చు పప్పులు - - జ్యోతి' పత్రికలో అచ్చుతప్పులపై ఆరుద్ర "ఆరుద్ర బాతాఖూనీ" పేరిట ఓ శీర్షిక నిర్వహించేవారు. అందులో కొన్ని అచ్చు తుప్పులు చెత్తగించండి! ) . 'చల్ మోహన రంగా ! నీకు నాకు జోడు కరచెను గదరా! . చచ్చు బుడ్డి బాగా వెలగదు.! . డాక్టర్లు రోగుల పర్సు చూసి వైద్యం చేస్తారు! . అక్షరాలు మారటం వల్ల అర్ధం ఎలా మారుతుందో ఆరుద్ర చమత్కారంగా చెప్పారు! . .........  కార్టూను .. ఆర్భక్ .! పెళ్లి కొడుకు అసలే సన్నం ... దండ నిలవలెదు. -

కొన్ని నిజాలు.!

Image
- కొన్ని నిజాలు.! .  ఏమతం ? 1440 సంవత్సరములకు పూర్వము ఇస్లాం లేకుండెను. 2018 సంవత్సరములకు పూర్వము క్రైస్తవ మతములేకుండెను. 2500.సంవత్సరములకు పూర్వము బౌధ మతములేకుండెను. అలెగ్జాండరు భారతదేశం పై దండయాత్ర చేసిన తదుపరి, సింధూనది పరివాహక ప్రదేశమును "హిందూ " దేశముగా పిలవ బడెను ఇందు నివసించివారు హిందూవులుగా పిలువబడిరి. 5115 సంవత్సరములకు పూర్వము, ఈ భూభాగము, జంబూద్వీపములో భరతవర్షములో భరత ఖండముగా మేరుపర్వతమునకు (హిమాలయ) దక్షిణ దిగ్భాగమందున్నదని భారతీయులచే కీర్తింపబడుచుండెను. ఆ సమయమందు, ఈ భూభాగమందు వేదోక్త సనాతన సాంప్రదాయ జీవన విధానముండెను. 2085 సంవత్సరములకు పూర్వము, ఈ వేదోక్త సనాతన సాంప్రదాయమునుండి వివిధ శాఖలుత్పన్నమై, స్వతంత్ర మతములుగా ప్రభవిల్లెను. అవి.... బౌధ్ధ, జైన, చార్వాక, గాణపత్య శాక్తేయ, పాశుపత, వీరశైవ ఇత్యాది స్వతంత్రమతములు, వాటినిర్మాతలు, సాహిత్యము, బలమైన సాంప్రదాయములు, జీవనవిధానము, పరస్పరవిబేధములు, నిందలు, దూషణలు, ఆధిపత్య పోరులు కొనసాగుచుండెను. మరలా 1194 సంవత్సరములకు పూర్వము, ఆదిశంకరాచార్యులవలన. ఈ విరోధాభాసములు నిర్జింపబడి, కేవలము, వేదోక్త స...

మన కాయగూరల సంస్కృతం పేర్లు!

Image
మన కాయగూరల సంస్కృతం పేర్లు! - -అవాక్పుష్పీ (బెండకాయ) -జంబీరమ్ (నిమ్మకాయ) -ఆలుకమ్ (బంగాళదుంప) -ఉర్వారుక (దోసకాయ) -కారవేల్ల (కాకరకాయ) -కోశాతకీ (బీరకాయ) -బృహతీ (ముళ్ళవంకాయ) -మరిచకా (మిరపకాయలు) -రాజకోశతకీ (కాప్సికం) -లశున (వెల్లుల్లి) -వార్తాక (వంకాయ) -బింబమ్ (దొండకాయ) -శీతలా (సొరకాయ) -క్షుద్రశింబి ( గోరుచిక్కుడు) -పలాండు (ఉల్లిగడ్డ) -కూష్మాండ (గుమ్మడికాయ) -తౄణబిందుక (చేమదుంపలు) -మూలకమ్ (ముల్లంగి) -రంభాశలాటు (పచ్చి అరటికాయ) -సూరణ (కంద) . #నోట్:: వీటిని గుర్తుపెట్టుకోవాలంటే  వీటిని తిట్లుగా వాడాలి అలా అయితేనే  ఈజీగా గుర్తుపెట్టుకోగలం 😂😂😂

-ఊర్వారుక (దోసకాయ) -

Image
-ఊర్వారుక (దోసకాయ) - - ఊర్వారుక (దోసకాయ) " అనే పదము మృత్యుంజయ స్తోత్రంలో వస్తుంది. "త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం, ఊర్వారు కమివ భందనాత్....." అంటే దోస కాయ పండు అయి ఎలా సహజంగా రాలి పోతుందో (అనాయాస మరణం) అలాంటి మృత్యువును ప్రసాదించు స్వామి  అని ఈ శ్లోకము లో వుంటుంది. 

