ఆకాశంబుననుండి‬ శంభుని శిరం బందుండి!

ఏనుగులక్ష్మణకవి భర్తృహరి నీతిశతకమునుండి ఒక పద్యం.!

ఈపద్యములో వివేకము కోల్పోయి ప్రవర్తిస్తే 

ఎంతటివారికయిన కష్టములు తప్పవనిచెబుతున్నాడు

.

‪#‎ఆకాశంబుననుండి‬ శంభుని శిరం బందుండిశీతాద్రి సు

శ్లోకంబైన హిమాద్రినుండి భువి భూలోకంబునందుండి య

స్తోకాంభోధి(బయోధినుండి పవనాంధోలోకముం జేరె గం

గాకూలంకష పెక్కుభంగులు వివేకభ్రష్టసంపాతముల్."

అర్థము

గంగానది ఆకాశమునుండి శివునితలమీదపడింది

.అక్కడనుండి హిమాలయాలు( మంచుకొండ లు)మీదపడింది.

అక్కడనుండి నేలమీదకు వచ్చింది.

అక్కడనుండిసముద్రముచేరింది.

అక్కడనుండి పాతాళలోకము చేరింది.

వివేకముకనుక కోల్పోతే ఇక్కట్లే.

.

వివరణ

హిందూపురాణాలప్రకారము కపిలమహర్షి కోపానికి బూడిదయినతనపూర్వీకులకు స్వర్గలోకప్రాప్తికొరకు పవిత్రగంగను తెచ్చి ని బూడిదమీద ప్రవహింపజేయుటకు భగీరథుడు గంగనుప్రార్థించి ఆమెను భూమికి తీసుకువచ్చి తనపూర్వీకులకు స్వర్గలోక ప్రాప్తి కలిగిస్తాడు.భగీరథుని కోరిక తీర్చబోయి గంగ పడిన ఇక్కట్ట్లు ఈపద్యములో ప్రస్తావించాడు.

గంగఒకేసారి నాధాటికి భూమి తట్టుకోలేదని చెబితే భగీరథుని తపస్సుకిమెచ్చి శివుడు గంగను తనతలమీదకు దూకమని గంగనుతనజటాఝూటములోబందిస్తాడు.అక్కడనుండి హిమాలయముల మీదికివురికింది ,హిమాలయముల నుండి భూమిమీదకువచ్చి భగీరథుని కోరిక నెరవేర్చి ప్రవహిస్తువెళ్ళిసముద్రములోకలసింది అక్కడనుండి చివరకునాగుల లోకమయిన పాతాళలోకము చేరింది.పవనాంధస్సులు అంటే పవనము(గాలి)అంధస్సులు(ఆహారముగకలవారు) .అంటేనాగులు.

అంటే ఎంతటివున్నతులైన వివేకముకోల్పోయి,తీసుకునేనిర్ణయమమువలనకలగు కష్టములు ఆలోచించకుండాఆవేశముతోనిర్ణయముతీసుకుంటేగంగవలే ఇక్కట్ట్లు పడాలి.ఇక్కడ కవివుద్దేశ్యము మనము దేవతగకొలిచేగంగామాతే యిన్నియిక్కట్ట్లుపాలయినది,సామాన్యమానవులమనమెంత!అందుచేవివేకముకోల్పోయి ఆవేశములోనిర్ణయము తీసుకోరాదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!