మా.. రోజులలో క్రికెట్ వీరులు ... 8... .సునీల్ గవాస్కర్ !

సునీల్ గవాస్కర్ !

ఈయన మహాగొప్పబాట్స మాన్. కావచ్చు కాని ఇంత జిడ్డు.. selfish 

batsman... ఎవ్వరు చూసివుండరు...ఆయెన సెంచరీ లు కొట్టరుకాని ఆసెంచరీవల్ల మనంఎప్పుడు గెలవలేదు.

వెంకటరాఘవన్ కెప్టెన్అయితేసహించలేక వన్day మ్యాచ్ లో మొదటినుంచిచివరివరకు డిఫెన్స్ ఆడి 36 రన్స్ కొట్టి నాట్out నిలిచి అందరిచే

ఛి చీ అనిపించుకున్నడుఇంగ్లీష్ లో..

"It was the most disgraceful and selfish performance I have ever seen… his excuse [to me] was, the wicket was too slow to play shots but that was a stupid thing to say after England had scored 334" GS RAMCHAND, INDIA'S MANAGER

క్రికెట్ ప్రపంచంలో సునీల్ గవాస్కర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆల్ టైమ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన సునీల్... ఇన్నింగ్స్ ఓపెనింగ్‌లో సంపూర్ణ విజయాన్నే సాధించాడు. మహాజిడ్డుగా ముద్ర వేసుకున్న సన్నీ.. క్రీజ్‌లో కుదురుకుంటే మాత్రం అవుట్ చేయడం ప్రత్యర్థి జట్టుకు అసాధ్యమే. ఫ్రంట్, బ్యాక్‌ ఫుట్‌ షాట్లతో ఆలరించే సన్నీ.. బాల్ గమనాన్ని అంచనా వేయడంతో మంచి దిట్ట.

టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించాడు. ఈ రికార్డును మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇటీవల బద్ధలు కొట్టిన విషయం తెల్సిందే. గణాంకాల పరంగానే సునీల్‌ గవాస్కర్‌ను ఇతర బ్యాట్స్‌మెన్స్ అధికమించ వచ్చేమోగానీ.. అతని శైలి, నేర్పు, టెక్నిక్‌లలో మాత్రం అది సాధ్యం కాకపోవచ్చు.

ఇకపోతే.. 1971లో పోర్ట్ ఆఫ్ స్పైన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ప్రవేశం చేసిన సునీల్ గవాస్కర్ తన చివరి టెస్టును 1987లో బెంగుళూరులో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టుతో తన టెస్టు కెరీర్‌ను ముగించుకున్నాడు. అలాగే వన్డే రంగ ప్రవేశం లీడ్స్ ఇంగ్లాండ్‌తో 1974 జులై 13వ తేదీన జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేయగా, అదే ఇంగ్లాండ్‌తో 1987 ముంబైలో జరిగిన మ్యాచ్‌తో తన వన్డే కెరీర్‌కు స్వస్తి పలికాడు.

వ్యక్తిగత ప్రొపైల్

పూర్తి పేరు.. సునీల్ మనోహర్ గవాస్కర్

పుట్టిన తేది.. 1949 జులై 10. 

ప్రస్తుత వయస్సు.. 67సంవత్సరాల 143 రోజులు.

ప్రధాన జట్లు.. భారత్, ముంబై, సోమర్‌సెట్.

నిక్ నేమ్స్.. సన్నీ.

బ్యాటింగ్ స్టైల్.. రైట్ హ్యాండ్.

బౌలింగ్ స్టైల్.. రైట్ ఆర్మ్ మీడియం, రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్

మొత్తం టెస్టులు.. 125. ఇన్నింగ్స్.. 214, 

మొత్తం పరుగులు 10,122.

అత్యధిక స్కోరు.. 236 (నాటౌట్).

సెంచరీలు.. 34, అర్థ శతకాలు.. 45.

వన్డే మ్యాచ్‌లు 108. ఇన్నింగ్స్..102.

మొత్తం పరుగులు.. 3092

అత్యధిక స్కోరు.. (103 నాటౌట్).

మొత్తం సెంచరీలు.. 1, అర్థసెంచరీలు.. 27.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!