మహిళలు కొత్త మహిళా విధానం -

Image
మహిళలు కొత్త మహిళా విధానం - - మహిళను సెక్స్ సింబల్స్ గా వస్తు విక్రయానికి బ్రాండ్ ఎమ్బాసిడర్లుగా మార్చి చూపింటచటమూ పతనానికి కారణమే ,కారు నుండి బారు సబ్బు వరకు స్త్రీ లనే ఆడ్స్ కు వాడి వారిని అవమానిస్తున్నారు . వారిది తెలుసుకోకుండా అందులో ధన సంపాదనే చూసుకొని మోస పోతున్నారు .ఇతర పాశ్చాత్య దేశాల కంటే డ్రెస్ కోడ్ విషయం లో ఇండియా కు ప్రత్యేకత ఉండేది. ఇప్పుడా సరిహద్దు చెరిపేశారు .చానళ్ళ ప్రకటనలో సెక్సీ గా హక్సీ గా మాట్లాడటం ఎక్కువై .ఇది వరకు ఎప్పుడో కాని విని పించని సెక్స్ పదం ఇవాళ ఒక మంత్రమే అయింది .ఇది దారుణం .ప్రతిదానికీ ‘’సెక్సీ సెక్సీ ‘’అంటూ రోదచేసి దాని పవిత్రతను బజారు పాలు చేస్తున్న్నారు .ఒకప్పుడు బ్రిటన్ లో మహిళా వోటు హక్కు కోసం ఉద్యమం చేసి అరవై ఏళ్ళ పోరాట ఫలితం గా పొందారు. తరువాత సమాన హక్కుల ఉద్యమం చేసి సాధించారు .ఇప్పుడు సంస్కృతిలో సెక్స్ విపరీత ధోరణుల చొరబాటు (హైపర్ సేక్సువలై జేషన్ )పై ఆందోళన చేస్తున్నారు .ఇది అయిస్టతకు ఒక చిహ్నమే . ఇప్పుడు మహిళలు కొత్త మహిళా విధానం _ (న్యూ వేవ్ ఆఫ్ ఫెమినిజం )పై ద్రుష్టి పెట్టారు .దీనివలన స్త్రే పురుషుల మధ్య శక్తి సంబంధాలపై బలమైన ముద...

ఇది రాజ రవి వర్మ చిత్రం.

Image
శుభోదయం ! ఇది రాజ రవి వర్మ చిత్రం. 18వ శతాబ్దంలో కేరళకు చెందిన స్త్రీలు తమ ఎదల పైన ఆచ్ఛాదన లేకుండానే చీరెలు ధరించేవారు. 20 శతాబ్దం ప్రారంభం వరకు ఈ సాంప్రదాయం వుండేది. కేరళకు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు సంస్థానాధీశుడైన రాజారవి వర్మ గీసిన చిత్ర పటాల్లో ఈ సాంప్రదాయం ప్రస్ఫుటమవుతుంది.  కాగా 20 శతాబ్దం ప్రారంభంలో ట్రివాన్‌ కూర్‌ రాజు ఇలాంటి సాంప్రదాయాన్ని తొలగించి నివి (రవిక) ని ధరించడం అనివార్యం చేశాడు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను, మానవీయ విలులను పరిరక్షించడంలో  చిత్రకారుడు రాజారవి వర్మ చేసిన కృషి చిరస్మరణీయము.

నిజం...మనకు సిగ్గులేదు...

Image
నిజం...మనకు సిగ్గులేదు...  .  అమ్మా.. నాన్నలను మరచిపోయెం.. ముమ్మిదాడికాలందాపురించింది... .  నేను చిన్నపుడుచదివిన విజయవాడసత్యనారయణపురం  .  ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం మునిసిపల్ స్కూలు లో కూడా తెలుగు మీడియంనుంచి  .  ఇంగ్లీషు మీడియం మార్చారు అని గొప్పగా నా మనవలు వయసు పిల్లలు  .  చెప్పితే సిగ్గువేసింది.

-మహాభారతం-ఒక కొత్త విషయాము -8-.

Image
- -మహాభారతం-ఒక కొత్త విషయాము -8-. - మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం. .- యుద్ధ ప్రారంభ సమయంలో ధర్మరాజు ఇరుపక్షాల లో ఎవరైనా పక్షం మారాలనుకుంటే మారవచ్చని ప్రకటిస్తాడు. ఆ సమయం లో ఎవరెవరు తమ పక్షాలు మారతారు? జ)ధర్మరాజు చేసిన ప్రకటనతో పక్షం మారేది యుయుత్సుడు. - (ఇతను ధ్రుతరాష్త్రుడికి ఒక దాసి వల్ల జన్మిస్తాడు. పాండవులు మహాప్రస్థానానికి వెళ్ళే సమయం లో బాలుడైన  పరీక్షిత్తు ను రాజుగా అభిషేకించి యుయుత్సుడికే రాజ్యభారం అప్పగిస్తారు.ఇతడు పాండవుల పక్షమున యుద్ధం లో చేరుతాడు.) -

భాగవతంలోని పోతన ప్రసిద్ధ పద్యం! ‘కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి..’

Image
భాగవతంలోని పోతన ప్రసిద్ధ పద్యం! ‘కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి..’  చాలామందికి తెలిసిందే.ఆ తర్వాత కృష్ణుడి స్థితి ఏమైవుంటుందో ఊహించిఓ కార్టూన్ బాపు గారు వేశారు.  హాస్యం కోసం పురాణేతిహాస ఘట్టాలను ఉపయోగించుకున్న ఇలాంటి బాపు కార్టూన్లు చాలా ఉన్నాయనుకోండీ. వీటిలోని చమత్కారం బోధపడక కోపాలు తెచ్చేసుకుని  నొసలు చిట్లించేవారూ, అపార్థం చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టేవారూ ఉంటూనేవుంటారు. కానీ కళాకారుడిగా బాపు కుంచెను స్వేచ్ఛగా ఉపయోగించారనీ, సంకుచిత సరిహద్దులేమీ గీసుకోలేదనీ చెప్పటమే నా ఉద్దేశం. - తన ఫెయిల్యూర్ సినిమాలపై తనే కార్టూన్లు వేసుకున్నహాస్య చతురత ఆయనకుందని చాలామందికి తెలుసు! -

తెలుగు సాహిత్యంలోన పదపల్లవాలు .-(రెండవ భాగం.)

Image
- తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో చూద్దాం.-(రెండవ భాగం.) - 21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’ - అల్లసాని పెద్దన 22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’  - చేమకూరి వేంకటకవి 23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’  - త్యాగయ్య 24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’  - ధూర్జటి 25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు......’’  - బద్దెన 26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’  - వేమన 27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’  - కంచర్ల గోపన్న 28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’  - సుద్దాల హనుమంతు 29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’  - ఆరుద్ర 30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’  - వేముల శ్రీ కృష్ణ 31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’  - త్రిపురనేని రామస్వామి 32. ‘‘మాదీ స...

