ఏ.యం.రాజా!
ఏ.యం.రాజా! విప్రనారయణ సినిమాలో ఈపాట విన్నప్పుడు రాజా గుర్తుకు వచ్చేడు. . .మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా భాసిల్లెనుదయాద్రి బాల భాస్కరుడు వెదజల్లె నెత్తావి విరబూచి విరులు విరితేనెలాని మైమరచు తుమ్మెదలు లేచెను విహగాళి లేచెను నిదుర చల్లచల్లగ వీచె పిల్ల తెమ్మెరలు రేయి వేగినది వేళాయె పూజలకు ॥ చరణం : పరిమళద్రవ్యాలు బహువిధములౌ నిధులు గైకొని దివ్యులు కపిలధేనువును అద్దమ్ముపూని మహర్షి పుంగవులు మురువుగా పాడ తుంబురు నారదులును నీ సేవకై వచ్చి నిలచియున్నారు సకుటుంబముగ సురేశ్వరులు కానుకలు గైకొని మొగసాల కాచియున్నారు ॥ దేవరవారికై పూవుల సరులు తెచ్చిన తొండరడిప్పొడి మురియ స్నేహదయాదృష్టి చిల్కగా జేసి సెజ్జను విడి కటాక్షింప రావయ్యా ॥ ఏ.యం.రాజా (అయిమల మన్మథరాజు రాజా) (జూలై 1, 1929 - 1989) 1950వ దశకములో తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. విప్రనారాయణ, చక్రపాణి, ప్రేమలేఖలు, మిస్సమ్మ పాటలు రాజా గాత్ర మాధుర్యానికి కొన్ని మచ్చు తునకలు. ఈయన వ...