తెలుగు సాహిత్యంలో-పదపల్లవాలు !

Image
తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో చూద్దాం. 1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’  -దేవులపల్లి కృష్ణ శాస్త్రి 2. ‘‘కప్పివుంచితే కవిత్వం విప్పి చెబితే విమర్శ’’ డా.సి.నారాయణరెడ్డి 3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’  - కాళోజి 4. ‘‘గత కాలము మేలు వచ్చుకాలముకంటెన్‌’’  - నన్నయ 5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’  -సుబ్బారావు పాణిగ్రాహి 6. ‘‘రాజే కింకరుడగు కింకరుడే రాజగు’’  -బలిజేపల్లి లక్ష్మీకాంతం 7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’  -బసవరాజు అప్పారావు 8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’  -గుర్రం జాషువా 9. ‘‘అత్తవారిచ్చిన అంటుమామిడితోటనీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’  - కాళ్ళకూరి నారాయణరావు 10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’  - దాశరధి 11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’  -నార్ల ...

--మహాభారతం-ఒక కొత్త విషయాము -7-.

Image
--మహాభారతం-ఒక కొత్త విషయాము -7-. - మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం. . రణరంగం లో వీరవిహారం చేస్తున్న ద్రోణుడిని అస్త్ర సన్యాసం చేయించటానికి శ్రీకృష్ణుడు 'అశ్వత్థామ' అనే ఏనుగును చంపించి ధర్మరాజు చేత 'అశ్వత్థామ హతః' అని గట్టిగా 'కుంజరః' అని చిన్నగా అనిపిస్తాడు. ఇంతకీ ఆ 'అశ్వత్థామ' ఏనుగును చంపేదెవరు? - జ)'అశ్వత్థామ' ఏనుగును చంపేది భీముడు. (తన కుమారుడైన అశ్వత్థామ చనిపోతే అస్త్ర సన్యాసం చేస్తానని ద్రోణుడు యుద్ధ ప్రారంభంలో ప్రతిజ్ఞ చేస్తాడు.)

తిరుప్పావై .. బాపు బొమ్మ .. దేవులపల్లి కవిత.

Image
తిరుప్పావై .. బాపు బొమ్మ .. దేవులపల్లి కవిత. . రావే గోపవంశాన రాజిల్లే లతకూన! రావే పాముపడగబోలే కటికలదానా! లేవే నీరదశ్యామమోహనుని నామముల నీ వాకిటనే నిలిచి నీవారు పాడరు! మేలి పొదుగుల ఆలువేలు కలవారు, ఆ భీలరణమున అరులబీర మడచేవారు, గో పాలకుల కులమున వెలసే ఓ వనమయూరీ! లేవే! కలములనెలవౌ ఓ నారి! ఒయ్యారి!

ఊర్మిళ!

Image
తమ్ముళ్ళు అందరు లక్ష్మనులే ... ఊర్మిళ లలుఉరు కున్నత వరకే. ఊర్మిళ ఉరిమితే - అలో లక్ష్మణా లే ! -

ప్రమీలార్జునీయము.!

Image
.ప్రమీలార్జునీయము.! మహాభారతంలో ప్రమీల అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి. ఈ రాజ్యంలో స్త్రీలే పరిపాలకులు మరియు యుద్ధ వీరులు.  ఎంతటి బలమైన వారైన వీరితో ఓడిపోయేవారు.  ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగాశ్వం వీరు బంధించారు.  అందులకు అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి వెళతాడు. చివరికి ఆమెను వివాహం చేసుకుంటాడు. -

"పాలగుమ్మి వారి 'గాలి వాన' "

Image
"పాలగుమ్మి వారి 'గాలి వాన' " - ప్రతి గొప్ప రచన వెనుక ఒక అలజడో,ఆవేదనో,అనుభూతో ఉంటుంది. వెనుక వుండే కథ ఒక్కోసారిఆసక్తికరంగా ఉంటుంది. పాలగుమ్మి పద్మరాజుగారు భీమవరం కళాశాలలో కెమిస్ట్రీ హెడ్ గా ఉండేవారు.  ఆ రోజుల్లోమామిడిపూడి వెంకట రంగయ్య,నండూరిరామకృష్ణమాచార్యులు, ధూళిపాల సోమయాజులు, డి. సన్యాసయ్యవంటిఅతిరధమహారధులకు భీమవరంలో తమ కాలేజీలో ఉద్యోగమిచ్చి మళ్లీ వారెవ్వరూ కాలేజీ వదిలి వెళ్లిపోకుండా ఉండేందుకు చిన్నచిన్న ఇళ్లస్థలాలు కూడా ఉచితంగా ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నారట అప్పటి కాలేజీ అధికారులు. - నండూరి వారి ఇంటిప్రక్కనే పద్మరాజుగారు చిన్న ఇల్లు కట్టుకున్నారు. డబ్బు అంతగా లేకపోవడం వల్ల పక్కాఇల్లు కట్టుకోలేదు. నాలుగైదు అడుగులఎత్తువరకూ ఇటుకగోడలూ,ఆపైన తాటాకులపాక.  ఆ పాకనే గది,హాలు, వంటిల్లుగా విభజించుకుని కాలక్షేపం చేస్తున్నారు. వారి ఇల్లు అంటే ఒక పెద్దతాటియాకుల పాక అన్న మాట. ఒకసారి ఒక అర్థరాత్రి భయంకరమైన గాలివాన వచ్చి  ఇంటి కప్పులు ఎగిరిపోతున్నాయి.  పెద్దపెద్ద చెట్లు కూలిపోతున్నాయి. ఒకటే గాలీ, వానా. కరెంటు లేదు.  పై కప్పు ఆకులు ఎగిరిపోతున్నాయ...

విల్లును విరిచావట --తల్లిని గెలిచితి వట !

Image
-- విల్లును విరిచావట --తల్లిని గెలిచితి వట ! కం: విల్లును విరిచావట ఆ తల్లిని గెలిచితి వట అది తధ్యము నిజమే !! చెల్లెను ఆ పనులపుడే వల్లవునా ఇపుడు రామ వనితిను గెల్వన్‌ ? . మంటల దింపితి వామెను అంపితివి గదా అడవికి అప్పటి యుగమున్‌ మంటలు మా పాలి ఇపుడు కంటిలొ నలుసాయెనయ్య కలియుగ కాంతల్‌ - అడవికి నీతో వచ్చెను పడ దోసిన మంటలందు పరుషములనెనా ? గడుసుగ మాటొకటను ఇపు డు డమరములు మోగు నయ్య డస్సును చెవుల్‌ !!

--మహాభారతం-ఒక కొత్త విషయాము -6-.

Image
--మహాభారతం-ఒక కొత్త విషయాము -6-. - మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం. . అజ్ఞాతవాస సమయం లో పాండవుల మారు పేర్లేమిటి? = జ)ధర్మ రాజు: కంకభట్టు.---భీముడు:వలలుడు. అర్జునుడు: బృహన్నల. ---నకులుడు:థామగ్రంధి. సహదేవుడు:తంత్రీపాలుడు.-----ద్రౌపది -సైరంధ్రి. -

'మాతృషోడశి'.!

Image
'మాతృషోడశి'.! 'అమ్మా నేను గర్భంలో వుండగా నిన్ను చాలా బాధపెట్టాను .. ప్రసూతి తర్వాత కూడా నా గురించి, నా తిండితిప్పల గురించి, . ఆరోగ్యం గురించి ఎంతో కష్టపడ్డావు. . ఆ బాధలు కలిగించినదానికి ప్రతిగా యీ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.'

-మిత్ర బేదం-

Image
-మిత్ర బేదం- - తెలుగు లో బాష ప్రవీణ చేసాడుట ఒక కుర్రవాడు.... అతను నన్ను అడిగిన ప్రశ్న..  పరవస్తు చిన్నయ సూరి మిత్ర బేదం లో నావుడు , అనవుడు..ఎవరు వారితో  కధకు సంబధం ఏమిటి నాకు తెలియుట లేదు.. మీరు వివరింప గలరా...  అంటే నేను అవాక్కు అయ్యెను... ఆర్యా, శుభోదయ నమస్కారములు తెలుగు పండితుల వారి ప్రశ్నకు సమాధానము ఇది. నావుడు, అనవుడు కరటక దమనకుల బిడ్డలు.  నావుడు కరటకుని కుమారుడు అనవుడు దమనకుని పుత్రుడు.  వీరిరువురు మారీచ సుబాహువుల ముని మనుమలు కరటకుడి కొడుకు నావుడు నావుడి భార్య కింతు  దమనకుడి కొడుకు అనవుడు అనవుడి భార్య పరంతు  నావుడు కింతు ల సంతానము పశ్చాత్ అనవుడు  పరంతు ల సంతానము భవతి భవంతు ఇంకా ఇంకా చాలా వుంది లెండి.  అనామకుడు .

-మహాభారతం-ఒక కొత్త విషయాము -5-.

Image
-మహాభారతం-ఒక కొత్త విషయాము -5-. - మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం. .- జనమేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని ఆపేదెవరు? యాగం ఆగే సమయానికి ఋత్విక్కులు ఎవరిని యజ్ఞ గుండం లోకి ఆవాహన చేస్తారు? - జ)సర్పయాగాన్ని ఆపేది అస్తీకుడు. ఇతను ఆదిశేషుడికి మేనల్లుడు అవుతాడు.అస్తీకుడు సర్పయాగాన్ని ఆపటానికై జన్మించిన కారణ జన్ముడు. ఇతను యజ్ఞ వాటికకి వచ్చి వేద మంత్రాలతో ఆ యజ్ఞం చేస్తున్న రాజుకు ఆశీర్వచనాలు చదువుతూ ఉంటాడు. రాజు అతన్ని చూసి ముచ్చట పడి ఏం కావాలో కోరుకోమనగా ఈ యజ్ఞాన్ని ఆపేయమని కోరతాడు. యజ్ఞం ఆపే సమయం లో ఋత్విక్కులు తక్షకుడిని ఆవాహన చేస్తారు.అయితే తక్షకుడు భయంతో ఇంద్రుడి అభయం పొందగా మంత్ర ప్రభావం వల్ల ఇంద్రుడు కూడా యజ్ఞ గుండంలో పడబోతాడు. ఐతే యజ్ఞం ఆగిపోయిన కారణంగా రక్షింపబడతాడు. (తక్షకుడిని ఆవాహన చెయ్యటానికి ఋత్విక్కులు చదివే మంత్రం "సహేంద్రే తక్షకాయ స్వాహా!") -

--మహాభారతం-ఒక కొత్త విషయాము -4-. -

Image
--మహాభారతం-ఒక కొత్త విషయాము -4-. - మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం. . అర్జునుడికి గాండీవి అనే పేరు ఆయన ధరించే ధనస్సు వల్ల వచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ విల్లును అర్జునునికి బహుకరించేదెవరు? ఏ సమయంలో? . జ)గాండీవం అనే విల్లు నిజానికి వరుణుడిది. (అందుకే మహాప్రస్థాన సమయంలో అర్జునుడు ఆ విల్లును గంగా నదిలో వదిలేస్తాడు.) అయితే ఈ విల్లుని అగ్ని దేవుడు ఖాండవ దహన సమయంలో బహుకరిస్తాడు. (కారణం ఖాండవ వనాన్ని ఇంద్రుడు రక్షిస్తూండటం.

"మాయాబజార్" సినిమా !

Image
"మాయాబజార్" సినిమా ! - మన తెలుగు దృశ్యకావ్యము "మాయాబజార్" (విజయావారిది) సినిమా పూర్తిగా కల్పితము. ఈ కధావృత్తాంతము అంతా శ్రీపింగళి గారి అపూర్వ సృష్టి. వ్యాసభారతములో దీని ప్రస్తావనలేదు. వ్యాసభారతము ప్రకారము అసలు బలరామునికి శశిరేఖ అనే కూతురు లేనేలేదు. ఆ లేని శశిరేఖను సృష్టించి కధ మొత్తము పాండవులు లేకుండా నడిపించారు విజయావారు. శ్రీకృష్ణపాండవీయము: శ్రీకృష్ణపాండవీయము లో శకుని పాత్ర కొండవీటివెంకటకవి (సినిమా టైటిల్స్ లో కధ శ్రీరామారావుగారని ఉంది) మరో రకంగా చిత్రీకరించారు. చిత్రకధప్రకారము: భీముడు సుయోధనుడి సమక్షములో కౌరవులను "గోళకులు" అని సంభోధిస్తాడు. గోళకులు అంటే "భర్త పోయిన స్త్రీకి జన్మించిన వారు" అని అర్ధము. దీనికి సుయోధనుడు, వ్యాసుని నిజం అడుగుతాడు. అది నిజమేనని వ్యాసుడు చెప్పినట్లుగా మరో అసందర్భమైన కధ ఆ చిత్రములో చొప్పించారు. ఈ కధ వ్యాస భారతములో లేదు. ఇది ఎక్కడ నుండి సేకరించారో కనీసం నిర్మాతలు "టైటిల్స్" లో చూపించలేదు. వారి కధ ఇలా వుంది.  ఆ కల్పిత కధ ప్రకారము "గాంధారి జాతకములో వైధ్యవ్యం ఉన్నదని, దానిని తప్పించుటకు, ...

మన ఘంటసాల !

Image
మన ఘంటసాల ! - చలచిత్ర నేపథ్య సంగీత స్వరహేల గంధర్వ మణిమాల ఘంటసాల సంగీత సాహిత్య సరసార్ధ భావాల గాత్ర మాధుర్యాల ఘంటసాల పద్యాల గేయాల వచనాల శ్లోకాల గమకాల గళలీల ఘంటసాల బహువిధ భాషల పదివేల పాటల గాన వార్నిధిలోల ఘంటసాల  కమ్ర కమనీయ రాగాల ఘంటసాల గళవిపంచికా శృతిలోల ఘంటసాల గాంగనిర్ఘర స్వరలీల ఘంటసాల గాయకుల పాఠశాల మా ఘంటసాల। -

నడుస్తున్న వంటగదిలో ఉపగదులు ! (‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ )

Image
నడుస్తున్న వంటగదిలో ఉపగదులు ! (‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ ) - ఎక్కడో అక్కడ కనిపించే మొల్ల, వెంగమాంబ, ముద్దుపళని, రంగాజమ్మ మొదలైన నలుగురైదుగురు స్ర్తీల పేర్లు తప్ప ఆదికవి నన్నయ దగ్గరనుంచి ఆధునిక యుగం వరకు కవిత్వ ప్రపంచ సర్వస్వం పురుషాధీనమే. వేదయుగంలో మంత్ర ద్రష్టలుగా, స్రష్టలుగా గార్గి, మైత్రేయి వంటి మహిళల పేర్లు వినిపించినా మధ్య యుగంలో మాత్రం సమాజంలో గాని, సాహిత్యంలో గాని పడతుల ప్రాతినిధ్యం, ప్రభావం శూన్యం.  తాళ్ళపాక తిమ్మక్క, ముద్దుపళని, రంగాజమ్మ, వెంగమాంబ మొదలైనవాళ్ళు కవయిత్రులుగా ప్రసిద్ధి కెక్కినా ఆ తర్వాత ఆడవాళ్ళకు మళ్ళీ అంధకార యుగమే. ఆడవాళ్ళకు చదువు ఎందుకు అన్నారు. ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అని తర్కించారు. కొన్ని శతాబ్దాలపాటు వెనక్కి నెట్టేశారు. చీకట్లో వేగు చుక్కల్లా స్రీల జీవితాల్లో సంఘ సంస్కర్తలు బయలుదేరి ఆశల నక్షత్రాలు వెలిగించారు. చదువుల చందమామ ఉదయింపచేశారు. . 19వ శతాబ్దంలో కందుకూరి, గురజాడ మొదలగువారు జన్మించి స్ర్తీ విద్యను ప్రోత్సహించారు. ‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ అన్నారు. కోడూరి, యద్దనపూడి, మాద...

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం!

Image
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం! -- శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం  భజే వాలగాత్రం భజే హం పవిత్రం  భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజంబటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీ నామ సంకీర్తనల్ చేసినీ రూపు వర్ణించి, నీ మీద నే దండకం బొక్కటింజేయ నూహించి,నీ మూర్తినిన్ గాంచి, నీ సుందరం బెంచి,నీ దాస దాసుండనై, రామ భక్తుండనై నిన్నునే గొల్చెదన్, నీ కటాక్షంబునన్ జూచితే,  వేడుకల్ చేసితే,నా మొరాలించితే, నన్ను రక్షించితేఅం జనాదేవిగర్భాన్వయా! దేవ! నిన్నెంచ నేనెంత వాడన్దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై  స్వామి కర్యంబు నందుండి , శ్రీరామసౌమిత్రులం జూచివారిన్ విచారించి,  సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి  యవ్వాలినిన్ జంపి,కాకుస్థతిలకున్ దయా ద్రుష్టి వీక్షించి,కిష్కిందకేతెంచి, శ్రీరామ కర్యార్థివై, లంకకేతెంచియున్, లంకిణింజంపియున్, లంకనున్గాల్చియున్, భూమిజన్ జూచి,  యానందముప్పొంగ, యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి,శ్రీరాముకున్నిచ్చి,...

మంగళం!.

Image
మంగళం!. - రామచంద్రయ జనక రాజాజ మనోహరాయ  మామకబీస్తాదయ మహిత మంగళం ! - చారు కుమ్కుమోపేత చందనాలు చర్చితాయ హర కటక శోభితాయ బురి మంగళం! - విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ  సుజన చిత్త కామితాయ శుభద మంగళం ! - రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ  స్వామి భద్ర గిరి వరాయా దివ్య మంగళం! దివ్య మంగళం!... .దివ్య మంగళం.!! -

-మహాభారతం-ఒక కొత్త విషయాము -3-

Image
- -మహాభారతం-ఒక కొత్త విషయాము -3-. - మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం -- మహాభారతం చదివిన వారికి గుర్తుండిపోయే పాత్రల్లో మొట్తమొదటిది భీష్ముడి పాత్ర.ఆయనకి ఆ పేరు తను చేసిన భీషణ ప్రతిజ్ఞ వలన వచ్చినదే.అయితే భీష్ముడి అసలు పేరు ఏమిటి? - జ) భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు నిజానికి భీష్ముడు శాపగ్రస్తుడైన ధ్యో అనే  వసువు అంశలో జన్మిస్తాడు. =

నిత్య సత్యాలు - సుజీవన మిత్రాలు!

Image
నిత్య సత్యాలు - సుజీవన మిత్రాలు! -కం:  అడిగిన జీతమబీయని  మిడిమేలపు దొరను గొలిచి నిడుకుట కన్నన్ ,  వడిగల యెద్దుల గట్టుక  మడిదున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ! - ఎంత మొత్తుకున్నా పనిచేయించు కోవటమే తప్ప జీతం యచ్చేదిమాత్రం లేనేలేదు. జీతం అడగగనే యేదో ఒక జగడం. పనిసరిగా చేయటంలేదని వంకలు వెదకటం, ఇగో యిలాటివాడు మిడి మేలపు దొర ఇట్టి వ్యర్ధుని కడ పనచేయుట కవ్న వ్యవసాయ చేయుచు జీవించుట మేేలని కవి సందేశం! - ఒకప్పుడు వ్యవసాయం మీద యెంత విశ్వాసం! దానిని స్వతంత్ర వృత్తిగా భావించేవారు. ఆఫలసాయం మీద అంత భరోసా. ఇప్పుడది పోయింది. అతివృష్టి, అనావృష్టి, దీనికి తోడు దళారీలదోపిడీ, కారణంగా నేడు వ్యవసాయం సన్నగిలలుతున్నది. కాబట్టి యీపద్యానికి వ్యాఖ్యానం ప్రస్తుతం కష్టమే కదా ? -

మరపు రాని మన మహా నటుడు !

Image
మరపు రాని  మన మహా నటుడు ! - నటనకు ముఖ్యంగా కావలసిన ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము . సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ ఏమో అనిపిస్తుంది. . మాయాబజార్ కృష్ణుడు, లవకుశ రాముడు, పాండవ వనవాసం భీముడు, దానవీరశూరకర్ణ దుర్యోధనుడు, సీతారామకళ్యాణం రావణుడు, ఇలా నాయకులు, ప్రతినాయకులు అందరూ రామారావులే. అసలు దానవీరశూరకర్ణ సినిమా చూసిన తరువాత, . ఒకవేళ నిజం దుర్యోధనుడు ఈ భూమ్మీదకు వచ్చినా నువ్వు నువ్వుకాదు  ఎన్టీఆరే అసలు నువ్వంటావేమో.  . పాతాళభైరవిలో సాహసం చేసే డింభకుడిగా అలరిస్తే, కన్యాశుల్కం సినిమా చూసిన తరువాత గురజాడ వారి గిరీశం ఎలా ఉంటాడో ఊహించేసుకుంటాం. గుండమ్మకథ సినిమాలో సగం ఊడిపోయిన బొత్తాలున్న చొక్కా, పొట్టి నిక్కరు వేసుకున్న అంజిగాడు కనపడతాడు తప్ప ఎన్టీఆర్ కనిపించడు. . పురాణ పాత్రలు వేసేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోకపోవడం, మాంసాహారం తినకపోవడం, నేలమీదే నిద్రించడం ఆయనకు తను ధరించే పాత్రల మీద ఉన్న గౌరవానికి, నిబద్ధతకు ఉదాహరణలు. . ఆయన నటించిన సినిమాలు తెలుగు సినీ నటులందరికీ గ్రామర్ పుస్తకాల్లాంటివి. సుమారు మూడు నూర్లు సినిమాలలో నటించిన...

రంగు మారిన కష్టాలు !

Image
రంగు మారిన కష్టాలు ! - అప్పట్లో కష్టం అంటే -  తినడానికి సరైన తిండి దొరక్కపోవడం,  చదివినా ఉద్యోగం దొరక్కపోవడం!  భార్యకి భర్తపోరు అత్తపోరు,  ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు,  ఆరుగాలం కష్టపడిన రైతుకి  పంట చేతికి అందకపోవడం,  ఇంటిల్లపాది ఒక్కరి సంపాదనతో బ్రతకడం,  చాలీచాలని జీతాలు ఇలా  ఒకస్థాయిలో ఉండేవి  మిగతావాటికి చాలావరకు  సర్దుకుపోయేవారు. సరిపెట్టుకునేవారు.  🎾ఇప్పుడు కష్టం రూపురేఖలు మారిపోయాయి -  పరీక్ష తప్పితే కష్టం,  అమ్మ తిడితే కష్టం,  నాన్న కొడితే కష్టం,  పాఠాలు నేర్పే గురువు అరిస్తే కష్టం,  సరైన చీర కొనకపోతే కష్టం...!  ఇప్పటివారి కష్టాలకి కారణం ఒక్కటే -  - 💧అనుకున్నది దొరకాలి.  అప్పుడు కష్టం లేనట్లు.  పిన్నీసు దొరక్కపోయినా,  ప్రాణం పోయేంత కష్టం  వచ్చినట్లు బాధలు పడిపోతున్నారు...!  అప్పట్లో మనస్సు చాలా బలంగా ఉండేది  ఎందుకంటే చిన్ననాటి నుండి  కష్టాలు చూసి పెరిగేవారు.  ఇప్పుడు కష్టం అంటే ఏంటో తెలియక...

మహాభారతం-ఒక కొత్త విషయాము -2.

Image
మహాభారతం-ఒక కొత్త విషయాము -2. - మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం- - పాండవుల పురోహితుడు ఎవరు? అతడిని పురోహితుని గా వారికి సూచించినదెవరు? జ)పాండవుల పురోహితుడు ధౌమ్యుడు.  అతణ్ణి వారికి పురోహితునిగా సూచించేది కుంభీనసి అనే ఒక గంధర్వ కాంత.  అర్జునుడు ఈమెకు పాశుపతాస్త్రాన్ని భోధించి తాను ఆమె వద్ద  చాక్షుషీ విద్య నేర్చుకుంటాడు. -

సకల బాష ప్రవీణ-బుడుగు! గిరిసానికి కంచెం తక్కువ -వెంకటేశానికి నికి కొంచెం ఎక్కువ !

Image
సకల బాష ప్రవీణ-బుడుగు! గిరిసానికి కంచెం తక్కువ -వెంకటేశానికి నికి కొంచెం ఎక్కువ ! - అన్నట్టు చెప్పటం మరిచాను.  నాకేమో ఉంగాబాషా, పిచిక బాష, చికబాష, క బాష, బాష, ష అవన్నీ తెలుసు. నాకు కబాష సీగానపెసూనాంబ నేర్పింది. కానీ దానికి తెలుగు కూడా బాగా రాదు.  నన్ను బురుగు, బులుగూ అని అంతుంది. దానికి అసలు మాతలాద్దమే చేతకాదు. నాకిన్ని మాటలు ఎవరు నేర్పారు అనుకుంటున్నారా. రమణ.  వాడి ఫ్రెండ్ ఉన్నాడే బాపు వాడు నాకు ఆకారం ఇచ్చి, నా చేత చాలా వేషాలు వేయించాడులే.

రావే ఈశ్వరా! కావవే వరద సంరక్షించు భద్రాత్మకా! (గజేంద్ర మోక్షము )

Image
- రావే ఈశ్వరా! కావవే వరద సంరక్షించు భద్రాత్మకా! (గజేంద్ర మోక్షము ) . నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు బైటకుక్క చేత భంగపడును స్థానబలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ! . నీటి నుంచి బయటపడ్డ మొసలిని కుక్క కూడా బాధిస్తుంది. అదే నీళ్లలోని మొసలి ఏనుగును కూడా పీడించగలదు. ఈ అర్ధాన్ని తెలియచేసే పురాణగాథే భాగవతంలోని  గజేంద్ర మోక్షం కథ. త్రికూట పర్వతం చుట్టు పక్కల, పర్వతం మీద దట్టమైన అరణ్యాలు లెక్కకు మించి ఉండేవి. అందు ఒకానొక అరణ్యంలో మదపుటేనుగుల సమూహం ఒకటి ఉండేది. ఆ గజమూహం స్వేచ్ఛగా అరణ్యాన విహరిస్తూ, చిన్న,చిన్న జలాశయాలలో నీటిని తమ తొండాలలో నింపుకుని, వీపులమీద జల్లుకుంటూ, పండ్లను, కాయలను తింటూ జీవిస్తుండేవి. ఆ ఏనుగు సమూహం యొక్క రాజు మిక్కిలి మదించినవాడై, గర్వంతో, అహంకారంతో విహరిస్తుండేవాడు. ఒకనాడు అరణ్యంలోని సరస్సులో తన పరివారంతో జలకాలాడటానికి ఆ గజేంద్రుడు ప్రవేశించగా, అచ్చటే ఉన్న మకరీంద్రుడు తన బలిష్టమైన దంతాలతో ఏనుగు కాళ్ళను పట్టుకున్నాడు. కరి భూచరజీవులన్నింటిలోకి పెద్దది. దాని పదఘట్టనతో అది జీవులను హతమార్చగలదు. బలమైన దంతాలతో పొడిచి, అతిశక్తివ...

శివపార్వతుల కల్యాణం !

Image
-శుభసమయం ! శివపార్వతుల కల్యాణం ! (దోసె," ; "పూరీ"; " వడ" ; "సాంబారు" పదాలతో గురించిన పద్యం .) మ. జడలో -దోసెడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యమొప్పారగన్ నడయాడెన్ ఘలుఘల్లనన్ హొయలు చిందంజాజి -పూరీతి;పా -వడ యట్టిట్టుల చిందులాడి పడగా భవ్యాత్మ యైనట్టి యా పడతిన్ బార్వతి బెండ్లియాడితివి -సాంబా! రుద్ర! సర్వేశ్వరా! - -

పరోపకారః పుణ్యాయ- పాపాయ పరపీడనమ్"!

Image
పరోపకారః పుణ్యాయ- పాపాయ పరపీడనమ్"! - ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ పండితుడున్నాడు. పనిమీద పట్నం వెళ్లి తిరిగి వస్తుండగా పెద్ద వాన పడింది. గొడుగు లేదు. గబగబ ఒక ఇంటి అరుగుమీదకు చేరుకున్నాడు. - అది ఒక వేశ్య ఇల్లు. వర్షం తగ్గింది. ఆ ఇంటిముందునుంచి ఒక మరణించిన వ్యక్తి యొక్కశవాన్ని అంతిమయాత్రకు తీసుకువెడుతున్నారు. ఆ వేశ్య తన కుమార్తెను పిలిచి  ఆ చనిపోయిన వ్యక్తిస్వర్గానికి వెళ్లాడో లేక నరకానికి వెళ్లాడో తెలుసుకుని రమ్మని పంపింది. - బయట వున్న పండితుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. మరణించిన వారు ఎక్కడకు వెళతారో తెలుసుకునే  విద్య గురించి తనకు తెలియనందుకు చింతించి, ఆ విషయమేమిటో తెల్సుకునేందుకు మరికొంతసేపు అక్కడేఉండాలని నిర్ణయించుకున్నాడు. -  ఇంతలో బయటకు వెళ్లినామె వచ్చినది. చనిపోయిన వ్యక్తి నరకానికి వెళ్లాడని చెప్పింది. కాస్సేపటికి ఇంకొక శవయాత్ర వచ్చినది. మళ్లీ ఆ అమ్మాయి బయటకు వెళ్లి వచ్చినది. " అమ్మా! ఈ వ్యక్తి స్వర్గానికి వెళ్లాడు" అన్నది. - ఈ మాటలు విని ఆశ్చర్యపోయిన ఆ పండితుడు ఇంటి తలుపు తట్టాడు. ఒక స్త్రీ తలుపుతీసి "ఎవరు మీరు?...

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 31.

Image
మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 31. - గురుచరణాంబుజ నిర్భర భక్తః  సంసారాదచిరాద్భవ ముక్తః| సేంద్రియమానస నియమాదేవ ద్రక్ష్యపి నిజ హృదయస్థం దేవం|| - శ్లోకం అర్ధం :  అష్టసాధనలు అవలంబించు, అంతర్ముఖముగ మనసును నిలుపు, ఏకాగ్రతను సంపాదించు. అటువంటి శాంతమునొందిన సమాధి స్థితిలో ఆనందము నీ సొంతము అగును. తాత్పర్యము :  మానవుడు తెలివిగా నిత్య, అనిత్య వస్తువులేవియో, ఏమి పొందవలెనో, ఏమి విడువవలెనో వివేకముతో తెలుసుకొనవలెను. అష్టాంగ మార్గమును అవలంబించవలెను. ఆత్మ సాక్షాత్కారము బడయుటకు ఎనిమిది సాధనలు కలవు. అవి - యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహర, ధారణ, ధ్యాస, సమాధులు. ఈ విధముగా చివరి స్థితికి చేరిన జీవికి నిర్వికల్ప ఆత్మానుభవము కలిగి, పరమ ఆనందము, శాంతి, సుఖము లభించి ఆత్మ పరమాత్మలో ఐక్యము అగును.  - -సంపూర్ణం -

మహాభారతం-ఒక కొత్త విషయాము -1.

Image
మహాభారతం-ఒక కొత్త విషయాము -1. - మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం. ప్రశ్న -.కౌరవులు పాండవులను లక్క ఇంటిలో దహనం చెయ్యటానికి కుట్ర పన్నారని మనందరికీ తెలుసు.అయితే ఆ లక్క ఇంటిని ఏ ఊరిలో నిర్మించారు? దాన్ని నిర్మించిన వాస్తు పండితుడు ఎవరు? - జ) లక్క ఇంటిని కౌరవులు వారణావతం అనే ఊరిలో నిర్మిస్తారు. ఆ ఇంటిని నిర్మించిన వాస్తు పండితుడు పురోచనుడు. పాండవులకు ఆ ఊరిపై ఆసక్తి కలగటానికి ఎల్లప్పుడూ ఆ ఊరి గురించి వర్ణించేందుకు కౌరవులు కొందరు జీతగాళ్ళను నియమిస్తారు.వారి మాటల వల్ల ఆ ఊరిపై ఆసక్తి కలిగి పాండవులు ఆ ఊరికి బయలుదేరేటపుడు భీష్ముడు వారిని హెచ్చరిస్తాడు.అంతే కాక వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి(సొరంగం తవ్వేందుకు) ఒక సహాయకుడిని వారి కన్నా ముందే అక్కడికి పంపిస్తాడు.

గణ పతి భార్యలు సిద్ధి ,బుద్ధి .

Image
శుభోదయం! - గణేశ – వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ | నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా || - గణ పతి భార్యలు సిద్ధి ,బుద్ధి . కుమారస్వామి భార్యలు వల్లీ ,దేవసెనలు . వీరు శబ్ద వాచ్యులు ,శక్తి స్వరూపులే కాని ,స్త్రీ సుఖం ఇచ్చిన వారు కాదు . భ్రాంతిలో ఉన్న దాంపత్యం ఇది . -

విద్య!

Image
విద్య! - విద్య లేకుంటేను విభవమ్ము రోత; వినయమ్ము లేకుంటె విద్యలూ రోత!. - - భర్తృహరి సుభాషితం - - విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్ విద్య నృపాల పూజితము విద్య నేరుంగనివాడు మర్త్యుడే.! - భావం : పురుషునికి విద్యయే రూపము. విద్యయె రహస్యముగా దాచి పెట్టబడిన ధనము,విద్యయే సకల భోగములను,కీర్తిని, సుఖమును కలుగజేయును. విద్యయే గురువువలె అన్నింటిని బోధించును. పరదేశమునందు చుట్టము వలె సహాయము చేయును. విద్యయే రాజపూజితము. ఇట్టి విద్య లేనివాడు మనషుడే కాదు.